BREAKING NEWS

కల్యాణాలు - వైభోగాలు - 2

సరే ....పార్ట్ 1 లో గతం గురించి. అప్పట్లో పెళ్లిళ్ల గురించి చదివారు కదా... అందరూ అంటుంటారు రోజులన్నీ ఒకేలా ఉండవు అని... నిజమే... కాలానికి అనుగుణంగా పద్ధతులు కూడా మారుతూ ఉంటాయి.. నిన్న ఉన్న పద్దతి రేపు ఉండదు. రేపు లేని పద్ధతి ఎల్లుండి కి అలవాటు అయ్యే అవకాశమూ ఉంది. ప్రస్తుతానికి వస్తే ...

ముందుగా ఫంక్షన్ హాల్, బాంకెట్ హాల్ లాంటి రకరకాల పేర్లతో పిలవబడుతున్న కల్యాణ మండపాలు ఖాళీ ఉన్న తేదీలు ముందుగా చెక్ చేసుకుని , దానికనుగుణంగా ముహూర్తం పెట్టించుకుంటున్నారు... అది కూడా అర్ధరాత్రి ఒంటిగంట లోపు ఉండే విధంగా..

ఎందుకంటే మండపాలు అన్నీ ఒక టైమింగ్ లో ఉంటాయి. ఉదయం 6 గంటలకు ఇస్తే మర్నాడు ఉదయం 5 గంటలకు ఖాళీ చేసేయాలి. లేదంటే  1 రోజు కాస్తా రెండు రోజుల అద్దె చెల్లించాలి. ఇది వరకు అయితే మన ముహూర్తం టైమ్ ని బట్టి ఈ రోజు ఎన్ని గంటలకు తీసుకుంటే .. మర్నాడు అదే టైమ్ వరకు మనకు అవకాశం ఉండేది.కానీ ఆ రోజులు ఎప్పుడో పోయాయి... మన అవసరాలతో సంబంధం లేదు... అన్నీ ఫంక్షన్ హాల్ యాజమాన్యందే నిర్ణయం... ఉదయం 6 నుండి ఉదయం 5 గంటల వరకు మాత్రమే ప్యాకేజీ.  A/C హాల్ కాబట్టి హోమాలు చెయ్యకూడదు. వంటలు వండకూడదు. ఇక గజిబిజి నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ లో పార్కింగ్ సదుపాయాలు కూడా అంతంత మాత్రమే...

మనకు కావాల్సిన సదుపాయాలు ఇస్తూ ధర కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు. కానీ ధర మాత్రం భారీగానే ఉంటుంది. ఒక్కో ఫంక్షన్ హాల్ రోజుకు కనీసం 70 వేలు తక్కువ ఉండడం లేదు. కరెంట్ ఖర్చులు అదనం.. ఒకవేళ కరెంట్ పోతే డీజల్ ఖర్చు , క్లినింగ్ చార్జీలు, స్టేజ్ డెకరేషన్, బిల్డింగ్ ఔట్ సైడ్ డెకరేషన్ ఇలా వీటన్నింటికీ ధరలు వేరే చెల్లించాలి..

ఆచారాలు ప్రకారం హోమం చేయాల్సిన వాళ్ళు ఎక్కడికి వెళ్లిపోవాలి... అందరూ ఇష్టంగా తినే భోజనం కూడా మండపంలో వండడానికి వీలులేదు.  మరెక్కడో చెయ్యాలి.. లేదా కేటరింగ్ కి ఇచ్చేసి చేతులు కట్టుకు కూర్చోవాలి. 
పార్కింగ్ రోడ్డుపై చెయ్యాలి.  వేలాది రూపాయలు మాత్రం వీళ్ళకివ్వాలి..  అయినా అదే డిమాండ్ ...
ఏమిటో ఈ విచిత్రం ..

Photo Gallery