BREAKING NEWS

కళ్యాణాలు - వైభోగాలు

తమ పిల్లలకు యుక్తవయసు రాగానే తల్లితండ్రులందరి ఆలోచన ఒకేలా ఉంటుంది.

మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి జరిపించాలి.అన్ని విధాలా అనుకూలంగా ఉన్న సంబంధం కుదిరిన వెంటనే.
మొట్టమొదటిగా నిర్ణయించేది కళ్యాణవేదిక. 

పూర్వం అయితే మూడు , ఐదు , ఏడు రోజుల పెళ్లిళ్లు అదికూడా ,ఆరుబయట విశాలంగా చలువ పందిళ్లు వేసి చుట్టాలు,స్నేహితులు, సన్నిహితులుతో కోలాహలంగా జరిపేవారు. వారు కూడా తీరిగ్గా వచ్చి , నిర్వాహకులు ఇచ్చిన వసతిలోఎక్కడ ఎలా వీలయితే అలా అందరితోనూ సరదాగా గడుపుతూ వివహతంతు పూర్తి అయ్యేంతవరకు ఉండి, వెళ్లేవారు. A/C లేదనో , ఫ్యాన్ లేదనో , ఫ్రిజ్ లేదనో , పరుపు లేదనో , దిండు లేదనో లాంటివి పట్టించుకోకుండా ఆత్మీయులతో కాలక్షేపం చెయ్యడమే పరమావధిగా భావించేవారు. ఇక .... ఆ రోజుల్లో అయితే,,పుట్టినరోజు , బారసాల , అన్నప్రాసన , సంవర్త లాంటి ఫంక్షన్స్ కి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. 

 క్రమేపి ఆనాటి సంప్రదాయం తగ్గుతూ తగ్గుతూ కేవలం ఒక రోజు పెళ్లి తంతులోకి వచ్చింది. అదే సమయంలో ...ప్రతి చిన్న తంతు ఒక వేడుకగా అందరినీ పిలిచి ఘనంగా , ఆర్భాటంగా చెయ్యాలి అనే కాంక్ష అందరిలోనూ క్రమేపి పెరుగుతూ వస్తోంది.

ఆరుబయట విశాలమైన పందిళ్లు కనుమరుగయ్యాయి. చుట్టాలు , బంధువులు , స్నేహితులు కూడా సాయింత్రం  రావడం , క్యూలో నిలబడి మొక్కుబడిగా నాలుగు అక్షితలు వేసేసి , భోజనాలు ఎక్కడో ఎవరికి వారే వెతుక్కుని ఎదో తిన్నాం అనిపించుకుని హడావిడిగా పరుగులు పెట్టడమే ...

గతంలో వచ్చినట్లుగా ముందుగా రావడానికి ఆత్మీయులకు కూడా వీలవని పరిస్థితి.ఎందుకంటే శ్రీవారు ఉద్యోగంలో బిజీ. శ్రీమతిగారు కూడా ఉద్యోగస్తురాలయితే ఇక చెప్పనలవి కాదు. పోనీ ఒకవేళ అవిడగారికి ఉద్యోగం లేకపోయినా బుడతడుకి స్కూల్. నర్సరీ లేదా ఎల్.కేజీ.చదువుతో ఫుల్ బిజీ.

ఒక్కపూట కూడా స్కూల్ మానిపించడానికి మిస్ ఒప్పుకోదు. కాబట్టి సార్ ఆఫీసు నుండి, బుడతడు స్కూల్ నుండి వచ్చిన తర్వాతనే  తీరిగ్గా మేకప్ అయి , పెళ్లికి వచ్చి అందరికీ హాయ్ చెప్పి , వచ్చినంత వేగంగానూ వెళ్లిపోవాలి. ఆ కాసేపట్లోనే AC సరిగ్గా లేదని ఆపసోపాలు..

అదిగో ..సరిగ్గా .. అప్పుడే స్టార్ట్ అయ్యింది కొత్తపోకడ .కళ్యాణమండపంలో పెళ్లి చెయ్యడం.ఇప్పుడు వీటిని కళ్యాణమండపం అని అనడానికి కూడా చాలా మంది అంగీకరించడం లేదు. 

ఫంక్షన్ హాల్ , బంకెట్ హాల్ , కన్వెన్షన్స్ ఇలా అనేక రకాలుగా రూపాంతరం చెందింది ..     ఈ  కల్యాణ మండపం.

Photo Gallery