BREAKING NEWS

మహిళా దినోత్సం స్పెషల్: ఈ భారతీయ మహిళలు ఎందరికో ఆదర్శం...!

వంటిల్లే ప్రపంచం కాదు. ఇల్లే సర్వస్వము కాదు. మహిళలు కూడా నేడు అన్ని రంగాల్లోనూ ఉంటున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మేము కూడా ఈ పోటీ ప్రపంచంలో పరిగెడతాం అంటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. జీవితం లో ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రతి ఒక్కరూ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అయ్యి ఎదురు వెళ్తున్నారు. ఈ సమాజం లో ఎన్నో ఆటుపోట్లుని తట్టుకుంటూ అందరూ సమానమే అంటూ ముందుకు వెళ్లి పోతున్నారు.
 
ఆర్థికంగా కూడా నేడు మహిళలు తమ సొంత కాళ్ల పై నిలబడి... ఒక మిస్సైల్ లాగ దూసుకు వెళ్ళిపోతున్నారు. నిజంగా ఒక మహిళ  ఉపాధ్యాయునిగా, డాక్టర్ గా,  పైలెట్ గా, అథ్లెట్ గా, లాయర్ గా, వ్యాపారినిగా.... ఇలా అన్ని రంగాలలో కూడా రాణిస్తూనే ఉంది. ఈరోజు కొంత మంది ఆదర్శ మహిళలు గురించి చూద్దాం...!
 
నిజం చెప్పాలంటే నేటి కాలం లో  చాలా మంది ఎంతో కష్టపడి చదువుతూ, శ్రమిస్తూ  నచ్చిన రంగాల్లో రాణిస్తున్నారు. అయితే మహిళా దినోత్సవం స్పెషల్ గా కొంత మంది ఆదర్శ మహిళలు గురించి ఇప్పుడు చూద్దాం...! ఇక ఎందుకు ఆలస్యం దీని కోసం పూర్తిగా చూసేయండి. ఎన్నో విషయాలని ఇప్పుడే మీరు తెలుసుకోండి. వివరాల లోకి వెళితే..
 
అరుణ రాయ్:
 
అరుణ రాయ్ సివిల్ సర్వీసులో కి ప్రవేశించారు. ఆమె మొట్టమొదట 1968వ సంవత్సరం లో ఐఏఎస్ ఆఫీసర్ గా అయ్యారు. 1974 వ సంవత్సరం లో సివిల్ సర్వీస్ ని ఆమె వదిలేశారు. ఆ తర్వాత ఆమె Mazdoor Kisan Shakti Sangathan (MKSS ) అనే ఒక ఆర్గనైజేషన్ ని స్థాపించారు. ఆమె ఎంతో ఉత్తమమైన పాత్ర పోషించారు. నిజంగా ఆమె ఎంతో మందికి ఆదర్శం అనే చెప్పాలి. ఇలా ఆమె ఎంతో మంది రైతులకి సహాయం చేసారు. అలా ఆమె చాలా మంది రైతుల కోసం వెలుగై నిలిచారు. నిజంగా ఇటువంటి గొప్ప మహిళలు ఎన్నటికీ ఆదర్శమే...! 
 
 గీతా గోపినాథ్:

 
హార్వర్డ్ ఎకనామిస్ట్ గీత గోపీనాథ్. International Monetary Fund (IMF) లో చీఫ్ ఎకనామిస్ట్ గా నియమితులయ్యారు. ఆమే మొట్ట మొదటి మహిళ కావడం విశేషం. అమర్త్యసేన్ తర్వాత పర్మినెంట్ మెంబర్షిప్ దక్కింది ఈమెకే. అంతే కాదండి  ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తర్వాత అంత ఉత్తమమైన పొజిషన్ ని దక్కించుకున్న భారతీయుల్లో ఈమె రెండవ వారు. గీతా గోపినాథ్ కూడా చాల మందిని ఇన్స్పైర్ చేస్తారు. 
 
హిమా దాస్:
 

హిమా దాస్ గురించి చెప్పడానికి ఏముంది..?  ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా..!  ఈమె నిజంగా చాలా మందికి ఆదర్శం అనే అనాలి. ఐఏఎఫ్ వరల్డ్ అండర్ 20 లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్ట మొదటి మహిళ హిమా దాస్.  జకార్తా లో జరిగిన ఆసియన్ గేమ్స్ లో వెండి, బంగారం  మెడల్స్ ని హిమా దాస్ సాధించారు. ఈమెని అందరు డింగ్ ఎక్స్ప్రెస్ అంటారు. నిజంగా ఈమె చాలా మందికి ఇన్స్పిరేషన్ అనే మనం అనాలి.
 
అవని చతుర్వేది:
 
ఈమె భారత దేశం లో పైలెట్ ని  సోలోగా నడిపిన మొట్ట మొదటి మహిళా పైలట్. ఎంతో మంది ఆడ పిల్లల కి ఈమె ఆదర్శం అనే చెప్పాలి. పైగా ఆర్మ్డ్ ఫోర్స్ లో కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈమెని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఈమె 25 సంవత్సరాలు గా ఉన్నప్పుడే హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో ట్రైనింగ్ పూర్తి చేశారు. నిజంగా ఆడపిల్లలు అట్టడుగున ఉండకుండా అన్ని రంగాల్లో ఉండాలని ముఖ్యముగా ఆర్మ్డ్ ఫోర్సెస్ లో కూడా రాణించాలని అనడానికి ఈమె నిదర్శనం. నిజంగా ఇప్పటి ఆడ పిల్లలు ఈమెని కనుక ఆదర్శంగా తీసుకున్నారు అంటే ఉన్నత శిఖరాలని అవరోధించవచ్చు.
 
ఇందు మల్హోత్రా:
 
ఇందు మల్హోత్రా సుప్రీం కోర్ట్ ఎడ్వాకెట్. ఇలా ఈ పదవిని తీసుకున్న రెండవ మహిళా ఈమె. పైగా ఈమె ఎంత గానో సేవ చేస్తారు.  విశాఖ కమిటీ సభ్యురాలు, మల్హోత్రా 2013 లో మహిళా న్యాయవాదులను లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి ఏర్పాటు చేసిన మహిళా న్యాయవాదుల ప్యానెల్ ‌లో ఉన్నారు. నిజంగా ఈమె ఎంతో మంది మహిళలకి ఆదర్శం.
 
కాలం మారిపోతోంది..!  ఎన్నో విధాలుగా మనం అభివృద్ధి చెందుతున్నాం. టెక్నాలజీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది ఇళ్లల్లో చదువుకోడానికి సదుపాయాలు కూడా బ్రహ్మాండం గానే ఉన్నాయి. కనుక ఆడపిల్లలు ఆగిపోకూడదు. నచ్చిన మార్గాన్ని ఎంచుకుని నలుగురికి ఆదర్శం అయ్యి...ఉన్నత శిఖరాలను అవరోధించాలి. ఈ ఆదర్శ మహిళలని ఆదర్శంగా తీసుకుని అలా ఉండాలి అని... మీ గమ్యాన్ని రూపొందించుకోండి. దానికి తగ్గట్టు మీరు చదువుకొని బంగారు భవిష్యత్తు ని పొందండి. దీని తో మీరు కూడా మరొకరికి ఆదర్శం అవ్వచ్చు.