BREAKING NEWS

క్వారంటైన్ సమయంలో ఆరోగ్యాన్ని పెంచే పానీయాలు

చక్కగా మన ఆరోగ్యాన్ని, శక్తిని కాళీగా ఇప్పుడే ఉన్నారు కాబట్టి ఈ సమయంలో ఇమ్యూనిటీ పవర్ ని మరెంత గానో పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వాటిని ఎలా చేసుకోవాలి అంటే పూర్తిగా చదివేయండి....

బనానా వాల్ నెట్ మిల్క్ షేక్:

ఈ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్ధాలు:

 
  • తొక్క తీసిన అరటి పండు ముక్కలు ఒక కప్ప
  • 1 కప్పు పాలు
  • రెండు చెంచాల తురిమిన వాల్ నట్స్
  • ఐస్ ముక్కలు 4
  • తేనె

తయారు చేసుకునే విధానం: అరటిపండు ముక్కలాగా కోసుకోవాలి. అలానే వాల్ నట్స్ కూడా సన్నగా తరగాలి. ఆ తరువాత రెండిటిని కూడా Tupperware Quick shake చెయ్యాలి. ఆ తర్వాత పాలు, తేనె కూడా వీసీ మళ్ళీ కలిపి సర్వ్ చేసుకోవడమే.

టిప్స్: నరాలు, కండరాలు, రోగనిరోధక శక్తి మరియు మెదడు దెబ్బ తినకుండా ఉండటానికి మరియు రికవరీని పెంచడానికి పూర్తిగా ఇది సహాయ పడుతుంది.

2 . గ్రీన్ స్మూతీ

కావాల్సిన పదార్ధాలు:

1 కప్పు సోయ్ మిల్క్ లేదా ఆల్మండ్ మిల్క్
1 కప్పు పాలకూర ఆకులు
1 అరటిపండు
1  స్పూను పీనట్ బటర్


తయారీ విధానం: ముందు పాలకూర ఆకులని, అరటి పండు, పీనట్ బటర్ ని తురుము కోవాలి. ఆ తర్వాత ఐస్ ముక్కలని, సోయ్ మిల్క్ లేదా ఆల్మండ్ మిల్క్ అందులో వేసి బాగా షేక్ చెయ్యాలి. ఆ తరవాత సర్వ్ చేసుకోవడమే.

కహ్వా టీ:

కావాల్సిన పదార్ధాలు: 

2 కప్పుల నీళ్లు
1  స్పూను టీ ఆకులు
2 స్పూన్స్ పంచదార
4  యాలుకలు
1 దాల్చిన చెక్క 
4 రెమ్మల కుంకుమ పువ్వు


తయారీ విధానం: 

ముందు నీళ్ళని బాగా మరిగించాలి. ఆ తర్వాత అందులో టీ ఆకులు మరియు పంచదార వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దానిని హాట్ ఫ్లాస్క్ లోకి తీసుకోవాలి. అందులో యాలుకలు, దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు వేసుకుని సర్వ్ చేసుకోవడమే.