BREAKING NEWS

అత్యంత సంపన్నమైన ఆలయం అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం..!

అనంత పద్మనాభ స్వామి దేవాలయం భారత దేశం లో, కేరళ రాష్ట్రం లో ఉంది. ఈ ఆలయంని  చూడడానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్న గోపురాన్ని 1568 లో నిర్మించారు. అలానే ఈ ఆలయంలో మూల విరాట్ ను 1208 సాలగ్రామ లతో రూపొందించడం జరిగింది. నిజంగా ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఈ ఆలయానికి ఉన్న గొప్పతనం చాలానే ఉంది.
 
ఈ ఆలయం శ్రీ మహా విష్ణువు యొక్క 108 దివ్య దేశాలలో ఒకటి. 108 దివ్య దేశాలు అంటే శ్రీ మహా విష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్య క్షేత్రము లో అని అర్థం. తిరువనంతపురం అనే ఊరు పేరు స్వామి వారి వల్లే వచ్చింది. తిరువనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మ నాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్థం.
 
క్రీస్తు శకం 16 వ శతాబ్దం అంతటా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇది ఇలా ఉంటే ఇక్కడ  బంగారు ఆభరణాలు, వజ్రాలు, వైడుర్యాలు టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు మొదలైనవి ఇక్కడ ఉన్నాయని కూడా తేలింది. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపద తో మొదటి స్థానం లో ఈ ఆలయం నిలబడింది. రెండో స్థానం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిలిచింది.
 
ఈ ఆలయంలో పురాతన నాణేలు: 
 
16వ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలం నాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణాలు, నెపోలియన్ బోనాపార్టీ కాలం నాటి నాణేలు కూడా ఇక్కడ వున్నాయి.
 
అనంత పద్మనాభ స్వామి వారి ఆలయానికి ఎలా వెళ్లాలి..?
 
తిరువనంతపురం, కేరళ రాష్ట్ర రాజధాని దీనిని త్రివేండ్రమ్ అని కూడా అంటారు.  రైలు మార్గం లో ప్రయాణం చేసేవారు చెన్నై తిరువనంతపురం మార్గం లో వెళ్లాలంటే.. తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ అక్కడ  నుంచి కిలో మీటర్ దూరం లోనే ఉంది.
 
దీనికి సమీప ప్రాంతాలు:
 
ఈ ఆలయాన్ని చూసుకున్నాక యానైమలై, అగస్త్య పర్వతము, ఏలకకాయల కొండ వీటిని కూడా మీరు సందర్శించవచ్చు. ఈ ఆలయానికి ఈ ప్రాంతాలు దగ్గరగా ఉంటాయి. 
 
అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం విశేషాలు:
 
శ్రీమద్భాగవతం లో కూడా ఈ ఆలయ ప్రస్తావన జరిగింది అని అంటుంటారు. బలరామ దేవుడు తన తీర్థ యాత్ర లో భాగంగా ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, అలానే ఇక్కడ ఉన్న పద్మ తీర్థం లో స్నానం చేసినట్లు, ఈ ప్రదేశంలోనే పదివేల ఆవులు దానం చేసినట్లు పురాణాల ప్రకారం తెలుస్తోంది. తమిళ అల్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన జరిగింది.ఇది ఇలా ఉండగా ఈ ఆలయ గర్భ గృహం లో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంత శయన భంగిమ లో ఉంటారు. 
 
పద్మనాభస్వామి ఆలయం హిందువులు దర్శనం చేసుకునే పవిత్రమైన చోటు. ఇక్కడ విష్ణుమూర్తి ఉంటారు. ఈ ఆలయాన్ని రాజ కుటుంబీకులు ట్రస్ట్ ని నడుపుతున్నారు. ఇది తిరువనంతపురం కేరళ ఉంటుంది. అయితే ఇవన్నీ అందరికీ తెలిసినవే కానీ అందరికీ తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాల కంటే ఈ దేవాలయం చాలా ఎక్కువ ధనం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 
 
అలానే ఈ దేవాలయంలో 6 గదులు ఉంటాయి. వాటిని సుప్రీం కోర్టు ఏ, బీ, సి, డ్, ఈ, ఎఫ్ అని పేర్లు పెట్టింది. 2011 సంవత్సరంలో ఈ గదులన్నీ ఎస్సీ కమిటీ కొందర్ని నియమించి తెరిపించింది.  మొత్తం ఇక్కడ ఉండే ఖజానా ఎంత అనే విషయానికి వస్తే.... 22 బిలియన్ డాలర్లు ఉంటుందట.
 
బంగారు విగ్రహాలు, బంగారంతో చేసిన ఏనుగులు, డైమండ్ నెక్లీసులు, లెక్కపెట్టలేనన్ని బంగారు నాణాలు ఇలా చాలా బంగారం ఉంటుంది. అలానే రూబీసు ఇలా ఎన్నో ఇక్కడ వున్నాయి. బహు పురాతనమైన ఈ ఆలయాన్ని చూడడం నిజంగా భాగ్యం. రాజా కుటింబీకులు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి. ఇక్కడ షూటింగ్ లు కూడా జరుగుతుంటాయి. బాహుబలి 2 షూటింగ్ ఇక్కడ జరిగింది.
 
సంపన్న క్షేత్రం అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం:
 
ఇప్పటి వరకు ఐదు నేలమాళిగ లలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనే అనంతమైన సంపద బయట పడింది. ఇంకా ఆరో గది తెరవలేదు. అది చాలా పెద్దది. దాన్లో ఇంకా ఎక్కువ సంపద ఉంది. ఇప్పటి వరకే బయట పడిన సంపద తో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది.

అయితే బయట పడిన వాటిలో చాలా ఉన్నాయని మనం చెప్పుకున్నాం. వాటిల్ ప్రతిమలు, కిరీటాలు, పొదిగిన నగలు, బస్తాల కొద్దీ బంగారు, వెండి నాణాలు ఇలా ఎన్నో టన్నుల కొద్ది ఉన్నాయి. పైగా విచిత్రమైన వస్తువులు కూడా ఉన్నాయి బంగారు శంఖాలు, బంగారు కొబ్బరికాయలు ఇలా చాలా వింతైన సంపద బయట పడింది. ఇంకా అతి పెద్ద గది తెరవలేదుట.