BREAKING NEWS

ముడతలను తొలగించాలనుకుంటున్నారా..? అయితే ఈ యోగాసనాలు మీకోసం...!

మన చర్మానికి చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.  చర్మానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. డార్క్ స్కిన్, పింపుల్స్, బ్లాక్ హెడ్స్, ముడతలు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, అందంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ప్రధాన పాత్ర పోషిస్తాయి.
 
వీటితో పాటుగా ఫేషియల్ యోగా కూడా బాగా పని చేస్తుంది. చాలా రకాల యోగాసనాలు ఉన్నాయి వీటిని చేయడం వల్ల స్కిన్ టైట్ గా అవుతుంది. ఫేస్ యోగ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ముడతలు తొలగించడానికి కూడా ఇవి బాగా ఉపయోగ పడతాయి.
 
మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఉంటాయి అవి నాచురల్ గా ఉండవు. కాబట్టి మీరు వాటికి బదులుగా యోగా చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కనపడతాయి. మనకి కాలుష్యం, సూర్యకిరణాలు అలానే మనం తీసుకునే ఆహారం ఇటువంటివన్నీ మన చర్మం పై ప్రధాన పాత్ర పోషిస్తాయి.
 
అలానే వయసు పెరిగే కొద్దీ ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. వీటిని మనం కొన్ని రకాల ఆసనాలు వేసి తొలగించుకోవచ్చు. అయితే ఈ రోజు నిపుణులు చెప్తున్న యోగాసనాలు గురించి చూసేద్దాం వీటి వల్ల ముడతలు తొలగి పోతాయి మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం పూర్తిగా చూసేయండి.
 
 ముడతలు తొలగిపోవడానికి యోగాసనాలు:
 
ఇక్కడ చెప్పినట్లు మీరు చేశారు అంటే మీకు మంచి బెనిఫిట్ కలుగుతాయి. ఫేస్ యోగ వల్ల ఎంతో మంచి కలుగుతుంది. చాలా రకాల శారీరక మరియు మానసిక ప్రయోజనాలు కూడా ఫేస్ యోగ వల్ల మనకి కలుగుతాయి. ఫేషియల్ ఎక్సర్సైజెస్ చేసే ఫేషియల్ పెరాలిసిస్ నుంచి కూడా రికవరీ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత ఎఫెక్టివ్ గా పని చేస్తుందో మీకు ఈపాటికే అర్ధం అయి ఉండవచ్చు. అయితే ఇక్కడ కొన్ని ఫేషియల్ యోగాసనాలు ఉన్నాయి. వీటిని అనుసరించడం వల్ల ముడతలు తగ్గుతాయి మరియు చర్మం టోన్ కూడా మారుతుంది. ఇక ఏమాత్రం లేటు లేకుండా వీటిని చూసేద్దాం..!
 
నుదుటని స్మూత్ గా ఉంచడం:
 
ఇలా చేయడం వల్ల ముఖం మీద గీతలు, ముడతలు తొలగిపోతాయి. ఈ పద్ధతిని రోజుకి ఆరు సార్లు చేయడం ముఖ్యం. ఇది చాలా సింపుల్. ఇలా చేయడం వల్ల మీ మజిల్స్ ఓపెన్ అవుతాయి మరియు మీ నుదుట మీద ఫోకస్ పడుతుంది. దీని కోసం మీరు రెండు చేతులూ గుప్పెడులాగా  ముయ్యండి. ఇప్పుడు రెండు గుప్పెడలని నుదిటి మీద పెట్టండి. నెమ్మదిగా ప్రెజర్ పెడుతూ నుదుటి మీద కి రెండు వైపుల నుంచి కూడా ప్రెస్ చేయండి.
 
మీ వేళ్ళని ముఖం వైపు ఉంచండి. ఇలా నెమ్మదిగా మీరు చేయడం వల్ల నుదుటి మీద ముడతలు తొలగిపోతాయి. నుదిటి మీద ముడతలు తొలగించడానికి ఇది చాలా నేచురల్ పద్ధతి. కాబ్బటి ట్రై చెయ్యండి.
 
 పెదవుల కోసం:
 
 ఇది కూడా ముఖ్యమైన యోగాసనం. పెదవుల కి ఇరు వైపులా కూడా ముడతలు ఈ ఆసనం ద్వారా తొలగిపోతాయి. దీనికోసం మీరు కూర్చున్నా పరవాలేదు లేదు అంటే వాలిన పరవాలేదు కొంచెం మీ హెడ్ మీ వెనక్కి వంచండి. ఇప్పుడు మీ పెదవులని మూసి టైట్ గా ఉంచండి. 10 నుంచి 15 సెకన్లు అలా ఉంచేయండి. పెదవులకి కొబ్బరి నూనె లేదా పెప్పర్ మింట్ లిప్ బాం రాసి  ఉంచినా పరవాలేదు. అయితే అసలు ఈ ఆసనం వల్ల ప్రయోజనం ఏమిటంటే ఇది బ్లడ్ 
సర్క్యులేషన్ అయ్యేలా  చూస్తుంది తద్వారా ముడతలు తగ్గిపోతాయి.
 
డబల్ వి:
 
 ఈ ఆసనాన్ని రోజుకి ఎనిమిది సార్లు చేయాలి. రెండు చేతులతో కూడా మీరు విక్టరీ గుర్తులు పెట్టండి. ఇప్పుడు రెండు చేతులు కూడా చెరో కంటి మీద పెట్టండి. ఇలా నెమ్మదిగా కళ్ళ మీద పెట్టి కాస్త ఒత్తిడి పెట్టండి. ఇలా మీరు రోజుకు ఎనిమిది సార్లు చేయడం వల్ల కళ్ళ పక్కన ఉండే కొవ్వు తగ్గిపోతుంది. అలానే ముడతలు కూడా క్రమంగా పోతాయి.
 
లయన్ ఫోజు:

 
లైన్ ఫోజు పెట్టడం వల్ల మీ నోటి కింద భాగంలో కూడా స్ట్రెచ్ అవుతుంది. అలానే మీ గడ్డం వరకు కూడా లైన్స్ తొలగి పోతాయి. దీని కోసం మీరు నోటి నుంచి శ్వాస తీసుకుని సింహం లాగ అరవండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి బెనిఫిట్ కలుగుతుంది. దీనిని ఐదు సార్లు రిపీట్ చేస్తూ ఉండండి. దీనినే సింహాసన అని అంటారు ముఖం మీద ముడతలు తొలగిపోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
 
బుగ్గల మీద ముడతలు తొలగిపోతాయి:
 

ఈ యోగాసనం ఎలా చేయాలంటే దీని కోసం ముందు మీరు నోటిని మూసేయాలి. ఇప్పుడు మీరు ఏదో ఆహారం నమ్ముతున్నట్టు చేయాలి. ఆ తర్వాత మీరు మీ నోటికి ఎంత పెద్దగా తెరవాలంటే అంత పెద్దగా తెరవండి. కానీ నాలికని మాత్రం కింద పంటికి తగిలేటట్టు ఉంచండి ఇలా మీరు పది నుంచి పదిహేను సెకన్లు చేయండి. డబల్ చీక్స్ ఉన్నవాళ్లు దీనిని చేయడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. ఈ ఆసనాన్ని మీరు రోజులో 7  సార్లు చేయొచ్చు.