BREAKING NEWS

హిమా దాస్ ఎంతో మందికి ఆదర్శం...!

పరుగుల చిరుత, ఆడపులి ఈమె. భారత్ స్టార్ అథ్లెట్ హిమా దాస్ ఇప్పుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈమెకి ఐపీఎస్ క్యాడర్ ఇచ్చి గౌరవించింది. నిజంగా ఈమెని చిరుత పులి అన్న తప్పు లేదు. ఈ పరుగుల చిరుత ఎన్నో బహుమతులు గెలుచుకుంది. అలానే తన జీవితంలో ఎన్నో సాధించింది. హిమ దాస్ అనుకున్న  కల నెరవేరింది. ఇప్పుడు డిఎస్పీగా బాధ్యతలు కూడా తీసుకుంది. ఈమె కోసం చెప్తే చాలానే ఉంది నిజంగా ఈమె ఎంతో మందికి స్ఫూర్తిని కలిగిస్తోంది.
 
హిమా దాస్ ఆశించినది జరిగింది. ఇంత గొప్ప ఘనత సాధించిన హిమా దాస్ గురించి అనేక విషయాలు చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా ఇప్పుడే చేయండి. హిమ దాస్ కి 21 సంవత్సరాలు. ఈమె 2018 వ సంవత్సరం లో ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ లో  భారత దేశాన్ని ప్రపంచ ఛాంపియన్ గా నిలిపింది. కేవలం ఇంతే కాదు అండి క్రీడల్లోనూ స్వర్ణం రజతం సాధించింది. నిజంగా ఈమె మన దేశ ప్రతిష్టతని మరింత ఇనుమడింపచేసింది.
 
ఈమెకు ఈ పదవి రావడం తో దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. సెలబ్రిటీలు సైతం ఈమెని మెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా ఆనందం వ్యక్తం చేశారు.
 
 హిమ దాస్ జీవితం :

 
హిమ దాస్ అస్సాం రాష్ట్రం లోని నాగౌర్ జిల్లా డింగ్ పట్టణానికి చెందిన కందులు మరి గ్రామంలో జన్మించింది. రొంజిత్ మరియు జోనాలి దాస్ ఈమె తల్లిదండ్రులు. వీళ్ళు ఇద్దరి కూడా ఈమె చిన్నప్పటి నుంచి కూడా కూలి పనికి వెళ్లే వారు. అందరి కంటే చిన్నది హిమా. ఈమె పరిగెట్టే తీరు చూస్తే ఈమెను ప్రశంసించే తీరాలి అన్నట్టు అందరూ ఈమెకి ప్రశంసలు ఇచ్చేవారు. వేగంగా చిరుత పులిలా పరిగెత్తే ఈమెని డింగ్ ఎక్స్ ప్రెస్ గా పిలిచే వారు.
 
పోలీసు అవ్వాలని కల: 
 
తన స్కూల్ డేస్ నుంచి కూడా పోలీస్ కావాలని ఈమె కల ఉండేది అని చెప్పింది ఈమె. పైగా తన తల్లి కూడా అదే కోరుకునేది అని హిమదాస్ చెప్పడం జరిగింది. తన చిన్నప్పుడు ఆమె తనకి ఒక బొమ్మ తుపాకీని కూడా కొని ఇచ్చింది అని చెప్పింది. అస్సాం పోలీసుగా ప్రజలకు సేవ చేసే మంచి పేరు తెచ్చుకోవాలని హిమదాస్ చెప్పారు. తనకు ఇష్టమైన స్పోర్ట్స్ తోనే తనకు అని లభించాయని ఎంతో ఆనందంగా హిమదాస్ అన్నారు. అథ్లెట్ గానూ ఈమె ఎన్నో పతకాలు సాధించారు
 
హిమదాస్ విజయాలు:
 
ఆసియా గేమ్స్‌లో వ్యక్తి గతంగా 2018 వ సంవత్సరం లో  400 మీటర్ల  పరుగు లో రజత పతకం సాధించింది హిమాదాస్. అలానే ఈమె  ఆ మెగా టోర్నీ లోనే 400 మీటర్ల రిలే, మిక్సిడ్ 400మీ రిలే లో గోల్డ్ మెడల్స్ ని కూడా ఈమె గెలిచింది. అలానే ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ కోసం పాటియాలా లో హిమాదాస్ రెడీ అవుతోంది. గత గురువారం జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్-2లో 200మీ పరుగుని 23.21 సెకన్ల లో పూర్తి చేసిన హిమాదాస్ బంగారు పతకాన్ని తన సొంతం చేసుకుంది.
 
హిమా దాస్ అందుకున్న అవార్డులు:
 
హిమ దాస్ ఎన్నో విజయాలను అందుకుంది. హిమా దాస్ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2018 వ సంవత్సరం లో అర్జున అవార్డుని ఇచ్చింది. అదే ఏడాది లో యునిసెఫ్ ఇండియాకు యూత్ అంబాసిడర్ గా నియమితురాలయ్యింది హిమాదాస్. అంతే కాదండి అంతర్జాతీయ ఈవెంట్ లో భోగేశ్వర బరువా తర్వాత అస్సాం లోని గోల్డ్ మెడల్ సాధించిన రెండో ప్లేయర్ హిమాదాస్. అస్సాం ప్రభుత్వం కూడా తనను స్పోర్ట్స్ అంబాసిడర్ గా నియమించింది. 
 
ఇలా హిమా దాస్ ఎంతో కష్టంగా గెలిచింది. ఆమెకి ఎటువంటి వసతి సదుపాయాలు లేక పోయినా సరే ఎంతో కష్టపడి సాధించింది. నిజంగా ఈమె ఆశయమే గెలవడానికి కారణం. అంత పట్టుదల తో, కలలతో ఈమె తాను అనుకున్నది చేయగలిగింది. సరైన వసతులు లేక పోయినా బురద లో ఉండే ఫుట్ బాల్ మైదానం లో ఎంతో కఠోర శిక్షణ చేసింది హిమా దాస్. స్కూల్ స్టడీస్ కోసం కిలో మీటర్ల కొద్దీ కొండలు దాటిన హిమ మంచి అథ్లెట్ గా  కొంత కాలానికి ఎదిగి పోయింది. తన తండ్రి తో పాటు పొలం పనులు చేస్తూ ఎంతో దృఢంగా ఈమె తయారయింది. నిజంగా హిమదాస్ చాలా మందికి ఆదర్శం. ఈమె కఠోర దీక్ష, ఈమె తపన ఆశ, ఆశయాలు ఎంతో చక్కగా నెరవేర్చుకుంది. అన్నింటికీ ప్రయత్నం ముఖ్యమని... అనుకున్నది సాధించాలంటే కష్టపడాలని... ఈమె ప్రూవ్ చేసింది. 
 
ఎంతో మందికి హిమా దాస్ స్ఫూర్తిని ఇచ్చింది. ఆమెని ఆదర్శంగా ప్రతీ ఒక్కరు తీసుకుని అనుకున్నది సాధించే దాకా కష్ట పడాలి.