BREAKING NEWS

లాక్ డౌన్ సమయంలో హ్యాపీగా టైంపాస్ అవ్వడానికి ఇవి చేస్తే చాలు


లాక్ డౌన్ వల్ల ప్రతీ ఒక్కరు ఇళ్ల ల్లోనే ఉండవలసిన పరిస్థితి. అయితే ఈ లాక్ డౌన్ లో కొన్ని వాటితో నిమగ్నం అయితే అసలు సమయం కూడా మరచి పోవచ్చు. అలాంటివి ఏవి? అని ఆలోచిస్తున్నారా? మరెందుకు ఆలస్యం చూసేయండి...

సినిమాలని చూడడం:

సినిమాలు ప్రతీ ఒక్కరికి మంచి ఎంటర్టైన్మెంట్ ని ఇస్తాయి.ఎవరికీ నచ్చిన అంశాలు బట్టి వాళ్ళు నచ్చిన సినిమాలు చూడడం వల్ల అసలు సమయమే తెలియదు. కాబట్టి సినిమాలని చూసి హ్యాపీగా టైం స్పెండ్ చెయ్యవచ్చు. టీవీ లో కూడా అనేక సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇవి మాత్రమే కాక ఎన్నో ఎవరు గ్రీన్ పాత సినిమాలు కూడా ఉన్నాయి. మాయ బజార్, భక్త కన్నప్ప, గుండమ్మ కదా ఇలా ఎన్నో పాత సినిమాలు ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి అలాంటి సినిమాలు కూడా మంచి టైం పాస్ ఇస్తాయి. ఎప్పటికప్పుడు అమెజాన్ ప్రైమ్ వంటి వాటిలో కూడా కొత్త సినిమాలని మనం చూసుకోవచ్చు. కాబట్టి సినిమాలు సరదాగా ఉంటాయి. అలానే సినిమాలు మంచి కాలక్షేపం కూడా. 

వెబ్ సిరీస్:

అనేక ఆసక్తికరమైన వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. వాటి వల్ల బాగా కాలక్షేపం అవుతుంది. నెక్స్ట్ ఏంటి అనే ఆనందం, ఆశ్చర్యం కూడా ఉంటుంది.  చాల ఆసక్తికరం అయిన వెబ్ సిరీస్ ఎన్నో ఉన్నాయి. చక్కగా వాటితో కాలం గడిపితే సమయమే తెలియకుండా ఉంటుంది. ఆలస్యం ఎందుకు నేడే మంచి వెబ్ సిరీస్ ని చూడడం మొదలు పెట్టేయండి.

నవలలు వ్రాయడం:

చాలా మందికి వ్రాసే కళ ఉంటుంది. కలం పట్టి వ్రాస్తే ఆపడం ఉండదు. అంత గొప్ప ఆర్ట్ ఉన్నవాళ్లు లేదా ఎప్పుడు కలం పట్టని వాళ్ళు అయినా సరే ఒక చిన్న కధ లేదా ఎదో ఒకటి వ్రాస్తూ ఆలా వ్రాసే అలవాటుని మరెంత గానో పెంచుకోవడం ఉత్తమం. కాబట్టి వీటిని వ్రాయడం అలవాటు చేసుకుని లాక్ డౌన్ సమయం లో దినచర్య గా మార్చుకుంటూ వ్రాసేయండి. మంచి నవలలు, కధలు  వ్రాయడం సులువు అవుతుంది. దీని వల్ల సమయం కూడా తెలియదు.

డ్రాయింగ్ లేదా పెయింటింగ్స్ వెయ్యడం:

ఎంతో మంది బ్రష్ పట్టి రంగులు వేశారంటే అది ఒక గొప్ప చిత్రంగా మారిపోతుంది. చాలా మందికి సహజంగా ఈ కళ ఉంటుంది. ఏదైనా ఒక చిత్రాన్ని తీసుకుని దానిని వేయడం మొదలు పెట్టాలి. ఇలా నచ్చిన వాటిని మరెంత అద్భుతంగా రూపొందించడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల సమయం తెలియనే తెలీదు. కాబట్టి ఏ వయసు వారైనా సరే ఈ పని చెయ్యవచ్చు. ఇలా చెయ్యడం వల్ల సమయం మరిచి ఆసక్తి పెరిగి చక్కటి స్కిల్  చెంత చేరుతుంది.

ఫిట్నెస్ ఛాలెంజ్:

చాలా మంది రొటీన్ డేస్ లో ఫిట్నెస్ కి టైం కేటాయించడం కుదరలేదు అని బాధ పడుతూ ఉంటారు. కానీ నిజంగా ఫిట్నెస్ ఫ్రీక్స్ అందరికి కూడా ఇదే మంచి అవకాశం. చక్కగా ఫిట్నెస్ గా ఉంటూ వివిధ రకాల వ్యాయమ పద్ధతులు లేదా మంచి ఆసనాలు ప్రయత్నం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల బాగా ఫిట్ గా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఫిట్ నెస్ గా ఉండడానికి మీకు మీరే డైలీ ఛాలెంజ్ పెట్టుకుని ఫిట్ గా ఉండడం. ఇలా చెయ్యడం వల్ల కేవలం సమయంతో పాటు బాగా ఫిట్ గా కూడా ఉండవచ్చు. 

కొత్తగా, ఆరోగ్యంగా వంటలు చేసుకోవచ్చు:

ఈ లాక్ డౌన్ వల్ల బయట ఫుడ్స్ అందుబాటులో లేవు. కాబట్టి నోరు కట్టేసుకోకుండా ఇళ్లల్లోనే అనేక రకాల ఆహార పదార్దాలని చేసుకుని తినవచ్చు. అయితే చక్కగా పని పూరి, పిజ్జా, సలాడ్స్, బిరియాని, ఫ్రైడ్  రైస్, మంచూరియ వంటి ఆహార పదార్ధాలు. అలానే కేక్స్, కుక్కీస్, కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్, బాదం మిల్క్ ఇలా ఏ రకమైన కూడా ఇళ్లల్లోనే చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జొన్నలు,రాగులు వంటి వాటితో కూడా చక్కటి రెసిపీస్ ని తయారు చేసుకుని తినవచ్చు. కాబట్టి కొత్త వంటలు, ఆరోగ్యకరమైన వంటలు చేసి సమయం తో సాగిపోతే బోర్ కూడా కొట్టదు.

వివిధ రకాల ఆటలని ఆడవచ్చు:

చాలా కాలం నుండి టైం దొరకక ఆటలకి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అయితే ఆలోచించకండి ఇదే మంచి సమయం. ఈ సమయం లోనే చక్కగా కేరమ్స్, చెస్, లూడో, చైనీస్ చెక్కర్స్, వైకుంఠపాళి ఇలా ఎన్నో రకాల ఆటలు ఉంటాయి. కాబట్టి వీటితో సరదాగా కుటుంబం అంత కలిసి ఆడుకుంటే ఎంతో బాగుంటుంది. అసలు సమయం కూడా గుర్తు రాదు. మరెందుకు ఆలస్యం లాక్ డౌన్ లో వీటితో నిమగ్నం అయిపోండి.......అసలు సమయం తెలియని ప్రపంచం లోకి వెళ్లిపోండి. 

ఇలా వీటితో సాగిపోతే సమయం ఎవరికీ గుర్తురాదు. మరేం ట్రై చేసేయండి....