BREAKING NEWS

రోజూ 10 నిమిషాలు పాటు వాకింగ్ చేయడం చాలా మంచిది..!

ఈ కాలం లో కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా రోజుకు అరగంట నడవడం చాలా ముఖ్యం. వాకింగ్ చేయడం వల్ల అనేక రకాల లాభాలు మనకి కలుగుతాయి. ధ్యానంతో కూడిన నడక తో ఒత్తిడి, కంగారు తగ్గుతాయి. మనసుకి లభించే సాంత్వన దీర్ఘకాలం ఉంటుంది.

అలాగే శ్వాస సంబంధిత సమస్యలు దీర్ఘకాలిక నొప్పులు కూడా తగ్గిపోతాయి. నిటారైన ఆకృతి, కండరాల దృఢత్వం భుజాలు కాళ్లకు విశ్రాంతి లభిస్తాయి. చేసే పని పై ఏకాగ్రత కూడా పెరుగుతుంది ఇలా రోజుకి అరగంట సేపు నడిస్తే ప్రాణాంతక వ్యాధులు కూడా నయం అయిపోతాయి.
 
అయితే వాకింగ్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఈరోజు మనం చూద్దాం..! దీని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. మీరు నిజంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..? అయితే తప్పకుండా ఈ మార్గాన్ని అనుసరించండి.
 
 రక్త పోటును తగ్గిస్తుంది:
 
రెగ్యులర్ గా వాకింగ్ చేయడం చాలా మంచిది అని చెప్పుకున్నాం. అయితే దీని వల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది. మనం ఎన్నో రకాల ఫిజికల్ యాక్టివిటీస్ చేయవచ్చు. వాకింగ్ కూడా వీటిలో ఒకటి.  ఎందుకంటే ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. నిజంగా రక్తపోటు ఉన్న వాళ్ళకి ఇది ఒక మెడిసిన్ లాగ పని చేస్తుంది.
 
చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది:
 
చక్కెర శాతం కూడా తగ్గించుకోవచ్చు. వాకింగ్ వల్ల రక్తనాళాల్లో రక్త ప్రవాహానికి సరి పోయే అంత  ఆక్సిజన్ సప్లై అవుతుంది. దానితో కండరాలు మరింత రిలాక్స్ గా అనుభూతి చెంది బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తాయి.
 
 మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :
 
మీరు ప్రతి రోజూ వాకింగ్ చేశారు అంటే మధుమేహ ప్రమాదం కూడా తగ్గించుకోవచ్చు. నిజంగా డయాబెటిస్ పేషెంట్లు కి ఇది ఒక దివ్య ఔషధం లాగ పని చేస్తుంది. శరీరం గ్లూకోజును సమర్ధవంతంగా వినియోగించుకునేలా చేసి రక్తం లో చక్కెర లెవల్స్ ను తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది గొప్ప వరం అనే చెప్పాలి.
 
చురుకుదనాన్ని మరింత పెంచుతుంది:
 
 మీరు వాకింగ్ కనుక చేశారు అంటే మీరు మరింత చురుకుగా ఉండొచ్చు. వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మరియు ఆక్సిజన్ అందించడం లో బాగా ఉపయోగ పడుతుంది. దీని వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది.
 
ఒత్తిడిని తగ్గిస్తుంది:
 
క్రమం తప్పకుండా వాకింగ్ చేసే ఒత్తిడి కూడా దూరం అయి పోతుంది. ఆహ్లాదకరమైన ప్రదేశాలను ఎంచుకుని రోజుకు ఒక గంట సేపు వాకింగ్ చేయండి. ఇలా వాకింగ్ చేయడమే కాకుండా రోజుకి కాసేపు విశ్రాంతి కూడా తీసుకోండి.
 
కొవ్వుని తగ్గించుకోవచ్చు:
 
ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల కొవ్వు కరిగించడానికి సహాయ పడుతుంది. అలానే బరువు కూడా తగ్గవచ్చు. ఇది ఒక మంచి పద్దతి అని చెప్పొచ్చు. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గిస్తుంది.
 
 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది :
 
దగ్గు, ఫ్లూ వంటి వివిధ వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఇటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ఈ వాకింగ్ చేయడం బాగా సహాయ పడుతుంది.
 
పొట్టని తగ్గిస్తుంది:
 
పొట్టలో పేరుకు పోయిన కొవ్వుని వాకింగ్ చేయడం వల్ల తగ్గించుకోవచ్చు. కాబట్టి రెగ్యులర్ గా వాకింగ్ చేసి కొవ్వుని తొలగించుకోండి.
 
మలబద్ధకాన్ని దూరం చేస్తుంది:
 
రెగ్యులర్ గా వాకింగ్ చేయడం వల్ల మల బద్దకాన్ని కూడా తగ్గించుకోవచ్చు. మలబద్ధకము ఉన్న వాళ్లకి ఇది చక్కటి వైద్యంలా పని చేస్తుంది.
 
అలానే మీకు మరింత బలం వస్తుంది. మనస్సు ఉత్తేజకరంగా తయారవుతుంది. రక్తం లో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గి పోతుంది. పైగా రక్తం లో చక్కెర శాతం కూడా తగ్గుతుంది. వ్యాధి తేలికగా అదుపు లోకి వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి నడక ఎంత గానో ఉపయోగ పడుతుంది.

రోజు వాకింగ్ చేస్తే 300 క్యాలరీలని కరిగించుకోవచ్చు. దాంతో గణనీయంగా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వృద్ధాప్యాన్ని తప్పించుకోవడానికి కూడా మీరు వాకింగ్ చేయొచ్చు. 50 సంవత్సరాలు మీరు దాటిపోయినా మీరు ఎంగ్ గా కనిపించడానికి వాకింగ్ బాగా సహాయ పడుతుంది.
 
 కాబట్టి రెగ్యులర్ గా వాకింగ్ చేయండి. సామర్ధ్యం,  వర్చస్సు పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు రెండు మైళ్లు నడిచిన వారికి దీర్ఘాయుష్షు తధ్యమని నిపుణులు చెప్పారు. గర్భధారణ సమయం లో వాకింగ్ చేయడం వల్ల అలసట మరియు వివిధ ఇతర గర్భం సంబంధిత సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. 
 
అలానే  సులభంగా బరువు తగ్గించుకోవడం కూడా అవుతుంది. ఇది మంచి పద్ధతి. చూసారా వాకింగ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో..! కాబట్టి  ప్రతి రోజు వాకింగ్ చేసి అనేక సమస్యలు సులువుగా పరిష్కరించుకోండి. దీని వల్ల మీకు ఖర్చు ఉండదు. పెద్ద శ్రమ ఉండదు. అలవాటు అయిపోతే చాలా ఈజీ గా ఉంటుంది పైగా అనేక సమస్యల్ని మీరు చెక్ పెట్టొచ్చు.