ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయింది. పంజాబ్‌లో ఉన్న ప్రభుత్వాన్ని సైతం పోగొట్టుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చలేకపోయింది. కాంగ్రెస్‌పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ!
అన్నా, చెల్లెళ్ల బ్రాండ్ విలువ కూడా తగ్గిపోయింది. యూపీలో యోగి సీఎంగా ఖరారు కాగా, పంజాబ్ లో ఆప్ విజయ దుందుభి మోగించింది. మరి యూపీలో భాజపా, పంజాబ్ లో ఆప్ గెలుపులో కీలకంగా మారిన అంశాలతో పాటు కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను ఈరోజు విశేషంగా తెలుసుకుందాం:
యూపీలో 'యోగి'నాథం…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీతోపాటు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సైతం రికార్డుల మోత మోగించారు.
యూపీలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం, ఆ పార్టీ తరపున యోగీ సీఎంగా రెండోసారి గద్దెనెక్కడంతో అంతటా సందడి వాతావరణం నెలకొంది.
◆ ఐదేళ్ల పదవీకాలం పూర్తై రెండోసారి పార్టీని గెలిపించిన తొలి సీఎం… ఒకసారి గతంలోకి చూసుకుంటే…అది 1952, మే 20… తొలి అసెంబ్లీ కొలువుదీరిన వేళ... అప్పటినుంచి నేటివరకు ఈ డెబ్భై ఏళ్లలో మొత్తం 21 మంది సీఎంలుగా పనిచేశారు. అయితే, ఈ 70 ఏళ్ల యూపీ ఎన్నికల చరిత్రలో ఐదేళ్ల పాటు పూర్తికాలం పదవిలో కొనసాగి, వరుసగా రెండోసారి తన పార్టీని అధికారంలోకి తెచ్చిన తొలి సీఎంగా మాత్రం యోగీ సరికొత్త రికార్డు సృష్టించారు.
◆ ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్నికలను ఎదుర్కొని వరుసగా రెండోసారి సీఎం పదవిలోకి వచ్చిన ఐదో వ్యక్తిగా కూడా యోగీ ఆదిత్యనాథ్ పేరిట రికార్డు నమోదు కాబోతుంది. యోగీ కన్నా ముందు
1957లో సంపూర్ణానంద, 1962లో చంద్రభాను గుప్తా, 1974లో హేమ్వతి నందన్ బహుగుణ, 1985లో నారాయణ్ దత్ తివారీలు వరుసగా రెండోసారి సీఎంలుగా కొనసాగారు.
◆ గతంలో అంటే యోగీ ఆదిత్యనాథ్ కంటే ముందు కళ్యాణ్‌సింగ్, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ వీరిలో ఏ ఒక్కరు కూడా వరుసగా రెండోసారి సీఎం పదవి చేపట్టలేదు.
◆ దాదాపు 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సీఎం కాబోతున్నాడు.
గతంలో, 2007లో ఎమ్మెల్సీగా మాయవతి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
ఆ తర్వాత 2012లో అఖిలేష్ యాదవ్ కూడా ఎమ్మెల్సీగా సీఎం బాధ్యతలు తీసుకున్నారు. 2017లో యోగీ ఆదిత్యనాథ్ కూడా లోక్‌సభ సభ్యుడిగా ఉండి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూ, సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు.
ఆప్ దే… పంజాబ్!
ఆప్ పంజాబ్‌లో మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇప్పటివరకు కాంగ్రెస్ పేరిట ఉన్న గొప్ప రికార్డును చేరిపేస్తూ 60 ఏళ్ల తర్వాత మళ్లీ కొత్త రికార్డును కేజ్రీవాల్ తిరగరాశారు.
◆ 1962 తర్వాత పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీ అంటే, ఇతర ఏ పార్టీలతో పొత్తు లేకుండా 92 సీట్లు గెలవడం మళ్లీ 2022 ఎన్నికల్లోనే చోటుచేసుకుంది.
గతంలో 1962లో, కాంగ్రెస్ 90 స్థానాల్లో విజయం సాధించగా, తాజాగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాల్లో గెలుపొంది, అప్పటి కాంగ్రెస్ రికార్డును తిరగరాసింది.
◆ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మోడల్‌కు పంజాబ్ ప్రజలు పట్టం కట్టారనే చెప్పాలి. నాణ్యమైన విద్య, వైద్య, సుపరిపాలన అందిస్తామన్న ఆప్కే పూర్తి అధికారాన్ని అప్పగించేశాయి. పంజాబీల ఓటు దెబ్బకు కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌లు ఆప్ దరిదాపుల్లో కూడా లేకుండాపోయాయి.
ఢిల్లీలో అందిస్తున్నట్లే పంజాబ్ లోనూ అదే సుపరిపాలన అందిస్తామని ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ అన్నారు.
ఆప్.. విజయానికి కారణాలు…
ఎనిమిదేళ్లుగా పంజాబ్ కోటలో పాగా వేయాలన్న కేజ్రివాల్ ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి. ఢిల్లీ మోడల్ పాలన హామీలతో సామాన్యుడు అదరగొట్టాడు. ఎవరి ఊహకి అందని అసాధారణ విజయం. కాంగ్రెస్ దళిత కార్డు యోచనని, శిరోమణి అకాలీదళ్ సంప్రదాయ వ్యూహాలను, కెప్టెన్ అమరీందర్ ప్రజాకర్షణ పథకాల్ని ఒకేసారి తుడిచిపెట్టేస్తూ కుల, మత, ప్రాంతీయ రాజకీయ సమీకరణలకి అతీతంగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరి మోగించింది. కాంగ్రెస్ కంచుకోటల్ని బద్దలు కొట్టి అఖండ మెజార్టీతో విజయం సాధించింది.
70ఏళ్ల పాటు రెండు ప్రధాన పార్టీలనే ఆదరించిన పంజాబ్‌కు ఆప్ ఒక ఆశాకిరణమైంది. ఢిల్లీ మోడల్ పరిపాలనను చూసి ఆ పార్టీని అక్కున చేర్చుకున్నారు పంజాబీలు.
గత 70 ఏళ్లుగా పంజాబ్ లో రెండు పార్టీలే రాజ్యమేలాయి. శిరోమణి అకాలీదళ్ లేదంటే కాంగ్రెస్ ఈ రెండు పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఏడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్లు రూపాయికి చెరోవైపు ఉన్న పార్టీలేనని పంజాబ్ ప్రజలు భావించేవారు. అయితే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. రోజు రోజుకి పడిపోతున్న ప్రజల తలసరి ఆదాయం, ఏళ్ల తరబడి రాజకీయ పక్షాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం చూసి పూర్తి స్థాయిలో విసుగెత్తిపోయిన ప్రజలు ఆప్‌వైపు మళ్లారు.
ఈసారి ప్రజలు ఫూల్స్ అవ్వకుండా భగవంత్ మన్, కేజ్రివాల్‌కే అవకాశం ఇస్తారన్న ఆప్ ప్రచార వ్యూహం ఫలించింది.
ఢిల్లీ మోడల్…
ఢిల్లీలో ఆప్ చేసిన అభివృద్ధి పక్కనే ఉన్న పంజాబ్‌ను విపరీతంగా ఆకర్షించిందనే చెప్పుకోవాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ గత కొన్నేళ్లుగా పంజాబ్ మీదే దృష్టి పెట్టారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ తరహా పాలనను పంజాబ్‌లో తీసుకువచ్చి అభివృద్ధి బాటలు పరుస్తామని సీఎం కేజ్రివాల్ తెచ్చిన హామీలను ప్రజలు బలంగా నమ్మారు.
నాణ్యమైన ప్రభుత్వ విద్య, ఆరోగ్యం, నెలకు 300 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ అందివ్వడం, తక్కువ చార్జీలకే తాగునీరు అనే ఈ నాలుగు స్తంభాల మీదే ఢిల్లీ పరిపాలన కొనసాగింది.
◆ ఉద్యోగాలకు అవసరమయ్యే కోచింగ్ సెంటర్లకు ఫీజులు కడతామన్న ఉచిత పథకాలు యువతని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు మరే పార్టీ చేయని విధంగా మహిళలను ప్రత్యేకమైన ఓటు బ్యాంకుగా కేజ్రివాల్ గుర్తించారు. ఆప్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుపేద మహిళలకు ప్రతీ నెల రూ.వెయ్యి ఇస్తున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రంలో మహిళలకి కాస్తో కూస్తో ఆర్థిక స్వాతంత్య్రం వస్తుందన్న ఆశ వారిని ఆప్ వైపు మొగ్గేలా చేసింది.
◆ పంజాబ్‌లో వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపాటు చేసిన సుదీర్ఘ పోరాటం అధికార మార్పుకి దోహద పడింది.
రైతు ఆందోళనలకు మొదట్నుంచీ ఆప్ మద్దతు ఇస్తూ వచ్చింది.
సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్…
పంజాబ్‌లో ఆప్ పట్ల బయట పార్టీ అన్న ముద్ర ఉంది. పరాయివారు మనల్ని పరిపాలించడానికి అవకాశం ఇస్తారా అంటూ ఇతర పార్టీలు పదే పదే ఆప్‌పై బురదజల్లే ప్రయత్నం చేశాయి.
గత ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికల బరిలో దిగి తప్పు చేసిన ఆప్ ఈసారి దానిని సరిదిద్దుకుంది.
భగవంత్ మన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలకు ముందే ప్రకటించి తమ పార్టీపై ఉన్న ఆ ముద్రను చెరిపేయడానికి కేజ్రివాల్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
◆ ఒక కమెడియన్‌గా, రాజకీయ నాయకుడిగా భగవంత్ మన్కు పంజాబీయుల మదిలో ప్రత్యేక స్థానముంది. సంప్రదాయ, వారసత్వ రాజకీయ నాయకుల్ని చూసి విసిగిపోయిన ప్రజలకి భగవంత్మన్లో హాస్యస్ఫూర్తి నచ్చి, అతనిపై మరింత అభిమానాన్ని పెంచుకునేలా చేసింది.
◆ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడం, భారీ పరిశ్రమలను తీసుకురావడం, సాగును లాభసాటిగా మార్చడం, మహిళలకు భద్రత కల్పించడం, క్రీడా మౌలిక సదుపాయాలను పెంచడం లాంటి ప్రాధాన్యాంశాల్ని ఆయన వివరించారు.
క్రీడలను ప్రోత్సహించడానికి గ్రామాల్లో ట్రాక్స్, స్టేడియంలు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో మంత్రులు ఎప్పటికప్పుడు పర్యటిస్తుంటారని.. ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటారని కూడా చెప్పారు.
‘ఆప్‌కు ఓటేయని వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల ప్రజల కోసం పార్టీ పని చేస్తుంది’ అని చెప్పారు.
◆ ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తిరిగి తీసుకురావడంపై ఆయన స్పందిస్తూ.. ‘మన పిల్లలు చదువుకోవడానికి బయటకు ఎందుకు వెళ్లాలి. మనమే అందుబాటు ధరల్లో సదుపాయాలు ఎందుకు కల్పించకూడదు’ అని అన్నారు.
జాడలేని కాంగ్రెస్…
◆ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ చార్జి ప్రియాంకాగాంధీ యూపీ ఎన్నికలప్పుడు ఎవరూ చేయనంత ప్రచారం చేశారు.
మొత్తం 209 ర్యాలీలు, రోడ్ షోలలో ప్రసంగించారు. యూపీ మీదే ఆమె ఎక్కువగా దృష్టి సారించినా ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్‌ల్లోనూ పర్యటించారు.
◆ మహిళల సమస్యలపై ఎక్కువగా ఫోకస్ చేసినా, తన సభలకు పెద్ద ఎత్తున ప్రజలను రప్పించగలిగినప్పటికీ, వారిని ఓటు బ్యాంకుగా మలుచుకోలేకపోయారు.
◆ ఇక రాహుల్‌గాంధీ సైతం ఐదు రాష్ట్రాల్లో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. అయినా ఆయన మ్యాజిక్కులేవి పనిచేయలేదు.
◆ పంజాబ్‌లో దళితుడ్ని ముఖ్యమంత్రిని చేశామని చూపించే ప్రయత్నం చేశారు కానీ అది బెడిసికొట్టింది. ప్రియాంకా గాంధీ కష్టపడ్డారనడంలో సందేహం లేదు. క్షేత్రస్థాయిలో ఆమె బాగా పనిచేశారు.
◆ రాజకీయాల్లో మ్యాజిక్కులంటూ ఉండవు, కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదు.
ఇప్పుడు కాంగ్రెస్‌కు అలాంటి బ్యాడ్ టైమే నడుస్తోంది. రాజీకీయాలు ఒక్కరాడే ఆట కాదు, ఇది సమష్టిగా ఆడే ఆట అని గాంధీ కుటుంబం ఇప్పటికైనా తెలుసుకోవాలని అలాగే బలమైన నేతలను ఒక్కతాటి మీదకు తీసుకురావడంలో పార్టీ పూర్తిగా విఫలమైందని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఓటమిపాలైన ప్రతిసారీ పార్టీలో అసమ్మతిరాగాలు పెరుగుతూనే ఉంటాయి. అలా గొంతెత్తిన వారిని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. అదే సమస్యకు అసలు కారణం.
రాష్ట్రాల్లో స్థానిక నాయకులకు ప్రోత్సాహం పెరగాలి అప్పుడే ఇటువంటివి జరగకుండా జాగ్రత్త పడొచ్చు.
జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సచిన్ పైలట్వంటి నేతలను కొత్త నాయకత్వంగా చూపించే ప్రయత్నం చేసి ఉండాలి. కానీ కాంగ్రెస్ అందులో విఫలమైంది.
గతంలో కాంగ్రెస్‌కు రాష్ట్రాల్లో నమ్మిన బంట్ల వంటి రాజకీయ నాయకులున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు నేతలే దేశం మొత్తాన్ని సమీకరించాలనుకున్నారు. ఇక్కడే అన్నాచెల్లెళ్లు విఫలమయ్యారంటున్నారు విశ్లేషకులు.
రాహుల్, ప్రియాంకాగాంధీలు పార్టీలోనూ విశ్వసనీయత కోల్పోతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
దీంతో వైఫల్యానికి బాధ్యులను చేస్తూ త్వరలోనే సొంత పార్టీ నేతలే వారి మీద కత్తులు దూయడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మీమ్స్ అండ్ జోక్స్‌తో ట్వీట్లు...
ఐదు రాష్ట్రాల్లో ఓటమిపాలైన కాంగ్రెస్‌పై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ తెగ వైరలవుతున్నాయి. రాహుల్‌గాంధీ, నవజ్యోత్‌సింగ్, సిద్ధూలపై అదేపనిగా జోకులు పేలుతున్నాయి.
‘కాంగ్రెస్‌కు మరో ఆప్షన్ లేదు. గాంధీ ఫ్యామిలీని వదిలేసి.. కొత్త నాయకత్వంతో ముందుకు రావాలి. లేదంటే పార్టీ పనైపోయినట్టేనని ఈ ఎన్నికల ఫలితాలు సందేశమిస్తున్నాయి’ అని ఫిల్మ్ మేకర్ మనీష్ ముంద్రా ట్వీట్ చేశారు.
ఇక రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందంటూ పలువురు ట్వీట్స్ చేశారు. ‘రాహుల్ గాంధీ బ్రేక్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఇప్పుడు అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు.
ఇక కాలమిస్ట్, రచయిత ఆనంద్ రంగనాథన్ అయితే ఏకంగా ఫ్లైట్ అనౌన్స్‌మెంట్‌ను అనుకరిస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శించాడు.
పంజాబ్‌లో పార్టీ ఓటమికి కారణమయ్యారంటూ మాజీ క్రికెటర్ సిద్ధూపై నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
పంజాబ్ ఎగ్జిట్‌పోల్స్ చూడగానే సిద్ధూకి కపిల్ శర్మ ఫోన్ కాల్ వస్తుందని, తనకూ పోటీ వస్తున్నందున అర్చనా పురాణ్ శర్మ జాగ్రత్తగా ఉండాలంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
★ ఇక కాంగ్రెస్ భవితవ్యం ప్రశ్నార్ధకమే! అనిపిస్తుంది.