BREAKING NEWS

వేసవికాలంలో ఇక రొటీన్ ఫుడ్ కి చెక్

సహజంగా వేసవిలో ఎండలు బాగా మండిపోతాయి ఎక్కడ చూసినా తీవ్ర గాలులు, వడగాల్పులు ఇలా ఎన్నో చూస్తూ ఉంటాము. అయితే రొటీన్ ఫుడ్ తో సాగుతూ ఉంటే సమ్మర్ కి పిట్టల్లా రాలి పోవడం కాయం. కాబట్టి రొటీన్ ఫుడ్ కి ఇంక చెక్ చెప్పి కొత్త ఫుడ్ అంటే సమ్మర్ కి ఉపయోగపడే ఫుడ్ ని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యవంతంగా ఉంటాము. అయితే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల నిజంగా ఆరోగ్యంగా ఉంటాం?  సమ్మర్ ఎండల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?  ఏ ఫుడ్ తినడం వల్ల సమ్మర్ ఎండల నుండి తప్పించుకోవడం సులభం ? మరెందుకు ఆలస్యం చూసేయండి......

ఎండల నుండి తట్టుకోవాలంటే మంచినీళ్లు మొదలైన చల్లని జ్యూసులు ఇలా ఎన్నో తీసుకుంటాం. కానీ అన్నీ మంచివి కావని అంటున్నారు నిపుణులు. కొన్ని కొన్ని సార్లు మనం కూల్డ్రింక్స్ , వివిధ రకాల జ్యూస్లు తాగుతాం. ఇలా బయట త్రాగే ఈ ప్యాక్ ల  ద్వారా మనకి నిజంగా దాహం తీరుతుంది, దానిలో మనకి ఎంత మాత్రం  ఆరోగ్యం ఉండదు. ఎందుకంటే వాటిలో కెఫిన్ వంటి మొదలైన పదార్థాలు ఉంటాయి. కాబట్టి కొన్ని కొన్ని సార్లు అవి దాహం తీర్చుతాయి. కానీ ఆరోగ్యానికి ఎంత మాత్రము మంచిది కాదు.  శీతల పానీయాలలో నిల్వ పదార్ధాలని  వాడుతారు. కానీ ఇలాంటి పదార్ధాలు తీసుకోవడం వల్ల ఎముక సంబంధ సమస్యలు కిడ్నీ సమస్యలు దంతాల సమస్యలు ఇలా వివిధ సమస్యలు ఎదురవుతాయి. 

మరీ చల్లగా ఉన్న డ్రింకులు మనం తీసుకుంటాం. అయితే ఇవి తాత్కాలికంగా మాత్రమే చల్లని భావన కలిగిస్తాయి. కానీ ఒంట్లో నిజంగా ఆ వేడి మాత్రం అస్సలు తగ్గదు.

అయితే మన ఒంట్లో నిజంగా వేడి తగ్గాలంటే ఏం తీసుకోవాలి? నిజంగా ఏం తీసుకోవాలంటే ? పాలకూర,  ముల్లంగి , ఉల్లి, వెల్లుల్లి,  బీట్రూట్, అనాస, మామిడి ఇలాంటి ఆహారం తీసుకోవచ్చు.  వీటివల్ల శరీరంలో వేగంగా వేడి తగ్గుతుంది అలానే తాజా పండ్లను కూడా తినవచ్చు.

అంతే కాకుండా సబ్జా గింజలు నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల వేడి ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది దీనివల్ల శరీరంలో చల్లగా మాత్రమే కాక  ఆరోగ్యంగా కూడా ఉంటారు. అలానే మన చెమట ద్వారా మనం ఎన్నో లవణాలను కోల్పోతూ ఉంటాము. ఈ లవణాలు తిరిగి పొందాలంటే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి తరచుగా తీసుకోవాలి. మసాలా సామాన్లు అలానే స్పైసి స్పైసి ఫుడ్ కి బేకరీ ఫుడ్ కి బాగా టెంప్ట్ అయిపోయి ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. వీటిల్లో ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు కూడా ఉంటాయి సమోసా బజ్జీలు ఇలా ఎన్నో రకాల ఫుడ్డు తీసుకుంటారు. కాబట్టి సమ్మర్లో ఇలాంటి ఫుడ్ అని ఎంతలా విడిచి పెడితే  అంత మంచిది.

 వడ దెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి?

 
1. ఎండలు మండిపోతాయి. ఉదయం పది దాటింది అంటే బయటకు వెళ్లలేని దుస్థితి. జనాల్ని నిజంగా ఈ ఎండలు చాల బాధ పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు బయటకు  వెళ్లడం మంచిది కాదు. ఒక వేళ పని ఉండి వెళ్లిన  గొడుగు లేదా టోపీ ధరించాలి.
 
2. నల్ల రంగు దుస్తులు వేసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. లైట్ కలర్స్ ఉన్న బట్టలు వేసుకుని స్కార్ఫ్ వంటివి చుట్టుకుని వెళ్లడం మంచిది.
 
3. షోడా, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం వంటివి తీసుకోవడం మంచిది.

ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1.వేసవిలో పెరుగు వాడటం చాలా మంచిది అది చల్లదనాన్ని కలిగిస్తుంది అంతే కాక పౌష్టికాహారంగా కూడా పనిచేస్తుంది.

2. సమ్మర్లో సబ్బుకు బదులు సున్నిపిండి వాడితే శ్రేయస్కరం. దీని వల్ల బ్లాక్ స్పాట్ లాంటివి తొలగిపోతాయి.

3  తరచుగా కొబ్బరినీళ్ళు , పళ్ళరసాలు తీసుకోవడం మంచిది.

4.  అలానే మాయిశ్చరైజర్ వాడుతూ చర్మం కమిలిపోకుండా మృదుత్వం కోల్పోకుండా ముందు జాగ్రత్తగా దానిని రాసుకోవడం మంచిది

5. అంతేకాకుండా సమ్మర్లో ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసుల నీటిని తాగాలి.

6. స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు వేస్తే చెమట వాసన రాకుండా ఉంటుంది.

7. ఎండ వేడికి జుట్టు చిట్లిపోతుంది కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు దానిని స్కార్ఫ్ లేదా టోపీ పెట్టుకుని కాపాడు కోవడం మంచిది.

వేసవిలో పిల్లలకి ఎలా రక్షణ కల్పించాలి:

వేసవి కాలంలో పిల్లలు విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. వారి శరీర ఉష్ణోగ్రత పెరగడం వలన వచ్చే అలసట విసుగు ఉండొచ్చని మనం అర్థం చేసుకోవాలి. చల్ల గాలి తగిలేలా చూడాలి లేదంటే శరీరం వేడెక్కి విపరీతంగా ఏడ్చేస్తారు. అలానే వట్టి వేళ్ళు తడికలు తడిపి కిటికీలకు కడితే చల్లని గాలి తగులుతుంది దీనివల్ల పిల్లలు ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది. బాగా చిన్న పిల్లలు ఉంటే పరుపుల మీద పడుకో పెట్టకుండా తడిబట్ట వేసి దానిమీద పడుకోబెట్టాలి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి ఇలా జాగ్రత్తలు తీసుకుని సమ్మర్లో వేడిగాలులు కి జబ్బులకి దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఉత్తమం.

Photo Gallery