వేసవికాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. పైగా చాలా వేగంగా హైడ్రేట్ అయిపోతూ ఉంటాము. ఎన్ని నీళ్లు తాగినా దాహం వేస్తూనే ఉంటుంది. తీవ్రమైన ఎండలు ఒక పక్క వేధిస్తుంటాయి. నిజంగా వేసవి లో తిండి కూడా తినాలనిపించదు. పైగా దాహం విపరీతంగా ఉంటుంది. ఇంట్లో బట్టర్ మిల్క్, లస్సి వగైరా వాటిని ఎలాగో చేసుకుంటూ ఉంటారు. అలానే చాలామంది గంటకు ఒకసారి లేదా రెండు గంటలకు ఒకసారి నిమ్మ రసం లో ఉప్పు, నీళ్ళు వేసుకొని తాగుతూ ఉంటారు. అలానే బత్తాయి రసం వంటివి కూడా తీసుకుంటూ వుంటారు.
అయితే ఎప్పుడూ రొటీన్ పద్ధతి లో కాకుండా పిల్లలకి, పెద్దలకి కూడా మంచి ఫ్లేవర్ ని ఇచ్చే కొన్ని
రెసిపీస్ ని చూద్దాం. వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు కూడా. అలానే ఇప్పుడు పుచ్చకాయలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. వీటిని కూడా ఉపయోగించి మనం మొజిటోని చేసుకోవచ్చు. లేదా ఆరెంజ్ తో కూడా తయారు చేసుకోవచ్చు.
క్యూబా లో మొజిటో ఒక ట్రెడిషనల్ డ్రింక్. పుదీనా ఆకులు, పంచదార, నిమ్మ రసం మరియు సోడాని దీనిలో వేస్తారు. ఇప్పుడు మొజిటోని కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ పదార్థాలని క్రష్ చేసి ఉపయోగిస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. పైగా రుచి కూడా బాగుంటుంది దాహం కూడా తీరుతుంది. వేసవి కాలంలో మొజిటో నిజంగా పర్ఫెక్ట్ డ్రింక్ అనే చెప్పాలి. అలానే ఏ సీజన్ అయినా కూడా తాగడానికి బాగుంటుంది.
సమ్మర్ లో కూడా దీన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండొచ్చు. మొజిటో లో పండ్లు మరియు సోడా ని వేసుకుని తీసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సమ్మర్ లో మొజిటో ని ఎక్కువ మంది తాగుతూనే ఉంటారు. పుదీనా ఆకులు మరియు నిమ్మ రసం మంచి ఫ్లేవర్ తో పాటు చల్లదనాన్ని కూడా ఇస్తాయి. వేగంగా చేసుకునేవి, సింపుల్ గా అయిపోయేవి, ఇళ్లలోనే తయారు చేసుకునే కొన్ని మొజిటో లని ఈరోజు మనం చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు వీటి మీద ఒక లుక్ వేసేయండి.
ముగ్గురు సర్వ్ చేసుకోవచ్చు.
పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.
వర్జిన్ మొజిటో :
వర్జిన్ మొజిటోకి కావలసిన పదార్థాలు:
2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, నాలుగు నిమ్మకాయ ముక్కలు , రెండు టేబుల్ స్పూన్స్ పంచదార , ఏడు నుండి ఎనిమిది పుదీనా ఆకులు, ఒక పించ్ బ్లాక్ సాల్ట్,
ఐసు ముక్కలు , అర గ్లాసు సోడా (ఇది ఆప్షనల్)
వర్జిన్ మొజిటో తయారు చేసుకునే విధానం:
ముందు గ్లాసు తీసుకుని డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసాన్ని ఒక ఆ గ్లాసులో వేసి కొంచెం పంచదార, అదే క్లాసులో నాలుగు నిమ్మకాయ ముక్కలు, ఏడు నుండి ఎనిమిది పుదీనా ఆకులు మరియు బ్లాక్ సాల్ట్ ని వేయండి. తియ్యదనం కోసం కావాలంటే పంచదార పొడి కూడా వేసుకోవచ్చు.
లేదు అంటే షుగర్ సిరప్ ని కూడా మీకు వాడచ్చు. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా వేయండి. బాగా దంచి వేస్తె ఫ్లేవర్ బాగా పడుతుంది. రెండు లేదా మూడు ఐస్ ముక్కలు కూడా వేయండి. ఇవి అన్ని కూడా సగం వరకే వెయ్యాలి. మిగిలిన సగం సోడా వేయాలి పైన నిమ్మకాయ ముక్కల తో గార్నిష్ చేసుకుంటే డ్రింక్ రెడీ అయిపోయింది.అంతే మొజిటో రెడీ అయిపోయింది.
ఆరెంజ్ మొజిటో :
ఆరెంజ్ మొజిటో కూడా మీరు సులభంగా తయారు చేసుకోవచ్చు. వేసవి కాలంలో వీటిని తీసుకోవడం వల్ల దాహం తీరుతుంది. ఎవరైనా ఇళ్లల్లో సులభంగా తయారు చేసేసుకోవచ్చు.
ఆరెంజ్ మొజిటో కి కావాల్సిన పదార్థాలు:
ఆరెంజ్ పల్ప్ రెండు టేబుల్ స్పూన్లు. నిమ్మకాయ ముక్కలు, 4 పుదీనా ఆకులు 5 నుండి 6 ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ , రెండు టేబుల్ స్పూన్ల షుగర్ ,బ్లాక్ సాల్ట్
ఐసు ముక్కలు
ఆరెంజ్ మొజిటో తయారు చేసే విధానం:
ముందుగా గ్లాసు ని నిమ్మ రసం మరియు పంచదార తో డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో నాలుగు నిమ్మకాయ ముక్కలు వేయండి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేయండి. ఐదు నుంచి ఆరు పుదీనా ఆకులు వేస్తే సరి పోతుంది.
ఇప్పుడు కొద్దిగా బ్లాక్ సాల్ట్ మరియు పంచదార పొడిని వేయండి. 2 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పల్ప్ ని కూడా వెయ్యండి. అలానే ఒక కప్పు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ని కూడా వేయండి. దీనిని మీరు ఇంట్లో తయారు చేయచ్చు లేదు అంటే షాపుల్లో టెట్రా పాక్స్ కూడా అమ్ముతారు వాటిని ఉపయోగించవచ్చు.
వీటన్నిటినీ బాగా మిక్స్ చేసి ఐసు ముక్కలు కూడా వేసి మిక్స్ చేయండి దీనిలో మీరు స్ప్రైట్ లేదా నిమ్మ కాయ ఫ్లేవర్ తో ఉన్న డ్రింక్ ని వేసుకోవచ్చు. పైన పుదీనా ఆకులు వేసి గార్నిష్ చేసుకోండి. అంతే ఆరెంజ్ మోటో రెడీ.