BREAKING NEWS

సామాన్యుడి దృక్కోణంలో చంద్రబాబు

ఇంతవరకు ఎన్నో సందర్భాలలో  ఎంతోమంది మంత్రులు, పెద్దలు, TDP కార్యకర్తలు చంద్రబాబు గారి గురించి , ఆయన సుపరిపాలన గురించి కొనియాడారు… బాగుంది,, వారందరూ ఆయన్ని దగ్గర నుంచి చూసి ఉంటారు, పార్టీ సభ్యులు కాబట్టి మాట్లాడారు.

మరి ఒక సామాన్య ఓటరు అయిన నేను , ఆయన్ని దగ్గరుండి చూడకుండా ఎందుకు నమ్మాలి ??? కేవలం వారందరూ చెప్పారనా ?? ఎంత మాత్రము కాదు … !! నేరుగా ఆయన్ని కలిసే అవకాశం రాకపోయినా,, నేను చూసిన కోణంలో ఆయన్ని ఎందుకు నమ్మాలంటే ?

1991 లో పుట్టిన నాకు 11, 12 సం ల వయసు వరకు కరెంట్ అనేది పోతుందని తెలీదు. ! మున్సిపల్ ప్రభుత్వ పాఠశాల మరియు మన జిల్లాపరిషత్ పాఠశాల లో చదివిన నేను క్లీన్ & గ్రీన్, జన్మభూమి, చదువుల పండగ, ఆడపిల్లలకి సైకిల్ బహుమతి వంటి పథకాలు, వాటి ప్రభావం కనులారా చూసాను. అప్పుడే నాకు మొదటిసారి అన్పించింది,, సి.యం. అంటే చంద్రబాబు గారే అని … రైతుబజార్లు, నీరు-మీరు , డ్వాక్రా మహిళలు వంటి సంక్షేమ పథకాలు ఎంత ఉపయోగ పడ్డాయో ఎవ్వరూ చెప్పకపోయినా అందరికీ అనుభవమే.  ఆఖరికి ఇంకుడు గుంతలు వంటి చిన్న అంశాలు కూడా ఆయన వదల్లేదు, భూగర్భజలాల పరక్షణకి అవి ఎంతో మేలు. 

నిన్న గాక మొన్న కూడా హుదూద్ విపత్తు వచ్చి అతలాకుతలం అయినప్పుడు, ప్రతి పౌరుడు విద్యుత్ పునరుద్ధరణకే నెల పడుతుందని అంచనాలో ఉన్నప్పుడు, అహర్నిశలు కష్టపడి, అర్థరాత్రి కూడా జిల్లాలో తిరుగుతూ, కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ, కేవలం పది రోజుల్లో కరెంట్ ఇచ్చి , సంవత్సరం తిరిగే లోపు విశాఖోత్సవాలు జరిపించిన ఘనత కేవలం చంద్రబాబు గారికే సాధ్యం. దానికి విశాఖ జిల్లా వాసిగా నాతో పాటు అందరం స్వయం సాక్ష్యం…   ఇవన్నీ ఒకెత్తు.

ఆయన టెక్నాలజీ ని వాడకంలో ఎంత ముందుంటారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ , సైబరాబాద్ అభివృద్ధి ఆయన కృషి వల్లనే అన్నది లిఖిత చరిత్ర.  దాని వల్ల ఐటీ రంగంలో ఎన్ని లక్షలమంది ప్రత్యక్షంగా,,, పరోక్షంగా ఎదిగారో తెలియడానికి సామాన్యుడైతే చాలు కదా !

I.T. డెవెలెప్ మెంట్ కోసం ఆయన ఆనాడు అమెరికా వీధుల్లో కాలినడకన తిరిగినా ,, ప్రపంచపటంలో ఒక తెలుగు పట్టణాన్ని చేర్చినా,  అనుకున్నది అనుకున్నట్లు జరిగితేనే నేను అభివృద్ధి చేస్తా అన్న చందాన కాకుండా నేడు కూడా హోదా రాకపోయినా, దానిపై పోరాటం చేస్తూనే, ఇంకో ప్రక్క వివిధ ఇతర మార్గాల ద్వారా అభివృద్ధిని కొనసాగిస్తున్నారు.
 
 “నేను పదేళ్ల సియం ని, నా స్థాయి ఇదీ” అంటూ భేషజాలకు, పంతానికీ పోకుండా ఓర్మితో పని చేస్తూ “ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు” అని ఆచరణలో నిరూపిస్తుండడం టి.వి.ల లోనే చూస్తున్నాం. అది “కార్య సాధకుల లక్షణం” కూడా..

సరే ఇవన్నీ చూస్తున్నాను, మరి నాకు దేనికైనా T.V. యే కదా ముఖ్యసాధనం, రాజకీయాలను తెలుసుకోవడానికి ! మరి ఆయన పై చాలా విమర్శలు, ఆరోపణలు రావడం చూస్తున్నాను. వాటిని ఎలా అర్ధం చేసుకోవాలి ? ఎందుకంటే వాస్తవాలు దగ్గరికి వెళ్ళి గమనించడం నాకు సాధ్యం కాదుకదా !!  కానీ ఒక్కటి అర్ధం చేసుకోగలను, “కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు” . ఆ ఆరోపణలే నిజమైతే సుమారు 68 సం ల వయసులో రోజులో 16-18 గం లు శారీరకంగా , మానసికంగా ఆయన పడుతున్న టివి లో చూసినా కళ్ళకు కడుతోంది కదా ?? 4-5 గంలు కూర్చుని పని చేసినా అలసిపోవడం సహజం, అలాంటిది నిరంతరం ఆయన తీసే పరుగులు “అభివృద్ధి” కాంక్షతోనే. కాకుంటే సచివాలయంలోని A/C రూం నుండి పరిపాలన కొనసాగించినా చెల్లుబాటు అయ్యేది కాదా ? రావలసినవి రాకపోతాయా ? 

పైగా గతంలో  ప్రజల వద్దకు పాలన, జన్మ‌భూమి వంటి పథకాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర చేయడం, ఇ-సేవా ల ద్వారా పరిపాలనలో పారదర్శకత తీసుకురావడం, నేడు మరింత అప్ గ్రేడ్ అయ్యి " రియల్ టైమ్ గవర్నెన్స్" ద్వారా ఎప్పటికప్పుడు కార్యక్రమాలను పర్యవేక్షించడం, 1100 లైన్ ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించడం ఇవన్ని అవినీతి రహితానికి దోహదం చేసే కార్యక్రమాలే.

పోనీ ఇంకా చర్చించినా నాకు తోచింది ఒక్కటే ! ఆనాడు శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు అంతటి వ్యక్తి చేత “అశ్వత్థామ అతః , … కుంజరః“  అని ఒక  అబద్ధం లాంటిది ఆడించాల్సి వచ్చింది. అది ధర్మసంస్థాపన కోసమే అని గ్రహించగలిగిన వారికి ఆయన దేవుడే కదా,,, అది ఆ కృష్ణుని మహత్యం అయితే,,, ఇది ఈ చంద్రుడి చాణక్యం, అది అవసరమే కదా ! అంతిమ లక్ష్యం “అభివృద్ధి” ,,, “స్వయం సమృధ్ధి”

ఒక సినిమా తీయడానికే మూడేళ్ళు పడుతున్న ఈ రోజుల్లో , రియల్ గా ఒక గొప్ప రాజధాని ని నిర్మించడానికి కచ్చితంగా సమయం పడుతుంది. అందుకు మన చంద్రబాబు గారి విజన్, అడ్మినిస్ట్రేషన్, సమర్థత పట్ల సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధస్తుందని నమ్ముతున్నాను.

అందుకే ఆయనే మరో పది కాలాల పాటు మనకు ముఖ్యమంత్రి గా ఉండాలి అని నా ఆకాంక్ష !!!

Photo Gallery