BREAKING NEWS

కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ కర్ఫ్యూ, లాక్ డౌన్ అంటే...?

కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. 
 
కొన్ని కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ మరి కొన్ని చోట్ల లాక్ డౌన్ ఇలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని కరోనాని అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మన భారత దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కోవిద్ 19 కేసులు 1.50 కోట్లు ఒక రోజునే రావడం ఘోరం.
 
ఎంతో మంది కరోనా వైరస్ బారిన పడి పోతున్నారు. యూనియన్ హెల్త్ మినిస్టర్ ఈ ఒక్కరోజులోనే కేసులు అధికంగా నమోదయ్యాయని తెలియజేసింది. కరోనా వైరస్ కారణంగా కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ కి సంబంధించి పూర్తి సమాచారం మీకోసం.
 
ఢిల్లీ లో కరోనా :

 
వచ్చే సోమవారం వరకు ఢిల్లీలో లాక్ డౌన్ విధించడం అయింది. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ మరియు ltd గవర్నర్  సోమవారం ఈ  నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏప్రిల్ 26 ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ ఉంటుందని చెప్పారు. అలానే కేజ్రీవాల్ ఈ పాసులు వస్తాయని దానితో షాపులు, కిరాణా సామాన్లు, పండ్లు, కూరగాయలు, డైరీ మరియు పాల కేంద్రాలు మాంసం మరియు చేపలు తో పాటుగా బ్యాంకు లో పని చేసే వాళ్ళకి టెలికాం లేదా ఇంటర్నెట్ సర్వీసుల్లో పని చేసే వాళ్ళకి, పెట్రోల్ పంప్స్ లో పని చేసే వాళ్ళకి కూడా ఈ పాసులు వస్తాయని చెప్పారు.
 
కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి పెళ్లిళ్లకి మరియు అంత్యక్రియలకు 20 నుండి 50 మంది మాత్రమే అటెండ్ అవ్వాలి అని చెప్పారు.
 
మహారాష్ట్ర లో కరోనా:
 
మహారాష్ట్రలో రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఏప్రిల్ 14 నుండి మే 1 వరకు ఇక్కడ కర్ఫ్యూ కొనసాగుతోంది. అందరూ కలిసి పోవడం లాంటివి చేయకూడదని సామాజిక దూరం పాటించాలి అని చెప్పారు. కేవలం నిత్యావసరాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి అని కూడా చెప్పారు 
 
హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్, క్లినిక్స్, వ్యాక్సినేషన్, మెడికల్ ఇన్సూరెన్స్, ఫార్మసిస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మరియు ఇతర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ తో పాటు విమానాల్లో, ట్రైన్స్, టాక్సీలు, ఆటోలు మరియు పబ్లిక్ బస్సులో 50 శాతం సీటింగ్ కెపాసిటీ మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. బెంగుళూరు, మైసూరు, మంగుళూరు లో రాత్రి పది నుండి ఉదయం ఐదు వరకు కర్ఫ్యూ విధించారు.
  
ఉత్తర ప్రదేశ్, పంజాబ్, లో కరోనా:
 
ఉత్తరప్రదేశ్, అలహాబాద్, లక్నో, వారణాసి, కాన్పూర్ నగర్ మరియు గోరక్ పూర్ లో ఒక వారం పాటు విధించారు. ఇక్కడ కూడా  శనివారం రాత్రి ఏడు నుంచి సోమవారం ఉదయం 7 వరకు కర్ఫ్యూ విధించారు.  
 
పంజాబ్ లో కూడా నైట్ కర్ఫ్యూ విధించడం అయింది. రాష్ట్రవ్యాప్తంగా పంజాబ్ లో  రాత్రి 8 నుంచి ఉదయం 5 వరకు ఉంటుంది. అలాగే సినిమా థియేటర్లు, కోచింగ్ సెంటర్లు, జీన్స్, బార్లు కూడా ఏప్రిల్ 30 వరకు మూసివేశారు. పెళ్లిళ్లకి మరియు అంత్యక్రియల కేవలం 20 మంది వరకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
 
ఒడిశా, గుజరాత్, హర్యానా లో కరోనా:
 
ఒడిశా లో కూడా నైట్ కర్ఫ్యూ విధించారు. అదేవిధంగా గుజరాత్లో కూడా నైట్ కలిసి ఉంటున్నట్లు రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు. అయితే ఇవి కేవలం 20  సిటీస్  లో మాత్రమే. 
 
అదే విధంగా హర్యానా లో కూడా నైట్ కర్ఫ్యూ విధించారు. ఇక్కడ రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకూ నైట్ కర్ఫ్యూ ఉంటుంది. ఏప్రిల్ 30 వరకు పాఠశాలలు, కళాశాలలు కూడా ఇక్కడ మూసివేశారు.
 
జమ్మూ అండ్ కాశ్మీర్, చత్తీస్గర్, కర్ణాటక లో కరోనా: 
 
జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా నైట్ కర్ఫ్యూ విధించారు. కొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. అలానే  చత్తీస్గఢ్లో మూడు జిల్లాలో లాక్ డౌన్  విధించారు. రాయపూర్ లో అయితే ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 19 వరకు లాక్ డౌన్ పెట్టేసారు.  నిత్యవసరాలు మాత్రమే కొనుగోలు చేయడానికి వీలవుతుంది. అదే విధంగా  కర్ణాటకలో కూడా నైట్ ఖర్చు విధించారు. అక్కడ రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది కేవలం నిత్యావసరాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
 
 రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఐజ్వాల్, కేరళ లో కరోనా:
 
రాజస్థాన్ లో అయితే 3 వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఇక్కడ కూడా కేవలం నిత్యావసరాలకు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు చోట్ల నైట్ కర్ఫ్యూ విధించారు. ఐజ్వాల్ లో అయితే వారం రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ పెట్టారు. ఇక్కడ మొత్తం పది జిల్లాలలో లాక్ డౌన్  పెట్టి ఇంటి నుంచి బయటికి రాకూడదని ప్రభుత్వం చెప్పడం జరిగింది. కేరళలో కంటైన్మెంట్ జోన్స్ లో లాక్ డౌన్ మరియు ఇతర ప్రదేశాలలో నైట్ కర్ఫ్యూ విధించారు.