BREAKING NEWS

అనారోగ్య సమస్యలని ఇలా కనుక్కోవచ్చు...!

ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధ్యం. ఆరోగ్యం లేదు అంటే ఏం చేయాలన్నా సాధ్యం కాదు. మన ఆరోగ్యాన్ని మనమే పెంపొందించుకోవాలి. ఇప్పుడు మనం ఉన్న రోజులు చూస్తే జీవితం లో నాణ్యత తగ్గిపోయింది. మనం తినే పండ్లు, కూరగాయలు వగైరా వాటిల్లో కూడా పోషకాహారాలు కనుమరుగైపోయాయి. ఎటు చూసుకున్నా ఇబ్బందులే ఉంటున్నాయి. పూర్వికులుని చూస్తే వాళ్ళు 80, 90 ఏళ్లు వచ్చినా గట్టిగానే ఉంటున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఇప్పటికీ కూడా ఆనందంగా జీవిస్తున్నారు.
 
కానీ ఈ తరం అలా లేదు. ఆరోగ్యం మొత్తం మూడు పదులు నిండకుండానే  కూలిపోతుంది. ఒక పక్క కాలుష్యం వంటివి కూడా పెరిగిపోతున్నాయి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే కష్టమే మన శరీరం అనేక రకాల అనారోగ్యాలని పసిగడుతుంది. కాస్తో, కూస్తో ముందుగా వాటిని పసిగట్టి మనం డాక్టర్ ని సంప్రదించి ముందు గానే చికిత్స పొందుతూ ఆ ప్రమాదాల నుంచి బయట పడవచ్చు. ఇది నూటికి నూరు పాళ్ళు నిజం.
 
ఎందుకంటే ఆరోగ్యం క్షీణించే కొద్ది దానిని కంట్రోల్ చేయడం మన చేతుల్లో ఉండదు. కానీ చిన్న చిన్న సమస్యలను డాక్టర్ ని సంప్రదించి అదుపు చేసుకోవచ్చు. అయితే మన ఆరోగ్యం పాడై పోయిందని మన ఆరోగ్యానికి ఏదో ఇబ్బంది కలుగుతుందని మనం ఎలా పసిగట్టాలి..? నిజమేనండి మనం సులువుగా పసిగట్టవచ్చు. అది ఎలాగ, ఎటువంటి లక్షణాలు వల్ల మన ఆరోగ్యం బారినపడ్డ మనకి తెలుస్తుంది. ఇలా అనేక విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఆలస్యమెందుకు వీటి కోసం పూర్తిగా చూసేయండి. పూర్తి వివరాల్లోకి వెళితే..
 
 ఎత్తు తరిగిపోవడం:
 
మామూలుగా మనం ఎత్తు పెరుగుతూ ఉంటాము. వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరుగుతూ ఉంటుంది. కానీ ఎత్తు తరిగిపోవడం ఎప్పుడైనా చూశారా..?  నిజమేనండి ఎత్తు కూడా తరిగిపోతూ ఉంటాం. ఎప్పుడు అంటే మనం అనారోగ్యం బారిన పడినప్పుడు. మీరు కనుక ఎత్తు తగ్గిపోవడాన్ని మీలో గమనిస్తే తప్పకుండా మీకు అనారోగ్యం ఉందని గమనించండి. నిపుణులు చెప్పిన దాని ప్రకారం బోన్స్ వల్ల కలిగే సమస్య కారణంగా ఎత్తు తరిగిపోతూ ఉంటారట. 
 
ఒంట్లో క్యాల్షియం ప్రోటీన్ లాంటి న్యూట్రియన్స్ తగ్గిపోతే ఇలా జరుగుతుంది. కనుక ఎప్పుడైనా మీరు ఎత్తు తగ్గిపోయారు అంటే తప్పకుండా అది ప్రోటీన్ కాల్షియం వంటి న్యూట్రియన్స్ మీ బాడీలో తగ్గిపోయాయని మీరు గమనించి దీనికి తగిన వైద్యం తీసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఇలా అనుసరించండి దీని వల్ల మీకు మంచి కలుగుతుంది.
 
చెడు శ్వాస:

 
మనకి సహజంగా దవడలు వాపు వచ్చినప్పుడు దుర్వాసన కలుగుతుంది. చెడు శ్వాస వచ్చింది అంటే రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా లేదు అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీ నోటి నుంచి చెడు శ్వాస రాలేదు అంటే రోగ నిరోధక శక్తి బాగానే ఉన్నట్టు. కాబట్టి ఎప్పుడైనా చెడు శ్వాస వచ్చింది అంటే మీ రోగనిరోధక శక్తి సరిగా లేదు అని సంకేతం.
 
 మూత్ర విసర్జన:
 
 కొన్ని కొన్ని సార్లు మనకి జ్వరం వంటివి ఏమైనా వచ్చినప్పుడు మన యూరిన్ కలర్ మారడం, స్మెల్ రావడం ఉంటుంది. మామూలుగా అయితే పసుపు రంగు లో యూరిన్ ఉంటుంది అది కూడా లైట్ పసుపు రంగు. అలాగే కో వాసన కూడా రాదు. ఒకవేళ ఇలా లేనట్టు అయితే ఏదో సమస్య ఉన్నట్లే అని గమనించండి. దీనితో మీరు సమస్యను సులువుగా పసిగట్టి ఏమైనా అనారోగ్యాలు ఉంటే తెలుసుకోవచ్చు. అంతేకానీ లైట్ లే అనుకుంటే పెద్ద సమస్య మీకు వచ్చే అవకాశం ఉంది.
 
గోళ్ళు పై రంగు మారడం: 
 
మామూలుగా మనం కళ్ళను చూసి ఆరోగ్యంగా ఉన్నామొ లేదో తెలుసుకోవచ్చు. అలానే గోళ్ళను కూడా చూసి మనం ఆరోగ్యంగా ఉన్నామొ లేదో తెలుసుకోవచ్చు. సాధారణంగా గోళ్ల పై ఎరుపు రంగు ఉంటుంది. అలానే కాళ్ళ గోళ్ళ పై కూడా ఇలానే ఉంటుంది. విచిత్రమైన గీతలు లేదా రంగు లేక పోవడం ఉన్నట్టయితే తప్పకుండా ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చినట్టు గమనించండి. కాబట్టి మీరు 
గొల్లని బట్టి  కూడా తెలుసుకోవచ్చు. దీనితో మీకు ఏమైనా అనారోగ్యం వస్తే తెలిసిపోతుంది
 
పెదవులు పొడిబారడం:

 
ఎక్కువగా చలి కాలం లో పెదవులు పొడిబారిపోతాయి. దీని కోసం మనం లిప్ బామ్ వగైరా వాటిని ఉపయోగిస్తుంటాం. పెదవులు పొడిబారిపోతే ఏంటి సమస్య అనుకుంటున్నారా..? సమస్య ఉంది. అండి నిపుణులు చెప్పిన దాని ప్రకారం విటమిన్స్ లోపం కనక ఉంటే పెద్దలు పొడిబారిపోతూ ఉంటాయట. కాబట్టి చలిగా లేనప్పుడు చలికాలం కానప్పుడు కూడా ఇలా జరుగుతుంటే తప్పకుండా విటమిన్ లోపం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
 
చర్మంపై వింత మచ్చలు:

 
మన ఆరోగ్యాన్ని చర్మాన్ని చూసి కూడా చెప్పవచ్చు. సరైన ఆహారం తీసుకోవడం కనుక మీరు చేశారు అంటే చర్మం యొక్క నాణ్యత చాలా బాగుంటుంది. అలానే ఎప్పుడైనా మీకు వింత మచ్చలు కనక చర్మంపై ఉన్నాయి అంటే తప్పకుండా అది అనారోగ్య సమస్య అని మీరు తెలుసుకోండి. దీని వల్ల కూడా మీరు ముందు గానే అనారోగ్య సమస్యలు పసిగట్టవచ్చు.
 
అలాగే సరిగ్గా నిద్ర పోలేక పోతున్నా, ఒంట్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నా కూడా మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే తప్పకుండా ముందు జాగ్రత్త తీసుకోండి. వెంటనే మీ ఫ్యామిలీ డాక్టర్ ని కన్సల్ట్  చేసి తగిన మెడికెషన్ తీసుకోండి