BREAKING NEWS

కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి...!

సాధారణంగా ఈ రోజుల్లో అనేక ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. ఏది ఏమైనా ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలంటే పోషక విలువలు ఔషధ గుణాలు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు తీసుకోవడం మంచిది. వాటి తో పాటుగా పండ్లు, కూరగాయలు, విటమిన్స్, ప్రోటీన్స్ అందించే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. అలానే వీటి వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.
 
కిడ్నీ సమస్యల్ని దూరం చేయాలన్న, రాకుండా జాగ్రత్త పడాలి అన్న వీటిని మీ డైట్ లో తీసుకోండి. వీటి వల్ల మీకు మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. మరి ఆలస్యమెందుకు దీని కోసం పూర్తిగా చూడండి. దీని వల్ల మీకు మంచి బెనిఫిట్స్ కలుగుతాయి ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం.
 
 తులసి ఆకులు:
 
మనం తులసి మొక్కను ఇంట్లో పూజిస్తూ ఉంటాము. అయితే దీనిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేద వైద్యం లో తులసిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు కూడా తులసి తో నయం చేసుకోవచ్చు. ఈ ఆకుల శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. కిడ్నీల కి కూడా ఇది చాలా మంచిది. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళు తులసిని తప్పనిసరిగా తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది.
 
గోంగూర:
 
 గోంగూర లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా గోంగూర లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అదే విధంగా  రక్త ప్రసరణ మెరుగు పరచడం తో పాటు బ్లడ్ లో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. కిడ్నీల కి కూడా ఇది చాలా మంచిది. కనుక మీ డైట్ లో దీనిని కూడా తీసుకోండి.
 
 పాలకూర:

 
సాధారణంగా మనం పాలకూర తో వివిధ రకాల వంటలు చేస్తూ ఉంటాం. పాలకూర పప్పు, పాలక్ పన్నీరు ఇలా చాలా రకాలు చేసుకుంటాం. నిత్యం మనం ఉపయోగించే పాలకూర లో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. దాని తో పాటుగా క్యాల్షియం, నైట్రేట్, విటమిన్ ఏ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సంబంధిత సమస్యలు, మూత్రనాళం సమస్య తో సతమతమయ్యే వారికి పాలకూర మంచి ఆహారం అని చెప్పొచ్చు. అదే విధంగా పాలకూర లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కొవ్వు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. కంటి సంబంధిత సమస్యలకి. ఎముకల వ్యాధి తో బాధపడే వాళ్లకి కూడా ఇది ఎంతో మేలు కలుగుతుంది.
 
మెంతి కూర:
 
 మెంతి కూర లో ఫాలిక్ యాసిడ్, జింక్ పుష్కలంగా ఉంటాయి. మెంతికూర లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. జుట్టు ఒత్తుగా పెరగాలంటే మెంతి కూర తింటే మంచిది కిడ్నీ వ్యాధులు కూడా ఇది చిటికె లో తరిమికొడుతుంది.
 
 పుదీనా:
 
 పుదీనా వంటకి మంచి రుచి, ఫ్లేవర్ ఇస్తుంది. నోటి దుర్వాసన కి, పొడి దగ్గు, జలుబు సమస్యలకు ఇది బాగా ఉపయోగ పడుతుంది. పుదీనా లో విటమిన్ సి విటమిన్ డి క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇది కిడ్నీ సమస్యలకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
 
బచ్చలి కూర:
 
బచ్చలి కూర తో కూడా మనం అనేక వంటలు చేసుకోవచ్చు. బచ్చలి కూర లో క్యాల్షియం, ఐరన్, సోడియం, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. హై బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. శరీరం లో రక్తహీనతను తగ్గిస్తుంది. కాబట్టి బచ్చలి కూర తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా కిడ్నీలకు కూడా ఇది చాలా మంచిది గమనించండి.
 
తోటకూర:
 
తోటకూర తో కూడా మనం అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. తోటకూర పప్పు, తోటకూర కూర ఇలా ఏదైనా చేసుకోవచ్చు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ కె, విటమిన్ బి 6, విటమిన్ సి తో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యల తో పాటు కిడ్నీ సమస్యలు కూడా ఇది తరిమికొడుతుంది. కాబట్టి మీరు కిడ్నీ సమస్యలు తరిమి కొట్టాలంటే తోటకూరని కూడా తీసుకోవచ్చు.
 
 తమలపాకు:
 
తమలపాకులు కూడా మనం తీసుకోవచ్చు. దీనిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా తమలపాకులలో ఎక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు కూడా ఇది మేలు చేస్తుంది కిడ్నీ సమస్యలకు కూడా తమలపాకు ఎంతో మంచి పదార్థం అని చెప్పొచ్చు.
 
ఆవల ఆకులు:
 
ఇవి కాస్త ఘాటుగా ఉన్న దీని వల్ల కలిగే లాభాలు చాలా ఉంటాయి. చర్మ వ్యాధుల తో బాధ పడే వాళ్ళకి ఇది ఎంతో మేలు కలుగుతుంది. అలాగే కంటి సంబంధిత సమస్యలను కూడా ఇవి చిటికెలో పోగొట్టడానికి ఉపయోగపడతాయి. కిడ్నీలకు కూడా చాలా మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని కూడా ఇది బాగా పెంచుతుంది.