BREAKING NEWS

నాగార్జున కొండ ప్రత్యేకత, విశేషాలు మీకోసం...!

ఆంధ్రప్రదేశ్ లో  చూడడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. చారిత్రక కట్టడాలు, దేవాలయాలు జలపాతాలు ఇలా ఎన్ని చూసుకున్నా మనం ఎన్నో ప్రదేశాలను సందర్శించవచ్చు. పైగా ఇలా మనం ఏదైనా ప్రదేశాలని చూస్తే... వాటి వలన మనకి అనేక విషయాలు తెలుస్తాయి.  అయితే వాటిలో నాగార్జున కొండ కూడా చూడదగ్గ ప్రదేశం. తప్పకుండా వీలైనప్పుడు లేదా  సెలవు ఉన్నప్పుడు దీన్ని సందర్శించండి.
 
 కుటుంబ సమేతంగా వెళ్లి ఇక్కడ ఆనందించ వచ్చు. అయితే నాగార్జున కొండ అంటే ఏమిటి...?,  ఇది ఎక్కడ ఉంది..?, దీనిని ఎలా చేరుకోవాలి..? ఇలా అనేక విషయాలు ఈ రోజు మీ కోసం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.
 
నాగార్జున కొండ గురించి చూస్తే... నాగార్జున కొండ ఒక పురాతన బౌద్ధ ద్వీప నగరం. ఇది మన ఆంధ్రప్రదేశ్ నల్గొండ జిల్లా లో ఒక భాగంగా ఉన్నది. ఈ పట్టణం నాగార్జున సాగర్ కి చాలా సమీపం లో ఉంది. హైదరాబాద్ నుంచి ఇది 150 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఈ ద్వీప పట్టణం 1960లో రూపుదిద్దుకున్నది. దీనికి గల కారణం ఏమిటంటే నాగార్జున సాగర్ డాం కట్టినప్పుడు కొండ మునిగి పోయింది. ఈ పట్టణం భారత దేశం యొక్క ప్రసిద్ధి చెందిన ఒక బౌద్ధ స్థలంగా పేరు పొందింది.
 
 అలాగే ఇక్కడికి కేవలం మన దేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతో మంది వచ్చి చూస్తూ ఉంటారు. పురాతన కాలం లో నీటి లో మునిగిన కొండను శ్రీ పర్వత అనే పిలుస్తూ ఉండే వారు. ఈ ద్వీపానికి ఎలా పేరు వచ్చింది అంటే..? 
 
ఇక ఈ ద్వీపానికి పేరు ఎలా వచ్చింది అనే విషయం చూసారే.. ఈ ద్వీపానికి బౌద్ధ మత ప్రచారకుడు బౌద్ధ సన్యాసి అయిన నాగార్జున గౌరవిస్తూ నాగార్జున కొండ దీనికి పేరు పెట్టారు. ఈ పట్టణం బుద్ధుడు ఉన్నప్పుడు తర్వాత కూడా ఒక అధ్యయన కేంద్రంగా నిరూపించబడింది అని అంటారు. దీనికి ఉన్న చరిత్ర అంతా ఇంతా కాదు. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉందని చెప్పొచ్చు.
 
అలానే ఇక్కడ చాలా బౌద్ధా రామాలు, విశ్వ విద్యాలయాలు కూడా ఉన్నాయి. అంతే కాదండీ వీటిలో విద్యను అభ్యసించడానికి విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఈ జలాశయం మధ్య లో ఉన్న ఈ మ్యూజియం ప్రపంచం లోని పురావస్తు ప్రదర్శన శాల లో అతి పెద్ద ద్వీపం ప్రదర్శన శాల బుద్ధుని గా చెప్పబడుతున్న దంత అవశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.
 
నాగార్జున కొండ వద్ద ఉండే శాసనాలు:
 
ఇక్కడ శాసనాలను అధ్యయనం కోసం ఏడు విధాలుగా విభజించారు. నాగార్జున కొండ లో సుమారు 400 వరకు శాసనాలు లభించాయి. చాలా వరకు దాన ధర్మాలకు సంబంధించినవి. ఇవి ప్రాకృత సంస్కృత తెలుగు భాషల లో ఉన్నాయి. ఇక్కడ విభజించినా 7 శాసనాలను చూస్తే...  
 
ఆయక స్తంభ శాసనాలు,  చైత్య గృహాల లో లభించిన శాసనాలు, పగిలిన శాసనాలు,  శిల్ప ఫలకాల పైనున్న శాసనాలు, ఛాయా స్తంభ శాసనాలు, బ్రాహ్మణ మత ఆలయ సంబంధ శాసనాలు, ఇతర శాసనాలు. అయితే ఇలా క్రమ క్రమంగా ఈ ప్రదేశమంతా కూడా విహార కేంద్రంగా మారింది.
 
ఇదే కాకుండా ఎంతో మంది వచ్చి చూస్తూ ఉంటారు. నిజంగా చూడడానికి చాలా బాగుంటుంది. ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం లో ఎంతో మంది వచ్చి సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మత వ్యాప్తి కొరకు అమరావతి నుండి ఇక్కడకు వచ్చి నివాసం ఏర్పరుచుకున్నాడు. మహాయాన బౌద్ధ మతాన్ని స్థాపించి ఈయన సుమారు 60 సంవత్సరాల పాటు ఈ సంఘాన్ని, ఇక్కడ ఉన్న విద్యాలయాలను కూడా నిర్వహించారు.
 
ఇక్కడ ఉండే ఈ విద్యాలయాలకు అప్పట్లోనే చైనా, శ్రీలంక నుండి విద్యార్థులు వచ్చే వారు అప్పట్లోనే వీటిని నిర్మించారు.
 
నాగార్జున కొండ కి ఎలా వెళ్లాలి...?
 
 విహార కేంద్రంగా మారిన ఈ నాగార్జున కొండ సందర్శించాలంటే గుంటూరు నుండి ఇది సుమారు 140 ఏడు కిలో మీటర్ల దూరం లో మరియు హైదరాబాదు నుండి సుమారు 166 కిలో మీటర్లు ఉంది మాచర్ల కేంద్రం నుండి 22 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే బస్సుల ద్వారా సొంత వాహనాలు ద్వారా వెళ్లొచ్చు..
 
 నాగార్జున కొండ ని చేరుకోవాలంటే ఇంటి దగ్గర ఉండే రైల్వే స్టేషన్ మాచర్ల రైల్వే స్టేషన్ రైలు మార్గం నుంచి వెళ్లేవారు మాచర్ల దగ్గర వరకు వెళ్లి అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లొచ్చు. ఏది ఏమైనా చారిత్రక ప్రదేశాలు చూడడం చాలా బాగుంటుంది. పైగా పిల్లలకి కూడా మనం వాటి ద్వారా నేర్పించ వచ్చు. అలానే  ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. తెలియని కొత్త విషయాలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తే తెలుస్తాయి. దీన్ని యొక్క చరిత్రని, దీని గొప్పతనాన్ని చూశారు కదా...! మరి సమయం దొరికినా దొరకక పోయినా కల్పించుకుని ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే దీని ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి.