BREAKING NEWS

మహా శివరాత్రి విశిష్టత, పద్ధతులు...!

మనం ఎన్నో పండుగలు జరుపుకుంటూ ఉంటాం. అయితే హిందువులు జరుపుకునే అనేక పండుగల లో శివ రాత్రి ఒకటి అని చెప్పొచ్చు. మహా శివ రాత్రి నాడు శివాలయాలు అన్నీ కూడా ప్రత్యేక పూజల తో, భజనల తో నిండి పోతాయి. భక్తులు ఉపవాసం, జాగరణం వంటివి పాటిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి రోజు మహా శివ రాత్రి వస్తుంది. శివుడు పార్వతి దేవి ని  వివాహం ఈరోజు చేసుకున్నాడు అని కొందరంటే... శివుడు సర్వ శక్తి సంపన్నుడు లింగాకారం లో ఆవిర్భవించిన రోజు అని మరికొందరు అంటారు.
 
 కారణం ఏదైనా ఘనంగా ఉత్సవాలు చేస్తూ ఉంటారు. రాత్రి కూడా భక్తులు నిద్ర పోకుండా శివుడనే ఆరాధిస్తారు. అయితే మహా శివ రాత్రి సందర్భంగా మనం కొన్ని విషయాలు చూద్దాం.. మరి ఇక  ఆలస్యమెందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.
 
శివ రాత్రి పూజలు:
 
నవరాత్రి పూజలు లాగే దీక్షగా శివ రాత్రి పూజలు కూడా చేస్తూ ఉంటారు. రాత్రి సమయం లో శివుడు జన్మించాడని అందుకే రాత్రి కూడా పూజ చేయమని సాక్షాత్తు శివుడు అనగా అమ్మ వారు అందుకు ప్రతి ఫలంగా నవరాత్రులు పూజలు కోరుకున్నట్లు చెబుతారు. మహా శివ రాత్రి రోజు ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. నేల పై పడుకోవడం, సాత్విక ఆహారం తీసుకోవడం ఒక పూట భోజనం శారీరిక మానసిక శుధ్ధి గా ఉండాలి. కోపతాపాలు, ఇతరులని నిందించటం వంటివి చేయకూడదు. 
 
మహా శివ రాత్రి నాడు పాటించే ఉపవాస విధానం:
 
పర్వదినమైన మహా శివరాత్రి నాడు రోజు అంతా కూడా ఉపవాసం వుండి మరుసటి రోజు భోజనం చేయాలి. ఇదే ఉపవాస పద్ధతి. ఎక్కువ అందరూ శివ రాత్రి నాడు పగలంతా ఏం తినకుండా ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని ఆ తర్వాత ప్రసాదం స్వీకరిస్తారు. మరి కొందరు అయితే పగటి పూట ఏదో ఒకటి తిని ఆ తరువాత  రాత్రి ఉపవాసం చేస్తారు దానిని ఏకభుక్తం అంటారు. ఇలా ఎవరికీ నచ్చిన పద్ధతుల్లో వాళ్ళు నిష్ఠగా ఉపవాసం ని చేయడం జరుగుతుంది.
 
అయితే శివ రాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని భక్తుల నమ్మకం. అలానే ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని అంటారు. ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి పూలూ, ఫలాల తో శివునికి పూజ చేస్తారు. అలానే పంచామృతాలని తీసికెళ్ళి దేవాలయాల్లో పూజలో పాలగొంటారు.
 
 ప్రతి దేవాలయాలు కూడా కిక్కిరిసి ఉంటాయి. శివాలయాల్లో అయితే రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. అభిషేకాలు, పూజల తో పరమ శివుడుని భక్తులు ఆరాధిస్తారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారు మోగుతూ ఉంటుంది. లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. ఆరాధన చేసి భక్తి తో రుద్రాభిషేకం చేస్తారు.
 
శివ రాత్రి నాడు శివుడికి పూజ:
 
 శివ రాత్రి నాడు శివుడిని కొలిచేటప్పుడు ఎర్రటి మందారాలు అర్పించాలి. ఈ పువ్వులు ఉత్తమ పూల లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పువ్వులను శివుడికి అర్పిస్తే ధనవంతులు, బలవంతులు, సానుకూలంగా మరియు సంతోషంగా ఉండొచ్చు అని నమ్ముతారు. అలాగే పూజ చేసినప్పుడు పారిజాతం పూలు దొరికితే వాటిని కూడా అర్పించండి.
 
ఇవి విష్ణువు అవతారాల లో ఒకటైన రాముడికి ఇష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పూల తో శివుడికి పూజ చేయండి. అలానే కమలం పూలని  శివుడికి అర్పిస్తే శ్రేయస్సు మరియు శాంతి వస్తుంది. లక్ష్మీ దేవికి ఈ పూలు అంటే చాల ఇష్టం. వీటిని ఎక్కువగా మనం అర్పిస్తూ ఉంటాము. శివుడికి కూడా ఈ పూలు అంటే మహా ఇష్టం.
 
 శివుడికి ఉమ్మెత్త పూలని అర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. శివుడికి ఉమ్మెత్త పూలు అంటే మహా ఇష్టం అని పండితులు అంటున్నారు. మారేడు దళాలు తో కూడా పూజ చేయండి. మనకి మారేడు దళాలు ఎక్కడో ఒక చోట దొరుకుతూనే ఉంటాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాల తో పూజ చేయడం వల్ల మీరు అనుకున్నది నెరవేరుతాయి. అలానే ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.
  
మహా శివ రాత్రి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి..? చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు అని చెప్పుకున్నాం. అయితే మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం... మహా శివ రాత్రి నాడు ఉపవాసం ఉంటే పెళ్లి కాని స్త్రీల కి  త్వరగా పెళ్లి అవుతుంది. కల్యాణ ఘడియలు దగ్గర పడతాయి అని ఉపవాసం చేస్తారు. అలానే ఉపవాసం చేసిన వాళ్ళకి శుభం కలుగుతుందని ఆయురారోగ్యాలతో వుంటారని మోక్షం లభిస్తుందని అంటారు అందుకే మహాశివరాత్రి నాడు ఉపవాసం ఆచరించాలి.