BREAKING NEWS

అందానికి, ఆరోగ్యానికి పుదీనా..!

మనం పుదీనాను ఎక్కువగానే ఉపయోగిస్తుంటాము. చాలా రకాల జ్యూస్ల లో కూడా పుదీనాను వాడతాము. పుదీనా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. అయితే ఈ రోజు మనం పుదీనా వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాము. ఔషధ గుణాలు ఉన్న పుదీనా ఆకు ని డైట్ లో చేర్చుకుంటే చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పోషకాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. పైగా క్రిములను కూడా ఇది నాశనం చేస్తుంది.
 
శరీరం లో ఉండే మలినాలు లో ఇది సులువుగా బయటకు పంపించేస్తుంది. చర్మానికి కూడా దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇక పుదీనా వల్ల కలిగే ఉపయోగాలు గురించి క్లుప్తంగా చూద్దాం.
 
నోటి సమస్యలకు పుదీనా:
 
నోటి సమస్యలను పరిష్కరించడం లో పుదీనా ఎంతో బాగా సహాయ పడుతుంది. పుదీనా ఆకులు తీసుకుని నీటిలో కలిపి పుక్కిలించాలి. ఇలా చేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. పచ్చి ఆకులు నమిలితే చిగుళ్లు గట్టిపడతాయి. అంతే కాకుండా చిగుళ్లకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిపోతాయి.
 
ఈ ఆకుల తో పేస్టు చేసి వాటిని ఉపయోగిస్తే పళ్ళు మెరిసిపోతాయి. ఇలా దంత ఆరోగ్యానికి పుదీనా ఎంత గానో ఉపయోగ పడుతుంది.
 
పుదీనా లో పోషకాలు:
 
దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. పుదీనా ఆకుల్లో సుమారు 5480 మైక్రోగ్రాముల విటమిన్ బీటా-కెరోటిన్ రూపంలో అందుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
 
మలబద్దకానికి పుదీనా:
 
 కొద్దిగా నీళ్ళ లో పుదీనా ఆకుల్ని మరిగించి ఆ తర్వాత దానిని వడకట్టి టీ రూపం లో  కనుక తీసుకుంటే మలబద్ధకం తగ్గిపోతుంది. పొట్ట లో సులువుగా మలినాలు తొలగి పోయి శుభ్రపరుస్తుంది కాబట్టి మలబద్ధకం ఉన్న వాళ్ళు ఈ చిట్కాలను అనుసరిస్తే సూపర్ బెనిఫిట్ కలుగుతుంది.
 
చర్మ సమస్యలకు పుదీనా:
 
కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సమస్యలు కూడా ఇది చెక్ పెడుతుంది. పైగా చర్మానికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది. చర్మం పై ఏవైనా సమస్యలు ఉంటే వాటిని కూడా తొలగించవచ్చు శరీర రక్తాన్ని శుభ్రంగా ఉంచుతుంది. మొటిమలను కూడా నివారించే గుణం దీని లో ఉంది.
 
ఇప్పటి వరకు దీని వల్ల కలిగే ఉపయోగాలు చూశారు కదా..! ఇప్పుడు అందమైన చర్మం కోసం పుదీనా ఫేస్ ప్యాక్స్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. దీని వల్ల మీ చర్మం నిగనిగలాడుతుంది.
 
పుదీన మరియు కీర దోస ఫేస్ ప్యాక్:
 

ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తోంది. కూలింగ్ గా మీ చర్మాన్ని ఉంచుకోవాలి అంటే తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి. దీని కోసం మీకు కొన్ని పుదీనా ఆకులు మరియు కొన్ని కీరా దోస ముక్కలు అవసరం పడతాయి. కొంచెం తేనె కూడా కావాలి.
 
ముందుగా మీరు కొన్ని ఆకులు తీసుకుని కీరా దోస ముక్కలు దానిలో వేసి కలపండి. కొద్దిగా తేనె కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ముఖం పై ఫుల్ గా అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచి ఆ తర్వాత చల్లని నీళ్ళ తో కడిగేయండి. దీని వల్ల చర్మం పై మంట ఉంటే తగ్గిపోతుంది. పైగా నిగారింపు కూడా ఇస్తుంది.
 
 పుదీనా ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్:
 
ముల్తాన మట్టి వల్ల ఉపయోగాలు మనకి తెలుసు. అయితే పుదీనా ముల్తాని మట్టి కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల కూడా మంచి బెనిఫిట్ కలుగుతుంది.
 
 కావలసిన పదార్థాలు:
 
పుదీనా ఆకులు, ముల్తానా మట్టి, తేనె, పెరుగు.
 
 తయారు చేసుకునే పద్ధతి:
 
ముందుగా కొన్ని పుదీనా ఆకులని నూరి కొద్దిగా ముల్తానా మట్టి, తేనె మరియు పెరుగు వేసి కలపండి ముఖం పై దీనిని అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత చల్లని నీళ్ళతో శుభ్రంగా ముఖాన్ని కడిగేయండి. ఇది ముఖం పై ఉండే రంధ్రాలని తొలగిస్తుంది. అలానే మంచి నిగారింపును కూడా ఇస్తుంది.
 
పుదీనా పసుపు ఫేస్ ప్యాక్ :
 
ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల పింపుల్స్ తగ్గిపోతాయి. అలానే మంట కూడా తగ్గుతుంది పసుపు వల్ల స్కార్స్ కూడా తొలగిపోతాయి. దీని కోసం ముందుగా పుదీనా ఆకులలో  కొద్దిగా నీళ్లు పోసి బ్లెండ్ చేయండి. ఆ తర్వాత పసుపుని అందులో కలపండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పేస్ట్ను ముఖం పై అప్లై చేయండి. పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్ల తో కడిగెయ్యండి దీని వల్ల మీకు మంచి బెనిఫిట్ కలుగుతుంది.
 
పుదీనా, రోజు వాటర్ ఫేస్ ప్యాక్ :
 
ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయవచ్చు. ఎక్కువగా ఆయిల్ ఉంటే కంట్రోల్ చేయొచ్చు. ముందుగా మీరు పుదీనా లో కొద్దిగా తేనె వేసి పేస్ట్ చేసి దానిలో కొద్దిగా రోజ్ వాటర్ వేయండి. ఇలా దీనిని ముఖంపై అప్లై చేయండి ఆ తర్వాత ఆరిపోయిన తర్వాత కడిగేయండి. దీని వల్ల మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది.