BREAKING NEWS

సురేంద్రపురి గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!

మీరు ఏమైనా మంచి ప్రదేశానికి వెళ్లాలి అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పకుండా సురేంద్రపురి గురించి చూడాల్సిందే..! ఇక్కడ సురేంద్రపురి గురించి అనేక విషయాలు పొందపరిచయము. అలాగే ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు వాటిని ఇప్పుడే చూసేయండి.
 
నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట కు సమీపం లో సురేంద్రపురి ఇది ఉంది. నిజంగా ఇక్కడ చెప్పుకోదగ్గ ఆలయాలు చాలా ఉన్నాయి. సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం క్షేత్రం హైదరాబాద్ కి  60 కిలో మీటర్ల దూరం లో ఉంది. అయితే నగర శివారు లో ఉన్న సురేంద్రపురి ఒక అద్భుతమైన మ్యూజియం అని చెప్పవచ్చు.
 
సురేంద్రపురి విశిష్టత: 
 
పురాణ ప్రాముఖ్యం గల ఆలయాల నమూనాలను చక్కగా శిల్పాలుగా మలిచి ఉంటాయి. ఇది నిజంగా భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఇక్కడ బ్రహ్మ లోకం, విష్ణువు లోకము, కైలాసం, స్వర్గ లోకం, నరక లోకం, పద్మ దీపం ఇలా ఎన్నో వాటిని దృశ్య రూపం లో మలిచారు. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంటే నమ్మండి. అయితే ఇక్కడున్న రూపాలని మనం వెళ్లి చూడచ్చు..!
 
మందర పర్వత సాయం తో క్షీరసాగరమధనం నిజంగా ఇది నిజం లాగ ఉంటుంది. మందర పర్వత సాయంతో క్షీరసాగరమధనం చేస్తున్న దేవతలను రాక్షసులను కూర్మావతారం లో ఉన్న విష్ణుమూర్తి ఇక్కడ మనం చూడొచ్చు. దీనితో పాటుగా మనకిక్కడ గజేంద్ర మోక్షం సన్నివేశాలను కూడా ఉన్నాయి. నిజంగా ఇవన్నీ కనువిందు చేస్తాయి.
 
 పద్మ రూపం:
 
ఇక్కడ పద్మ రూపం లో అనేక దేవతా రూపాలు మనం చూడవచ్చు. దీనితో పాటుగా మహాభారతం భాగవతం వంటి పురాణ ఇతిహాసాల లో ఉన్న అనేక దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. 
 
హనుమంతుడు:
 
భవిష్యత్ బ్రహ్మ అయినా హనుమాన్ సన్నివేశాలను, అతడు రాముని తో చేరిన పిదప జరిగిన సన్నివేశాలను కూడా మనం చూడవచ్చు.  రామ లక్ష్మణులు భుజం మీద ఎత్తుకుని యుద్ధ భూమి లో వారికి సహకరించడం ఇలా ఎన్నో దృశ్యాలు బాగుంటాయి.
 
 పంచముఖ శివుడు:
 
 అలానే ఇక్కడ పంచముఖ శివుడు కూడా ఉన్నారు. పంచముఖ శివుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఆన్జనేయుని వెనక నుంచి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయ ముఖద్వారం త్రిమూర్తుల తో ఎంతో వైభవంగా ఉంటుంది. అలానే నవగ్రహాలకు సతీసమేతంగా ఉండడం.  అలాగే వెంకటేశ్వర స్వామి, అమ్మవారి వాహనం సింహం నోటి నుండి లోపలికి వెళ్లడం ఇలా అనేక దృశ్యాలు ఇట్టే ఆకర్షిస్తాయి.
 
 కొండపైన స్వామి వారి పుష్కరిణి:
 
ఇక్కడ కొండల పై స్వామి వారి పుష్కరిణి ఉంది. దానిని దర్శించుకుంటే సకల కష్టాలు రోగాలు మాయం అయిపోతాయి అని భక్తుల నమ్మకం. గోదా దేవి మందిరం కూడా ఇక్కడ ఉంది ఆలయ ఆవరణలో గల అద్దాల మండపం కొండ పైన ఉన్న శివాలయం కూడా తప్పక చూడాల్సిన ప్రదేశాలు.
  
ఆలయాన్ని నిర్మించడం:
 
 ఈ ప్రముఖ ఆలయాన్ని నిర్మించేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు ఈ ఆలయాల పైన ఉండే శిల్పకళలు నిర్మాణశైలి ఇలా ప్రతి ఒక్క విషయం కూడా చెప్పుకోదగ్గవి. వీటిని జాగ్రత్తగా నిర్మించారు. హిందువుల దేవుళ్ళని, దేవతలని వర్ణించే శిలా విగ్రహాలు, చిత్రలేఖనాలు ఈ మ్యూజియం లో మనం చూడొచ్చు. నిజంగా దీనిని  కట్టడం సులభం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఇంత ప్రయత్నం మనం చూడలేము. సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం అక్కడ ఉన్న ముఖద్వారం సూర్యదేవుడు ఇలా అనేక వాటిని కూడా సందర్శించవచ్చు.
  
సురేంద్రపురి తప్పక చూడవలసిన ప్రదేశం:
 
ఈ తరహా మ్యూజియంలు  మనకు ఎక్కడా కనబడవు. పైగా ఇవి ఎన్నో కొత్త విషయాలుని  నేర్పిస్తుంది. చిన్న పిల్లలకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. పైగా ఇతిహాసాలు మీద కూడా ఇది పిల్లలకు నేర్పించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ వున్నా ఈ ఆలయం ఎంతో కష్టపడితే వచ్చింది  మనం చెప్పవచ్చు.
 
 సురేంద్రపురి ఎలా వెళ్లాలి...?

 
 ఇది హైదరాబాద్ కి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాయగిరి రైల్వే స్టేషన్ ఇక్కడికి చాలా దగ్గర లో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండ నుంచి చాలా బస్సులు కూడా ఉన్నాయి. అలానే యాదాద్రికి వచ్చే బస్సులను కూడా సురేంద్రపురి మీద నుండి వస్తాయి.
 
ఇక్కడ ప్రధాన ఆకర్షణ:
 
 యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్య లో 36 అడుగుల కృష్ణుడి విశ్వరూప దర్శనం ఇక్కడ చూడదగ్గది. నిజంగా ఇది కనువిందు చేస్తుంది. అలానే గోవర్ధనోద్ధరణ, గోపికావస్త్రాపహరణం, రాసలీల దృశ్యాలను కూడా చూపించడం జరిగింది. అలానే కైలాసం, స్వర్గలోకం, నరకలోకం పద్మ లోకం ఇలా అనేక దృశ్యాలు బాగా ఆకట్టుకుంటాయి. పంచముఖ శివుడు కూడా మనం చెప్పుకున్నట్లుగా ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.
 
ఇంత గొప్ప ప్రదేశం ని  తప్పకుండా అందరూ చూడాలి. దూర ప్రాంతాల నుంచి కూడా దీనిని చూడడానికి వస్తూ ఉంటారు. పైగా ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. అవకాశం ఉంటే తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శించండి.  దగ్గర వున్నా వాళ్ళు సెలవు ఉన్న రోజుల్లో వెళ్ళిపోవచ్చు. పైగా దీన్ని చూడటం ఎంతో బాగుంటుంది ఎంతో సరదాగా మీరు ఈ ప్రదేశాలు అన్నిటిని చూడొచ్చు.