BREAKING NEWS

హోలీ 2021 : ఈ బహుమతులు ఇస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు...!

హోలీ అంటేనే  రంగుల పండుగ. ప్రతి ఒక్కరూ కలిసి ఉండడం, ఆనందంగా ఉండడం చాల ముఖ్యం. రుచికరమైన వంటలు వండుకోవడం కలిసి సందడి చేయడం ఇలా హోలీ అంటే ఎన్నో.... పైగా హోలీ కి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం జరుపుకునే ఎన్నో పండుగల్లో హోలీ పండుగ ఒకటి. హోలీ వసంతానికి స్వాగతం పలుకుతుంది. అన్నిటినీ ఆనందంగా ఫ్రెష్ గా మొదలు పెట్టాలని హోలీ కి సంకేతం.
 
ప్రపంచ వ్యాప్తంగా హిందువులు హోలీ పండుగను జరుపుకుంటారు. ఇంట్లో మంచి కలగాలని, ధనం నిలవాలని కోరుకుంటారు. ఒకరికి ఒకరు రంగులు చల్లుకుని, పాటలు పాడుకోవడం, డాన్సులు వేయడం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం చేస్తూ ఉంటారు.
 
ఆప్తులకు, బంధుమిత్రులకి బహుమతులు ఇవ్వడం, శుభాకాంక్షలు తెలపడం చేస్తారు. ఈసారి హోలీ పండుగ మార్చి 28న వచ్చి 29 తో ముగుస్తుంది. అయితే ఈసారి మీరు ఎటువంటి బహుమతులు మీ స్నేహితులకు, బంధువులకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా..? అయితే మీకోసం కొన్ని ఐడియాస్. వీటిని అనుసరించి మీకు నచ్చిన బహుమతిని ఇవ్వండి. నిజంగా వాళ్లు ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక ఎటువంటి గిఫ్ట్స్ ఇవ్వాలి అనే విషయానికి వస్తే.. ఇక్కడ కొన్ని చిన్న చిన్న బహుమతులు చెప్పడం జరిగింది. మరి వాటి కోసం ఒక లుక్ వేయండి.
 
రుచికరమైన స్వీట్స్:
 
సాధారణంగా పండుగ అంటేనే ఆనందంగా ఉండాలని స్వీట్ ని తయారు చేస్తారు. నిజంగా ఎన్నో రుచికరమైన స్వీట్స్ మనకి దొరుకుతుంటాయి. పండుగ రోజుల్లో స్వీట్స్ పంచుకోవడం బాగుంటుంది. ఆనందం, ప్రేమ ఉండాలని స్వీట్స్ ఇస్తూ ఉంటారు. మిల్క్ కేక్, కాజు కట్లీ, మోతిచూర్ లడ్డూ, చెన్న బర్ఫీ, దూద్ మిఠాయి ఇలా ఎన్నో రకాల స్వీట్ బాక్సులు మనకి దగ్గరలోనే దొరుకుతుంటాయి. అందంగా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తే భలేగా ఉంటుంది. పైగా దీనికోసం పెద్దగా ఖర్చు కూడా ఎవ్వడు. 
 
పైగా రుచికరమైన భోజనం తిన్నాక ప్రతి ఒక్కరు స్వీట్స్ తింటారు కాబట్టి మీరు స్నేహితులకి కానీ చుట్టాలకి కానీ హోలీ రోజు బహుమతి ఇవ్వాలంటే స్వీట్స్  ని ప్రిఫర్ చేయండి. ఆ స్పెషల్ డే నాడు ఈ స్పెషల్ స్వీట్స్ వాళ్లకి జ్ఞాపకంలా ఉంటుంది.
 
లేదు అంటే మీరు చాక్లెట్స్ ని గిఫ్ట్ ప్యాక్ చేసి కూడా ఇవ్వొచ్చు. ఇవి కూడా చాలా మంచి ఐడియా అలానే స్వీట్ బాక్స్ తో కలిపి మరికొన్ని ఇవ్వాలంటే మీరు రంగులు చల్లుకునే సామాన్లు, వాటర్ బెలూన్స్, హెర్బల్ కలర్స్ కలిపి ఇవ్వొచ్చు. ఈ ఐడియా కూడా బాగుంటుంది.
 
అందమైన మొక్కలు:
 
ఆకుపచ్చ రంగు శాంతికి నేచర్ మరియు హార్మోని కి సంగీతం. మొక్కలు ఇవ్వడం నిజంగా విభిన్నమైన ఆలోచన. అలానే మొక్కలు నాటడం వల్ల మనకే చాలా ఉపయోగాలు కలుగుతాయి. ఆనందం తో పాటు మొక్కలు పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తాయి. మొక్కలు నాటిన కుండీలని బంధువులకు స్నేహితులకు ఇవ్వొచ్చు. ఆఫీసులో కూడా పంచుకోవడానికి ఇది బాగుంటుంది. క్యాండిల్ హోల్డర్స్, పూల గుత్తులు, పెయింటింగ్స్ ఇలాంటివి కూడా మీరు ఇవ్వొచ్చు. మీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కాకపోతే ఈ విభిన్నమైన ఐడియాలని అనుసరించవచ్చు. వీటిని బహుమతిగా ఇస్తే చాలా బాగుంటుంది.
 
దేవుడి విగ్రహాలు:
 
దేవుడి విగ్రహాలను బహుమతి ఇవ్వడం పురాతన నుంచి వస్తోంది. కానీ ఎప్పటికీ ఓల్డ్ ఫ్యాషన్ కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి మంచి దేవుడి విగ్రహాలు మనకి షాపుల్లో దొరుకుతున్నాయి. రాధా కృష్ణుడి విగ్రహం ఇస్తే చాలా బాగుంటుంది. రాధాకృష్ణులు కలిపి ఉన్న విగ్రహం ప్రేమ మరియు స్నేహానికి సంకేతం. కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకి దీనిని మీరు బహుమతిగా ఇస్తే వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుందని అంటారు. కాబట్టి ఈ ఐడియా ని కూడా మీరు అనుసరిస్తే బాగుంటుంది.
 
హెర్బల్ కలర్స్:
 
సాధారణంగా హోలీ అంటేనే రంగులు. సరదాగా అందరితో కలిసి ఆడుకోవడం రంగుల్ని పిచికారీ చేసుకోవడం ఎంతో సందడిగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో మనకు హానికరమైన రంగులు దొరుకుతున్నాయి. అటువంటి వాటిని మీరు కొనద్దు, ఎవరికి ఇవ్వద్దు.
 
 సహజమైన రంగులు ఇళ్లలోనే తయారుచేసుకోవచ్చు. పసుపు, మందారం ఇలా వివిధ రకాల పూల నుంచి మనం సహజమైన రంగులని తయారు చేయొచ్చు. కెమికల్స్ లేనివి మాత్రమే ఉపయోగించండి. దీని వల్ల మీ చర్మానికి జుట్టుకు కూడా ఎటువంటి సమస్య రాదు. అదే హానికరమైన వాటిని  మీరు ఉపయోగించారు అంటే మీ చర్మం పై ఎలర్జీలు వగైరా వ్యాపిస్తాయి మీకు నచ్చిన రంగులు, నేచురల్ రంగులు మాత్రమే ఉపయోగించండి.
 
ఇలా హెర్బల్ రంగులని మీరు తయారు చేయడం కానీ కొనడం కానీ చేసి గిఫ్ట్ ప్యాకింగ్ చేసి బహుమతిగా ఇవ్వొచ్చు. పిల్లలకి పెద్దలకి కూడా ఇవి బాగా నచ్చుతాయి. కాబట్టి మీరు ఈ రంగులను కూడా గిఫ్ట్ గా ఇస్తే ఆనందంగా ఫీల్ అవుతారు. ఇలా మీకు నచ్చిన ఐడియాని మీరు అనుసరించి బహుమతులు ఇవ్వచ్చు.