BREAKING NEWS

చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతోందా..? అయితే దానికి గల కారణాలు ఇవే..!

సాధారణంగా మనం తక్కువ వయస్సు ఉన్న వాళ్ళలో కూడా జుట్టు తెల్లగా అయిపోవడం వంటి సమస్యలు చూస్తాము. నిజంగా ఇది పెద్ద సమస్య అనే చెప్పాలి. చాలా మంది వివిధ రకాల ఆయిల్స్, షాంపూలు ఉపయోగించి తిరిగి నల్లగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దాని వల్ల అది సాధ్యం కాదు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ మీద దృష్టి పెడతారు కానీ నిజంగా ఇది ఎందుకు అవుతుంది అనే ప్రయత్నం చేయరు.
 
అయితే ఈ రోజు తక్కువ వయసులో జుట్టు తెల్లబడిపోవడం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. మనకి తెలియకుండా చిన్నచిన్న కారణాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. గతం తో పోల్చుకుంటే ఈ కాలం లో జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఆహారం లో కూడా పోషక విలువలు తగ్గి పోతున్నాయి.
 
 నిజంగా చెప్పాలంటే తినే తిండి లో ఏ మాత్రము న్యూట్రియాంట్స్ ఉండటం లేదు. మన ఆరోగ్యం సరిగ్గా ఉండాలన్నా, మనం అందంగా ఉండాలి అన్నా మన డైట్ బాగా ఉండాలి. అలానే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. అయితే ఎందుకు జుట్టు 20 ఏళ్లకే తెల్లబడిపోతోంది అనే విషయం పై నిపుణులు చెప్పిన సమాచారాన్ని ఇప్పుడే చూసేయండి.
 
చాలా మంది ఈ సమస్య తో బాధ పడుతున్నారు. మార్కెట్ లో వాడే ప్రొడక్ట్స్ వల్ల లేదా జీవన విధానం సరిగ్గా లేక పోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కేవలం ఇవే కాదు వీటితో పాటు మరి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా పూర్తిగా ఇప్పుడే చూడండి. 
 
అసలు జుట్టు తెల్లగా అయి పోవడం అంటే ఏమిటి..? 
 
జుట్టు తెల్ల పడిపోవడం అంటే 20 ఏళ్ల వయసు లోనే కెమికల్ ప్రొడక్ట్స్ కాస్మెటిక్ లేదా మాల్న్యూట్రిషన్ కారణంగా ఇవి జరుగుతాయి. లేదా జెనిటిక్ పరంగా కూడా ఇది సంభవిస్తుంది ఆరోగ్యకరమైన జుట్టు మన యొక్క శారీరక ఆరోగ్యం ఎలా ఉందో చూపిస్తుంది. జుట్టు రంగు దాని యొక్క గుణం బట్టి మన ఆరోగ్యాన్ని అది సూచిస్తుంది.
 
 ఒకవేళ మీకు అనుమానంగా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మందిలో జుట్టు తెల్లబడిపోవడం పెద్ద సమస్య అయిపోయింది. అది మహిళల్లో పురుషుల్లో కూడా సంభవిస్తుంది అయితే రీజన్ అనేది కరెక్ట్ గా లేక పోయినా కొన్ని కారణాలు దానికి కారణమవుతాయి. త్వరగా ఎందుకు జుట్టు నెరిసిపోతోంది, నిపుణులు చెప్పిన సమాచారం ప్రకారం జుట్టుకి కెమికల్స్ ఉపయోగించడం హెయిర్ జెల్ లేదా హెయిర్ క్రీమ్ను ఉపయోగించడం కారణంగా కూడా ఈ సంభవిస్తాయి.
 
మరొక కారణం ఏమిటంటే జెనిటిక్ పరంగా వ్యాపించవచ్చు అని ఇందాక చెప్పుకున్నాము కదా అదే సాధారణంగా మనకి చిన్న చిన్నతల మీద సంచులు లాగ ఉంటాయి. అక్కడ స్కిన్ సెల్స్ ఉంటాయి. అక్కడ ఉండే మెలనిన్ ఈ జుట్టు రంగు కి కారణం అవుతుంది. జుట్టు చిన్న వయసులో ఎందుకు  నెరిసిపోతుంది అనే విషయానికి వస్తే... ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూసేయండి.
 
ఒత్తిడి:
 
 ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బాధ వస్తుంది. క్రమంగా మీకు ఒత్తిడి పెరిగి పోవడం వల్ల ఇది వస్తుంది. దీని కారణంగా మీకు నిద్రలేమి సమస్యలు,  హై బ్లడ్ ప్రెషర్, ఆకలి వేయక పోవడం కూడా ఉంటాయి. కనుక వీలైనంత ప్రశాంతంగా ఉండాలి మరియు ఒత్తిడి పడకుండా విశ్రాంతి తీసుకోవడం, వేళకు తినడం, రిలాక్స్ అవ్వడం వంటివి చేయాలి.
 
జెనెటిక్ :
 
జెనిటిక్ పరంగా కూడా జుట్టు త్వరగా నెరిసి పోతుంది. మీ తల్లిదండ్రులు ఎవరికైనా ఇది ఉంటే మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీని కారణంగా త్వరగా మీ జుట్టు నెరిసి పోతుంది.
 
థైరాయిడ్:

 
హైపర్థైరాయిడిజమ్ లేదా హైపోథైరాయిడిజమ్ ఉన్న కూడా జుట్టు త్వరగా నెరిసి పోతుంది.
 
 విటమిన్ బీ ట్వెల్వ్ లేకపోవడం:
 
 విటమిన్ బీ ట్వెల్వ్ జుట్టు పెరుగుదలకు కారణం అవుతుంది. మీ ఒంట్లో విటమిన్ b12 లేకపోయినట్లయితే జుట్టు నెరిసిపోవడం జరుగుతుంది.
 
ధూమపానం చేయడం:
 
 నిజంగా ఇది షాక్ గా ఉంటుంది విన్నారంటే. ఎందుకంటే ధూమపానం చేసే వాళ్ళకి త్వరగా జుట్టు నెరిసి పోతుంది అని నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తులు మరియు గుండె కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయితే దూమపానం చేయడం వల్ల జుట్టు కూడా దెబ్బతింటుంది. క్రమం తప్పకుండా స్మోక్ చేసే వాళ్ళల్లో ఈ సమస్య వస్తుంది.
 
పోలియోసెస్:
 
కొన్ని కొన్ని సార్లు ఒక ప్రదేశం లో జుట్టు నెరిసిపోతుంది. దానిని పోలియోసిస్ అంటారు. ఇది పిల్లల్లో పెద్దల్లో కూడా వస్తుంది. మెలనిన్ శాతం తగ్గిపోయినప్పుడు ఇది జరుగుతుంది కానీ దీని వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఏమీ కాదు.కానీ దీని వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఏమీ కాదు. ఇలా ఇటువంటి కారణాల వల్ల జుట్టు నెరిసిపోవడం జరుగుతుంది. కాబట్టి మన చేతుల్లో కేవలం ఉండేది సరిగ్గా ఆహారం తీసుకొని సమతుల్యమైన ఆహారం తీసుకోవడం రోజూ మెడిటేషన్ చేసి ఒత్తిడిని తగ్గించుకోవడం లాంటివి చేస్తే కాస్త బాగుంటుంది.