BREAKING NEWS

కవికోకిల జాషువా రచనలు, తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు...!

గుర్రం జాషువా కుల, మత, వాస్తవికతను, అంటరానితనాన్ని, పేదరికాన్నీ, దోపిడీలను, స్త్రీల పీడనాన్ని శక్తివంతమైన కవిత్వంగా మలిచారు. నిజంగా ఆయన రచనలు చూస్తే కళ్ళకి కట్టినట్లుగా సమస్యలు కనబడతాయి. గుర్రం జాషువా ప్రకృతి మీద, ప్రేమ మీద, పిల్లల మీద, కరుణ, విలువలు వంటివి తన రచనల లో చూపించారు.
 
మనిషిని పశువు కన్నా హీనంగా చూసినా, చూస్తున్న చరిత్రను తన కవిత్వాల తో బలంగా చెప్పారు అలానే ఈనాటి దళిత రాజ్యాధికార భావనను ఆనాడు పలికించారు జాషువా. ఇలా గుర్రం జాషువా తన తర్వాత రాబోయే దళిత కవులకు మార్గం చూపాడు. వేదన తో ఆగిపోకుండా స్త్రీల పీడనను ఎత్తు చూపాడు.
 
 గుర్రం జాషువా స్త్రీలకు ఎదిరింపు జాలని చిలుకల చదువు నేర్పే బానిసలుగా పడి ఉంటే స్థితిని తెచ్చిన పురుష స్వామ్యన్ని గట్టిగా ఎండగట్టాడు జాషువా. తెలుగు జనం తెలుగు కవిత్వం గర్వించ దగ్గ కవి శిఖరం జాషువా. ఈనాడు మనం జాషువా గురించి అనేక విషయాలు తెలుసుకుందాం...! మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే పూర్తిగా దీనిని చూసేయండి. దీని వలన ఆయన రచనల గురించి, పొందిన పురస్కారాల గురించి ఇలా అనేక విషయాలు మీకు తెలుస్తాయి.
 
ఆధునిక తెలుగు కవుల్లో ఉత్తమ స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. గుర్రం జాషువా సెప్టెంబర్ 28 1895 లో జన్మించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం కి చెందిన జాషువా చిన్నతనం లోనే బడి లో చేరిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు తోటి పిల్లల నుండి కూడా ఎన్నో అవమానాలు జాషువా ఎదుర్కోవాల్సి వచ్చింది.
 
అగ్ర వర్ణాల పిల్లలు కులం పేరు తో హేళన చేస్తే తిరగబడి వాళ్ళను కొట్టాడు. ఎప్పుడూ కూడా ఊరుకో లేదు. ఎవరైనా కులం పేరు ఎత్తితే చాలు అతను తిరగబడే వారట.
 
 గుర్రం జాషువా పుస్తకాలు:
 
 గుర్రం జాషువా కవిత్వం చూడడానికి చక్కగా ఉంటుంది. ఎన్నో సమస్యలను మనం కవిత్వం లో చూడొచ్చు. ఎన్నో అద్భుతమైన రచనలు గుర్రం జాషువా చేశారు. వాటిలో ముఖ్యమైన పుస్తకాలు గబ్బిలం, స్వప్న కధ,  ముంతాజ్ మహల్, బాపూజీ, నేతాజీ, స్వయంవరం, కొత్త లోకం, క్రీస్తు చరిత్ర, ఖండ కావ్యాలు, ఫిరదౌసి, నాగార్జున సాగర్ ఇలా ఎన్నో పుస్తకాలు ఈయన రచించారు.
 
 గుర్రం జాషువా బిరుదులు, పురస్కారాలు:
 
పద్మభూషణ్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, క్రీస్తు చరిత్రకు 1964లో క్రియేట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా జాషువా దక్కించుకున్నారు. అలానే ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళా ప్రపూర్ణ కూడా జాషువా దక్కించుకున్నారు. అలానే కవితా విశారద, కవి కోకిల, కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ ఇలా అనేక విధాలుగా అయినా ప్రసిద్ధి చెందారు.
 
గుర్రం జాషువా సాహిత్యం:
 
చిన్న తనం నుంచి కూడా గుర్రం జాషువా ఎంతో తెలివి తో సృజనాత్మక శక్తి తో రాణించారు. బొమ్మలు గీయడం, పాటలు పాడడం కూడా ఇలా చేసే వారు. దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యం లో ఆయనకి కవిత్వం పై ఆసక్తి కలిగిందట.
 
గుర్రం జాషువా రచనల్లో గబ్బిలం రచన చెప్పుకోదగ్గది. ఈ రచన నిజంగా కాళిదాసు మేఘ సందేశం తరహా లో సాగుతుందట. ప్రతిదీ కూడా సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఫిరదౌసి రచన కూడా చెప్పుకోదగ్గది. ఈ మహాకావ్యాన్ని గుర్రం జాషువా రచించారు. ఈ పుస్తకం కూడా మంచి ప్రశంసల్ని అందుకుంది. నిజంగా జాషువా రచనలు సమస్యలని కళ్ళకి కట్టినట్టు చూపిస్తాయి. 
  
గుర్రం జాషువావి మరి కొన్ని రచనలు:
 
ఈ ముఖ్యమైన రచనలు మాత్రమే కాకుండా గుర్రం జాషువా రుక్మిణీ కల్యాణం, భీష్ముడు, కోకిల, శివాజీ ప్రబంధం, ధ్రువ విజయం, సంసార సాగరం, సింధూరము, బుద్ధ మహిమ, అఖండ గౌతమి, ఆశ్వాసము, మేఘుడు, స్మశాన వాటిక, మాతృ ప్రేమ, సాలీడు, హెచ్చరిక, వివేకానంద, గిజిగాడు, చంద్రోదయం, భారత వీరుడు, సూర్యోదయం, భారత మాత, యోగీంద్రుడు, వీర భాయ్, సీట్ల పేకాట, కొత్త లోకం, తెరచాటు, స్వయంవరం ఇలా ఎన్నో రచనలు చేశారు
 
గుర్రం జాషువా ఉద్యోగాలు:
 
మొదట ఈయన రాజమండ్రి లో మూకీ చిత్రాల కథానాయకుడిగా పని చేశారు. ఆ తర్వాత కొంత కాలం నాటక కర్తగా పని చేశారు. అది అయి పోయిన తర్వాత ఉపాధ్యాయ శిక్షణా సంస్థ లో అధ్యాపకునిగా పని చేశారు. ఆ తర్వాత భాషా ప్రవీణ పట్టం తీసుకుని జిల్లా బోర్డు పాఠశాల లో తెలుగు అధ్యాపకుని పదవి సాధించారు. అలానే ఆకాశవాణి లో ప్రొడ్యూసర్ గా కూడా ఉద్యోగం చేశారు. 
 
1964 లో ఆంధ్ర ప్రభుత్వం జాషువా గారిని శాసన మండలికి నామినేట్ చేశారు. ఏ ఉద్యోగం చేసినా అది జీవించడానికి మాత్రమే సాధనంగా ఆయన జన్మత: కవి.. కానీ కవిగా బతుకు సాధించడం అసాధ్యమని బడిపంతులు కూడా అయ్యారు.