BREAKING NEWS

స్మార్ట్ మిస్టేక్స్...

స్మార్ట్ ఫోన్.... సమాచార రంగంలో పెను సంచలనం...  100 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో దాదాపుగా అందరికీ సెల్ ఫోన్లు అది కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. స్మార్ట్ ఫోన్ రాకముందు కేవలం సమాచారం మార్చుకోవడానికి మాత్రమే సెల్ ఫోన్లు ఉపయోగపడేవి...

కానీ స్మార్ట్ ఫోన్ లు వచ్చిన తర్వాత ప్రతి పనికి ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం.. ప్రపంచం మొత్తం మన చేతుల్లోనే ఇమిడిపోతుంది... అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో ఈ అప్లికేషన్ లు అన్ని మంచికే ఉపయోగపడుతున్నాయా... 

                        ఈ ప్రపంచంలో ఎవరు ఈయన కనిపెట్టిన అది మంచి చేయడం కోసమే... అయితే అది వాడుకోవడం లోనే అసలు ప్రాబ్లం... మంచి కోసం కనిపెట్టే ఇవన్నీ చెడు కోసమే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం... అందుకేనేమో సమాజానికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో కంగా కోర్టులే ఈ అప్లికేషన్ల వ్యవహారంలో తీర్పులు చెబుతున్నాయి అంటే పరిస్థితి ఈ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు... తాజాగా టిక్ టాక్ అప్లికేషన్ పై హైకోర్టు సీరియస్ అయింది... గూగుల్ ప్లే స్టోర్ లో గాని ఆపిల్ స్టోర్ లో గాని ఈ అప్లికేషన్ కనిపించకుండా తొలగించాలంటూ  ఆదేశించింది...

టిక్ టాక్ అంటే సినిమా డైలాగులు కి పాటలకు మనం నటించి, మన హావభావాలు ప్రకటించి ఆనందించే ఒక సరదా యాప్... తాజాగా బ్యాన్ చేయబడింది...   ఇది మాత్రమే కాదు పబ్ జీ అనే ఒక గేమింగ్ అప్లికేషన్ కూడా బ్యాన్ చేశారు ...అయితే వీటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది..

                 ఏదైనా ఒక వస్తువు లేదా ఇప్పటి భాషలో చెప్పాలంటే ఓ అప్లికేషన్ కనిపెట్టిన దాని పర్పస్ ఏంటో దానికి మాత్రమే వాడాలి. అలా కాదు అని వేరే విధంగా వాడితే కచ్చితంగా అనర్థాలకు దారి తీస్తుంది... ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న టిక్ టాక్ ఆప్ పరిస్థితి అదే.. మనం ఉండే టాలెంట్ ని ప్రపంచానికి చాలా సింపుల్ గా చూపించే చూపించగలిగే అప్లికేషన్ టిక్ టాక్.

కానీ మనం కేవలం టాలెంట్ ని చూపించడానికి లేదా టైం పాస్ కోసమో వాడుతున్నామా... ఈ ప్రశ్నకి సమాధానం కచ్చితంగా కాదు అని మాత్రమే... ఇది మన అందరికీ తెలిసిన విషయం.. టిక్ టాక్ ద్వారా వ్యక్తిగత విషయాలను టచ్ చేస్తూ ఒకరినొకరు తిట్టుకునే స్థాయి కి కూడా వెళ్లారు... ముక్కు మొహం తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు.. ముఖ్యంగా గా చిన్న పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ లను చాలా సింపుల్ గా వాడేస్తున్నారు..

అలాంటి వాళ్ళు ఎవరు కూడా తెలియని ఈ ఈ ఆన్లైన్ స్నేహాలతో ఎన్నో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.. మరోవైపు అశ్లీల దృశ్యాలు కూడా ఈ యాప్ ద్వారా ఎంతోమంది షేర్ చేస్తున్నారు.. ఇవన్నీ చిన్న పిల్లల మనసులో చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంది.. అందుకే ఈ యాప్ ని బ్యాన్ చెయ్యాలంటూ ఆదేశాలు జారీ చేశారు...

             ఇక పబ్ జీ గేమ్... ఆటలు ఆహ్లాదం గా ఉండాలి.. మనసుకి  ప్రశాంతతనివ్వాలి.. కానీ ఈ పబ్ జి గేమ్ వల్ల ఎంతోమంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గంటలు, రోజులు, నెలలు తరబడి ఈ గేమ్ ఆడుతూ పూర్తిగా ఈ ఆటకే దాసోహం అయిపోతున్నారు.... గేమ్ పిచ్చిలో పడి ఏం చేస్తున్నారో , ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా వారికి తెలియడం లేదు.

వాళ్లంతట వాళ్లే ఆత్మహత్య చేసుకోవడం, గాయపరుచుకోవడం , ఎవ్వరితోనూ మాట్లాడకపోవడం లాంటి పనులన్నీ చేస్తున్నారు. ఇదంతా కేవలం ఆ ఆటకు బానిసలు కావడమే.. అయినా ఆటలో ప్రశాంతత ఉండాలి గాని, యుద్ధ వాతావరణాలు, ఒకరినొకరు చంపుకోవడాలు ఆటలు కాదు... స్మార్ట్ గేమ్స్ కూడా మెదడుపై ఎంతో ప్రభావం చూపిస్తాయి.. గేమ్ లో లాగే నిజజీవితంలో కూడా ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు.. ఎంతోమంది జీవితాల్లో నాశనం చేస్తున్న ఇలాంటి అప్లికేషన్ లను బ్యాన్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు..

                సో మై డియర్ ఫ్రెండ్స్ & పేరెంట్స్... ఒక్కసారి ఆలోచించండి... మనం టెక్నాలజీని నిజంగా సరైన మార్గంలో నే వాడుతున్నామా... ఎవర్ని వాళ్లు ప్రశ్నించుకోండి.. సమాధానం సరైనది అంటే కంటిన్యూ అయిపోండి లేదంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఈ క్షణం నుంచే ప్రయత్నించండి... భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా ఉండగలం... ఎందుకంటే భవిష్యత్తు మొత్తం టెక్నాలజీ మీదే ఆధారపడి ఉంటుంది... బీ కేర్ ఫుల్...
                 

Photo Gallery