BREAKING NEWS

సహజసిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం గురించి అనేక విషయాలు మీకోసం...!

తిరుమల లో ఉండే వెంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడికి సంవత్సరం పొడవునా భక్తులు వెళ్తూ ఉంటారు. పైగా తిరుపతి ఎంతో ప్రసిద్ధి చెందింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున ఒక కిలో మీటర్ల దూరంలో చక్రతీర్థం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం వుంది. అయితే ఈ శిలా తోరణం ని మాత్రం తప్పక చూడాలి.
 
వెంకటాచలం తో సమానమైన క్షేత్రం గానే వెంకటేశ్వర్లు తో సమానమైన దేవుడు కానీ ఈ జగత్తు లో ఎవరూ లేరని అంటారు. అయితే పరమ పవిత్రమైన ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ శిలా తోరణం ని చూడండి.
 
ఇక్కడ సహజ శిలా తోరణం శ్రీవారి ఆలయానికి ఉత్తరం లో ఒక కిలో మీటర్ దూరం లో ఈ సహజ శిలా తోరణం ఉంది. అయితే ఇది ఎలా ఉంటుంది..?, దీని యొక్క ప్రత్యేకత ఏమిటి..? అనేది ఇప్పుడు చూద్దాం.
 
శిలాతోరణం:

 
సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ శిలా తోరణం ధనస్సు ఆకారం లో ఉంటుంది. ఈ శిలా తోరణం 1980వ దశకం లో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధన లో గుర్తించినట్లు తెలుస్తోంది. సహజ శిలాతోరణం ని  భౌగోళిక అద్భుత కూడా చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా కూడా అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంది. కొన్ని వందల కోట్ల సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నట్లు కూడా శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.
 
 దాదాపు 250 కోట్ల సంవత్సరాల నాటి శిలలు కాల క్రమం లో శిలాతోరణలు ఏర్పడ్డాయని అలా ఏర్పడిన వాటిలో ఇది ఒకటి అని అంటారు. అయితే చిన్న చిన్న శిలాతోరణ కాకుండా సహజంగా ఏర్పడిన పెద్ద శిలా తోరణాలు కేవలం మూడే ఉన్నాయట. అయితే అందులో ఒకటి ఈ శిలాతోరణం 250 కోట్ల సంవత్సరాలకు పూర్వం తీవ్రమైన నీటి కొరత కారణంగా ఈ శిలా తోరణం ఏర్పడి ఉండ వచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు.
 
తిరుమల కొండ మీద ఉండే ఈ శిలా తోరణం సుమారు 20 అడుగుల వెడల్పు 9.8 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది మొదట జీవుల తొలి స్థావరంగా కూడా ఉన్నట్లు కొన్ని కధనాల ద్వారా తెలుస్తోంది ఇక్కడ సూర్యోదయం చూడడానికి చాలా బాగుంటుంది. అయితే ఒకప్పుడు కేవలం శిలా తోరణం మాత్రం గానే ఉన్న ఈ ప్రాంతం లో ఇప్పుడు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్ల తో వివిధ రకాల పక్షులు కూడా పెంచుతున్నారు. అక్కడికి పర్యాటకులకు వెళ్లి విశ్రాంతి తీసుకుని అక్కడ ఉండే పక్షులను చూసి ఆనందిస్తారు.
 
ఈ పుణ్య మన్యం లో ప్రకృతి వింతలు :
 
ఈ పుణ్య మన్యం లో ప్రకృతి వింతలు ఎన్నో ఉంటాయి. అలానే ఇక్కడ ఎంతో వన్య సంపద కూడా ఉంది. అయితే ఎటువంటి ప్రకృతి వింతల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ అరుదైన శిలా తోరణం అందరినీ ఆకర్షిస్తుంది. అయితే ఒక శిలా తోరణం ఇక్కడ ఉండగా... మరో రెండు శిలా తోరణాలు ఎక్కడ ఉన్నాయి అనే విషయానికి వస్తే... మరొకటి అమెరికా లో ఒక ప్రాంతంలో అలానే మరొకటి ఇంగ్లాండు లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత అరుదైన, ఇంత పురాతనమైన ప్రకృతి వింత మన తిరుమల లో నెలకొనడం మన అదృష్టమనే చెప్పాలి. ప్రకృతి పరంగానూ ఆధ్యాత్మిక పరంగా కూడా దీనికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. పైగా ఎంతో మంది దీనిని సందర్శిస్తారు కూడా.
 
శిలా తోరణం జాతీయ స్మారక చిహ్నం:
 
ఇది ఎప్పుడో  కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. అయితే అప్పటి నాటి కాలానికి చెందిన రాళ్ళలో ఏర్పడింది ఇది. ప్రకృతి సహజమైన కొత్త కారణంగా ఇది ఏర్పడిందని అంటారు. 
 
వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన ప్రదేశం:

 
అయితే మొట్ట మొదటి సారి వెంకటేశ్వర స్వామి వారు భూమి పైకి వచ్చినప్పుడు తొలి అడుగు ఈ పర్వతాలలో ఉన్న శ్రీ వారి మెట్టు లేదా శ్రీవారి పాదాలు అని చెప్పుకుంటున్న ప్రాంతం లో వేశారు. ఆ తర్వాత రెండవ అడుగు సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ శిలా తోరణం వద్ద వేశారని అంటారు. అలా మూడవ అడుగు స్వామి వారు కొలువు తీరిన ప్రదేశం లో వేశారని పురాణ కథనం ప్రకారం తెలుస్తోంది. అయితే మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే...? ఈ శిలా తోరణం మీద ఎవరూ చెక్క కుండానే సహజ సిద్ధంగా ఏర్పడిన శంఖం, చక్రం తో పాటుగా వరద హస్తం, కటి హస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగాభరణం వంటివి ఎంతో స్పష్టంగా చూడొచ్చు.
 
 శిలా తోరణం దగ్గర సూర్యోదయం:
 
 నిజంగా ఇక్కడ ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో. ఇక్కడ సూర్యోదయం చాల బాగా కనబడుతుంది. ఇక ఈ ప్రదేశపు అందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మాత్రం ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య లోనే తప్పక వెళ్ళాలి. నిజంగా ఇక్కడి నుంచి సూర్యోదయాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రమణీయమైన ప్రక్రుతి మాయకి ఎంతటి వారైనా ముగ్ధులు అవ్వాల్సిందే.