BREAKING NEWS

పాజిటివ్ గా ఉండాలంటే ఈ మహమ్మారి సమయంలో ఇవి పాటించండి..!

కరోనా నిజంగా అందరిని ఇబ్బందుల్లోకి పెట్టేస్తోంది. రోజు రోజుకీ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. నిజంగా ఇది కష్టమైన సమయం అనే చెప్పాలి. ఇమ్యూనిటీ పెంచుకోవడం వంటివి చేస్తూ మానసికంగా కూడా మీరు కృంగిపోకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది. వీలైనంత పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోవడం మంచిది.
 
 తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారి సమయం లో ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు అనవసరంగా బయటికి వెళ్లడం లాంటివి చేయొద్దు. సోషల్ డిస్టెన్స్ పాటించడం మాస్క్ ధరించడం తప్పక పాటించాలి. వీలైనన్ని సార్లు సబ్బు తో లేదా హ్యాండ్ వాష్ తో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం మంచిది.
 
ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా గర్భిణీలు కూడా జాగ్రత్తలు పాటించాలి. కొద్ది రోజులపాటు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. కానీ ఈ మహమ్మారి సమయం లో మానసిక ఒత్తిడి బాగా ఎక్కువై పోయింది ఒంటరిగా ఉండడం వలన మానసిక సమస్యలు కూడా పెరిగి పోతున్నాయి. ఎంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి చాలా కామన్ గా ఉంటున్నాయి.
 
 ఇటువంటి సమయం లో వీలైనంత హాయిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నెగిటివ్ ఆలోచనలు మానుకోవడం చాలా ముఖ్యం. కోవిడ్ 19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మంది వీటికి గురవుతున్నారు. ముఖ్యంగా సోషల్ ఇంటరాక్షన్ లేక పోవడం వల్ల చాలా ఇబ్బందుల్లో పడిపోతున్నారు.
 
ఈ కరోనా మహమ్మారి సమయం లో ఎంగ్జైటీ, ఒత్తిడి ఇలాంటివి చాలా మందిలో కనబడుతున్నాయి. డిప్రెషన్ ని కూడా ఈ మహమ్మారి పెంచేసింది. ఎవరికి వాళ్లు హోమ్ సొల్యూషన్ లో ఉండటం కారణంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి.
 
కాబట్టి ప్రతి ఒక్కరు దీని నుంచి బయట పడడానికి ప్రయత్నం చేయాలి. అంతే కాని పదే పదే ఒంటరితనం కి గురై ఇంటరేక్షన్స్ లేకుండా ఉండటం మంచిది కాదు. అంతా బాగుంటుందిలే అందరూ బాగుండాలి అని పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి. వీలైనంత జాగ్రత్తలు తీసుకుని ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి చూసుకోవాలి. ఇటువంటి మహమ్మారి సమయం లో ఒత్తిడి మరియు యాంగ్జైటీని తగ్గించుకోవడానికి ఈ విధంగా చేయండి.
 
ఇతరులతో కనెక్ట్ అయ్యి ఉండండి:

 
 ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒకరి తో ఒకరు మాట్లాడుకుని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని మరొకరి తో పంచుకోవడం వల్ల సమస్య నుంచి దూరం అవడానికి బాగుంటుంది. ఇది కరోనా సమయం కాబట్టి ఒకరి దగ్గరికి మనం వెళ్లలేము. కనుక ఫోన్ లోనే ఒకరినొకరు సంప్రదించి ఈ సమస్యని పరిష్కారం చూపించడం మంచిది. లేదా మీరు ఇంటర్నెట్ సహాయం తో వీడియో కాల్స్ లాంటివి చేసుకుని కూడా మాట్లాడుకోవచ్చు.
 
మీకు నచ్చిన వాళ్ళ తో మీకు మంచి మోటివేషన్ ఇచ్చే వాళ్ళ తో మాట్లాడడం వల్ల సమస్యను సులువుగా చేసుకోవచ్చు. దీంతో మీ ఒత్తిడి కూడా తగ్గుతుంది కాబట్టి మీరు ఓపెన్ అయ్యి మీ స్నేహితులతో లేదా మీకు మంచి మోటివేషన్ ఇచ్చే వాళ్ళ తో మీ బాధలు మీ సమస్యలన్నీ మీ ఇబ్బందుల్ని షేర్ చేసుకోండి. దీనివల్ల మీకు పూర్తిగా ఒత్తిడి తగ్గి మీరు ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
 
 మెడిటేషన్ లాంటివి చేయండి:
 
 మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి మెడిటేషన్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ధ్యానం చేయడం వల్ల మజిల్స్ రిలాక్స్ అవుతాయి మరియు శ్వాసని గట్టిగా తీసుకోవడం వల్ల ఎంగ్జైటీ లక్షణాలు తగ్గుతాయి. శ్వాస సంబంధిత వ్యాయామాలు రెగ్యులర్ గా చేస్తూ ఉండండి దీనితో మీరు రిలాక్స్ అవుతారు మరియు ఒత్తిడి కూడా మీ నుండి దూరం అవుతుంది కాబట్టి ఇటువంటి వాటిని మీరు ప్రయత్నం చేసి చూడండి.
 
వ్యాయామం చేయడం:
 
 కేవలం శారీరకంగా ఫిట్ గా ఉండటానికి మాత్రమే కాదు వ్యాయామం కూడా దూరం చేయడానికి పని చేస్తుంది. నిజంగా వ్యాయామం ని స్ట్రెస్ బస్టర్ అంటారు ఇది నిజంగా ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. మీరు వ్యాయామం చేసి మంచి ప్రయోజనాలను పొందాలంటే కనీసం రోజుకి అరగంట సేపు వ్యాయామం చేయండి. వాకింగ్, రన్నింగ్, డాన్సింగ్ లాంటివి చేస్తే కూడా మీకు మంచి వ్యాయామం అవుతుంది. దీనితో మీరు ఒత్తిడి నుంచి పూర్తిగా బయటపడవచ్చు.
 
ఇబ్బందులని దూరం చేయండి:
 
 పదేపదే సమస్య గురించి ఆలోచించడం, దాని మీద మీరు ఎక్కువ సమయాన్ని వెచ్చించడం ఇలాంటివి చేయడం వల్ల మానసికంగా మీరు ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మీరు అటువంటి ఆలోచనలు అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టండి. దీంతో మీరు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.
 
 నెగిటివ్ ఆలోచనల్ని మానుకోవడం చాలా ముఖ్యం ఇలా చేయడం వల్ల మీకు ఇబ్బందులు వెంటనే తొలగిపోతాయి. కాబట్టి మీరు ఒకసారి ఈ చెడ్డ ఆలోచనలకి నెగిటివ్ ఆలోచనలకి విరామం పెట్టేయండి దీనితో మీరు ప్రశాంతంగా ఉండడానికి వీలవుతుంది పైగా పూర్తిగా ఒత్తిడి కూడా దూరం అయిపోతుంది.
 
మీ మాటలతో మీరు ఛాలెంజ్ చేయండి:
 
 ఎప్పుడూ కూడా మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకండి. మీకు ఏదైనా ఆలోచన వస్తే మీరు దానిని ఎదుర్కొనే విధంగా మాట్లాడండి. దీంతో తప్పకుండా మీరు సమస్యని సాల్వ్ చేసుకోవడానికి వీలు అవుతుంది. అంతే కానీ మీరు పిరికిగా వ్యవహరిస్తే ఇబ్బందులు మీకు తప్పవు. పైగా దానంత చెడ్డ పరిస్థితి మీకు మరొకటి కలుగదు.
 
కనుక మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకుండా ఏమైనా సమస్యలు వస్తే... ధైర్యంగా ఉండడానికి ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి. అంతే కానీ ఇబ్బందుల గురించి భయపడిపోతూ వాటిని పదే పదే తలుచుకుని ఇబ్బందులు లోనే ఉండి పోతే ఎప్పటికీ మీరు బయటికి రాలేరు కాబట్టి కాస్త పాజిటివ్ గా ఆలోచించి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి నేను చేయగలను అనే ఆలోచనతో ముందుకు రండి. ఇలా చేస్తే తప్పకుండా మీరు నెగిటివ్ ఆలోచన నుంచి బయటపడగలరు. పైగా ఒత్తిడిని కూడా సులువుగా ఎదుర్కోవడానికి వీలవుతుంది.