
ప్రజలు తమ "సంక్షేమాన్ని" తామే చూసుకోగలిగే స్థాయికి వారు "అభివృద్ధి" చెంది, ప్రభుత్వం పై ఆధారపడే అవసరం లేకుండా చేసే కొన్ని " స్వయం వికాస పథకాలు " కూడా మన రాష్ట్రంలో అమలయ్యాయి. వాటిలో కొన్ని :
1) ప్రజల వద్దకు పాలన : 1995 నవంబరులో ప్రారంభమైన దీని ముఖ్యోద్దేశం క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలు తెలుసుకుని, వారికి కావలసిన సదుపాయాలు కల్పించి, పథకాల రూపకల్పనలో ప్రజలను స్వయంగా భాగస్వాములను చేయడం, ఆ పథకాల ఫలాలు నేరుగా ప్రజల వద్దకే అందేలా చేయడం, పథకాల అమలులో లోపాలు లేకుండా పర్యవేక్షణ, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం.. మొదలగునవి,
2) శ్రమదానం : 1996 జనవరి లో ఈ పథకం మొదలయ్యింది. ప్రజలను కూడా అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములను చేసి వివిధ కార్యక్రమాలలో ప్రజలు వారి వంతు "కృషి" ని అందించేలా చేసింది.
3) జన్మభూమి : 1997 లో మరింత విస్తృత లక్ష్యాలతో పై రెండింటిని ఏకం చేసి "జన్మభూమి" కార్యక్రమం మొదలయింది. గ్రామ స్థాయిలో స్థానిక ప్రజలతో "గ్రామ సభ" కమిటీలు ఏర్పాటు చేసి, సర్పంచ్ సమక్షంలో పీరియాడికల్ గా సమావేశమై, విద్య, వైద్య, సామాజిక సమస్యలను గుర్తించి, వాటిపై చర్చించి, అందుకు పరిష్కారాలు అన్వేషించేలా పథకాన్ని రూపొందించారు. తద్వారా అభివృద్ధి కార్యక్రమాలలో నేరుగా ప్రజా భాగస్వామ్యాన్ని కల్పించి వారి సమస్యలు వారే పరిష్కరించుకునే అవకాశం కలుగుతోంది. అలాగే ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి మధ్య అంతరాలు తొలగి, సమన్వయంతో, సమిష్టిగా కృషి చేసి ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధించడానికి ఉపయోగ పడింది. పరిపాలనలో పారదర్శకత వచ్చింది ఇది ఒక రకంగా " లోకల్ గవర్నెన్స్ " విధానం.
4) క్లీన్ & గ్రీన్: 1998 లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చే పర్యావరణ పరిరక్షణకై పరిసరాల పరిశుభ్రత, అనువైన స్థలాలలో పచ్చదనానికై మొక్కలు నాటడం, గ్రామాలు మరియు పట్నాల్లో మరుగుదొడ్ల నిర్మాణం మొదలగు లక్ష్యాలతో ఈ పథకం మొదలయ్యింది. ఇందులో కొన్ని లక్షలమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. ప్రతి నెల మూడవ శనివారం క్లీన్ & గ్రీన్ డే గా పాటించేవారు. సరిగ్గా ఈ పథకం స్ఫూర్తితోనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా " స్వచ్ఛభారత్ " పేరుతో అమలవుతోంది. ఇందుకోసం ప్రజలనుంచి "స్వచ్ఛతా ట్యాక్స్" కూడా వసూలు చేస్తున్నారు.
5)డ్వాక్రా మహిళా కమిటీలు : మహిళా గ్రూపులను ఏర్పరచి, వారికి తక్కువ వడ్డీ రుణాలిచ్చి చిరు, గృహ వ్యపారాలు చేసేలా వారిని ప్రోత్సహించి మహిళా సాధికారత సాధించేందుకు "జన్మభూమి" పథకంలో భాగంగా ఏర్పాటైన ఈ డ్వాక్రా సంఘాలు ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతూండడం విశేషం.
6) చదువుల పండుగ : మధ్యలో బడి మానేసిన పిల్లలను, బాల కార్మికులను, వారి తల్లిదండ్రులకు "చదువు" విలువ పై అవగాహన కల్పించి వారు తిరిగి బడిలో చేరేలా చేసి, తద్వారా అక్షరాస్యత ను పెంచడానికి ఉద్దేశించబడిన పథకం. ఇది 2002 లో ఉద్యమ ప్రాతిపదికన అమలు అయ్యింది.
7) రైతు బజార్లు : మధ్యవర్తులెవరూ లేకుండా రైతులే నేరుగా ప్రజలకు తాము పండించిన పళ్లు, కూరగాయలు అమ్ముకునేందుకు ఏర్పరచబడిన వేదికే "రైతు బజార్లు". 1999లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంచే ప్రవేశపెట్టబడిన ఈ బజార్ల ద్వారా రైతుల ఆదాయం గణనీయంగా పెరగడమే కాకుండా, స్థిరమైన తక్షణ ఆదాయం వారికి లభిస్తోంది. రైతులు, బజార్ ఎస్టేట్ మేనేజర్ కలసి నిర్ణయించే ధరల వల్ల ఇటు రైతులు, అటు కొనుగోలుదారులు ఇరువురుకి ఎంతో మేలు కలుగుతోంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ రైతుబజార్లు రైతు సంక్షేమ చరిత్రలో ఒక విప్లవంగా చెప్పొచ్చు.
8) ఇ-సేవా కేంద్రాలు : టెక్నాలజీ అభివృద్ధి చెందాక, ఇంటర్నెట్ ని ఉపయోగించి ఇ-సేవా అంటే ఎలక్ట్రానిక్ సేవా కేంద్రాలను ప్రారంభించింది 1999 లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ప్రభుత్వ పథకాల కోసం, , కరెంట్ బిల్స్, ట్యాక్స్ పేమెంట్స్, రేషన్ కార్డ్ , పాస్ పోర్ట్ వంటి ప్రభుత్వ సేవలు పొందడానికి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఆన్ లైన్ లో ఇ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, నేరుగా ఇంటికే వచ్చేలా సౌకర్యం కలిగింది. దీనివల్ల అటు ప్రభుత్వ, ఇటు ప్రజల విలువైన సమయం మిగలడమే కాకుండా లంచాలు తగ్గి పరిపాలనలో పారదర్శకత పెరిగి, ప్రభుత్వానికి "అకౌంటబిలిటీ" వచ్చింది. అప్పట్నుంచీ ఇవి అప్-గ్రేడ్ అవుతూ నేటికీ నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
9) నీరు-మీరు: జల సంరక్షణకై, ఇంకిపోతున్న భృగర్భ జలాలను పెంపొందించడానికి 2000వ సంవత్సరంలో ఈ పథకం ప్రవేశ పెట్టబడింది. భూగర్భ జలాలు పెరగడానికి, వాన నీటిని ఒడిసి పట్టడానికి ప్రతి కట్టడానికి "ఇంకుడు గుంతలు" త్రవ్వడాన్ని తప్పనిసరి చేసారు. అలాగే నదుల అనుసంధానానికి తద్వారా నీటి సమర్థ వినియోగానికి ప్రణాళిక రూపొందింది. మళ్లీ గత ఐదేళ్లలో ఈ పథకం మొదలయ్యి కొనసాగుతోంది. కృష్ణా-గోదావరి అనుసంధానం జరిగింది. అలాగే కొన్నివేల ఇంకుడు గుంతలు రాష్ట్ర వ్యాప్తంగా త్రవ్వించారు.
10) ఆడపిల్లలకు సైకిల్స్ పంపిణీ : ఆడ పిల్లలను బడికి పంపడానికి కష్టపడే ఆ రోజుల్లో వారు ఇబ్బందులు పడకుండా బడికి వెళ్లి చదువుకోవడానికి వీలుగా వారికి ఉచితంగా "సైకిల్స్" పంపిణీ చేసి ప్రోత్సహించే కార్యక్రమాన్ని అప్పుడు 1999-2003 సంవత్సరాలలో, మళ్లీ ఇప్పుడు 2017 నుండి జరుగుతోంది. దీని వల్ల ఆడపిల్లలు సౌకర్యవంతంగా స్కూల్ కి వెళ్లగలుగుతున్నారు.
ఇంకా CM EMPOWERING YOUTH, ఆదరణ పథకం క్రింద వృత్తి నిపుణులకు పనిముట్ల పంపిణీ వంటి ఎన్నో గొప్ప సామాజిక వికాస పథకాలు ఆంధ్రలో అమలు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పరిపాలన విధానం లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసి, పరిపాలనలో పారదర్శకతను, ప్రభుత్వానికి జవాబుదారీతనాన్ని తీసుకువచ్చి, ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేసి, రాష్ట్రంలో సుపరిపాలనను స్థిరీకరించిన పైపథకాలు మొదలయిన కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం...
ఈ పథకాలన్నీ ఒకే నాయకుడు, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆధ్వర్యంలో జరగడం, యాధృచ్ఛికం కాదు. అతని దార్శనికతకు, నిదర్శనం...... అప్పటి విజన్-2020 కి దురదృష్టవశాత్తూ అంతరాయం కలిగినా, ఇప్పుడు విజన్-2029 ని కొనసాగించుకొని, మన సమగ్రాభివృద్ధికి మనమే వోటు ద్వారా దోహదపడాలి.....