BREAKING NEWS

చంద్రగిరి కోట గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీకోసం....!

చంద్రగిరి కోట తప్పక వెళ్లాల్సింది..! ఎందుకంటే ఇది చారిత్రక కోట. దీనికి సంబంధించి ఇక్కడ అనేక వివరాలు ఉన్నాయి. నిజంగా చూశారంటే ఆశ్చర్యపోతారు. మరి ఆలస్యం ఎందుకు చంద్రగిరి కోటకు సంబంధించిన అనేక విషయాలు ఈ రోజు చూసేయండి. చంద్రగిరి కోట పదకొండవ శతాబ్దం నాటిది. ఇది మన భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లో చంద్రగిరిలో నిర్మించబడింది. ఆనాటి విజయ నగర చక్రవర్తులు తో ఈ కోట కి సంబంధం ఉన్నప్పటికీ దీనిని యాదవ పాలకులు నిర్మించారు.
 
చంద్రగిరి కొండపై కోట ఉంటుంది. అలానే కోట లోని రాణి మహల్ ద్వారాలు, తోటలు, శిల్ప కళా శోభితమైన రాతి స్తంభాలు, కొలను, రాజ్ మహల్ కోట పైన గోపురం ఇలా ఎన్నో ప్రదేశాలు ఆకర్షిస్తాయి. నిజంగా వీలైతే తప్పకుండా ఈ ప్రదేశాన్ని చూడండి. తిరుపతి నుండి ఇది చాలా దగ్గర. 
 
చంద్రగిరి లోని  ఉండే దేవాలయాలు:
 
 ఈ చంద్రగిరి సమీపంలో దేవాలయాలు ఉన్నాయి. కోట ని చూసిన తర్వాత ఈ ఆలయాన్ని కూడా చూసేయండి. ఇక్కడ మూలస్థానం అమ్మ తల్లి దేవస్థానం, మెట్ట గంగమ్మ తల్లి దేవస్థానం, పంచ పాండవులు ద్రౌపతి దేవి ఆలయం, సువర్ణముఖి నది ఒడ్డున పాడుబడ్డ దేవాలయాలు, చంద్రగిరి సెంటర్లో ఉన్న స్తంభం, నరసింగాపురం దారిలో ఉన్న శివాలయం, చంద్రగిరి కోట పరిసరాల్లో అనేక పాడుబడ్డ దేవాలయాలు. వీటినే సౌండ్ అండ్ లైట్ షో లో అద్భుతంగా ఉపయోగిస్తున్నారు. అలానే  పురావస్తు వేత్తలు భద్రపరిచిన పాడుబడ్డ దేవాలయం ఇలా ఇక్కడ ఎన్నో ఆలయాలు ఉన్నాయి.
 
రాజు రాచరికాలు చరిత్ర గర్భం లో కలిసిపోయిన ఈ కోట మాత్రం ఇంకా సజీవంగానే ఉంది. తిరుపతి నుండి దీన్ని చేరుకోవాలంటే కేవలం 12 కిలో మీటర్ల దూరం మాత్రమే. పురాతనమైన ఈ కోట ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారింది. ఈ కోట నిర్మాణం లో అప్పటి రాజులు చూపించిన వ్యూహాలు అందరినీ ఆశ్చర్య పరుస్తాయి. కొండ పై ఉన్న రెండు చెరువులకు కింద ఉన్న పెద్ద చెరువు నుంచి నీళ్లను ఎటువంటి యంత్రం పైపులు సహాయం లేకుండా పంపించడం లాంటివి ప్రత్యేకంగా ఉంటాయి.
 
 ఈ చంద్రగిరి కోట కి సంబంధించిన పలు విషయాలు చూద్దాం:
 
 రాణి మహల్ రాజ్ మహల్ :
 
ఈ కోట లో రాణి మహల్, రాజ్ మహల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మూడు అంతస్థుల తో ఈ కోట చాలా అందంగా ఉంటుంది. రాణీ మహల్ నిర్మాణాన్ని అనుసరించి అది గుర్రపు సాల కావచ్చునని పురాతన శాఖ అభిప్రాయ పడుతోంది. అక్కడ మనకి బోర్డు కూడా కనబడుతుంది. అలానే రాణీ మహల్ వెనుక వైపున కొంచెం దూరం లో కూడా మనం చూడొచ్చు.
 
 చంద్రగిరి కోట లో మ్యూజియం:
 
 రాజ్ మహల్ మొదటి అంతస్తును మ్యూజియంగా మార్చారు. అనేక పురాతన వస్తువులు ఇక్కడ మనం  చూడొచ్చు. 
 
చంద్రగిరి కోటలో శిల్పాలు:
 
అక్కడ ఉండే శిల్పాలను ముస్లిం పాలకులు నాశనం చేయగా చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు ఇక్కడ పొందుపరిచారు/ వీటిని పర్యాటకులు నేరుగా చూడొచ్చు అలాగే ఈ కోట లో రెండవ అంతస్తు లో సింహాసన లతో కూడిన రాజ దర్బార్ ని కూడా మనం చూడవచ్చు. ఇక మూడవ అంతస్తు లో అయితే కోట నమూనా ప్రజల జీవన విధానం వంటివి మనం ఎన్నో చూడొచ్చు.
 
రాళ్లను నిర్మించి కట్టడం :
 
పెద్ద పరిమాణంలో ఉండే రాళ్ళని వినియోగించి కట్టారు. అంత ఎత్తు పొడవు ఉండే కోట గోడకు పెద్ద పరిణామంలో ఉన్న రాళ్ళను వినియోగించడం ఆ కాలం లో ఎలా సాధ్యమని అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటికి కూడా దీనికి సంబంధించిన విషయాలు బయట పడ లేదు ముఖ్యంగా కొండ పాద భాగంలో ఈ కోటను నిర్మించడం వల్ల ఒక వైపు కొండ సహజ సిద్ధంగా రక్షణ కల్పించడం అవుతుంది.
 
 ఈ వైపు నుంచి శత్రురాజు ఈ కోట లో ప్రవేశించిన దాదాపు అసాధ్యం దగ్గరగా ఉండడం వల్ల పైకి ఎక్కితే దూరంగా వచ్చే వారి కదలికలు కూడా సులభంగా గుర్తు పట్టవచ్చు నిజంగా ఈ నిర్మాణానికి జోహార్లు చెప్పాలి.
  
విజయనగర సామ్రాజ్యం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ముఖ్యంగా కృష్ణ దేవరాయల కాలంలో చంద్రగిరి కోట ఒక వెలుగు వెలిగింది అనే అనాలి. శ్రీ కృష్ణ దేవరాయలు ఇక్కడికి వచ్చి ఇక్కడే బస చేశావారట. క్రీస్తు శకం 1518 లో విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత దక్కన్ ప్రాంతం ముస్లిం రాజులు సమాఖ్య చేతి లోకి వచ్చింది ఆ సమయం లో విజయనగర రాజులు తమ రాజధానిని పెనుకొండకు అటుపై చంద్రగిరి కి మార్చారు.
 
అలాగే ఇక్కడ ఖాళీగా ఉన్న ప్రదేశం లో చెట్లను పెంచారు. తర్వాత పర్యటకుల మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద ఓపెన్ థియేటర్ ని కూడా ఏర్పాటు చేశారు. దీని లోనే సౌండ్ లైటింగ్ తదితర ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు.
 
చంద్రగిరి కోటను ఎలా చేరుకోవాలి..? 

 
చంద్రగిరి కోట తిరుపతికి 12 కిలో మీటర్ల దూరంలో ఉంది తిరుపతి నుంచి చంద్రగిరి కోట కు వెళ్లాలంటే కేవలం పది నిమిషాలు. బస్సు సౌకర్యం ఉంది అలానే ప్రైవేటు వాహనాల లో కూడా మీరు వెళ్లొచ్చు. దీనిని చూడటానికి 3 గంటల సేపు పడుతుంది.