BREAKING NEWS

కరోనా విలయతాండవంతో ఈ దేశాలకి నో ఎంట్రీ...!

కరోనా వైరస్ చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య కూడా ఎక్కువ అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఏది ఏమైనా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండటం మంచిది. వీలైనంత వరకు బయటకి వెళ్లక పోవడమే మేలు. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి కనీస నియమాలు మాత్రం తప్పక పాటించాలి. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ చాలా మంది వేయించుకున్నారు.
 
 మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. వాక్సినేషన్ సెంటర్ కి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా గతం లో కరోనా బారిన పడిన వ్యక్తులు కూడా వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలి. ఈ రెండు వ్యాక్సిన్ డోసులు కరోనా బారిన పడ్డ వాళ్ళు తీసుకుంటే తిరిగి వాళ్ళల్లో రోగ నిరోధక శక్తి బూస్ట్ అవుతుంది.
 
పోషకాలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం, ఆక్సిజన్ లెవెల్స్ సరిగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం ముఖ్యం. తాజాగా ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉండాలంటే  ఇంట్లో  ప్రోనింగ్ చేయాలని హెల్త్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటివి మీరు అనుసరించి జాగ్రత్తగా ఉండటం మేలు. లేదంటే ఈ మహమ్మారి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 
కాబట్టి కోవిడ్ 19 బారిన పడకుండా అవసరమైన హోమ్ టిప్స్ తో పాటు వ్యాయామం చేయడం ఒత్తిడికి, నెగిటివిటీ కి దూరంగా ఉండడానికి మెడిటేషన్ చేయడం లాంటివి పాటిస్తే శారీరకంగా మరియు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది.
 
అదే విధంగా వ్యాధి కూడా సోకకుండా ఉంటుంది. అన్ని ప్రదేశాల్లో కూడా ముందు మాదిరి గానే కరోనా నిబంధనలు తప్పక పాటించడం ముఖ్యం. కొత్త రకం వైరస్ నుంచి కూడా కొద్ది స్థాయిలో తప్పక ప్రభావం ఉంటుందని ఆరోగ్య శాఖ తెలుపుతోంది. న్యూ వేరియంట్ నుండి తగ్గించడానికి ప్రజలు పాటించవలసిన పద్ధతులు కచ్చితంగా పాటించి వైరస్ ని ఎదుర్కోవాల్సి ఉందని డబ్ల్యూహెచ్వో కూడా సూచిస్తోంది.
 
ఇదిలా ఉంటే ఇప్పటికే చాలా దేశాలు భారతీయులుని తమ దేశాలకు రావద్దని చెప్పడం కూడా జరిగింది. కనుక ఇప్పుడు భారతీయులకు అక్కడికి వెళ్లడం కి అనుమతి లేదు. అయితే ఏఏ దేశాలు కరోనా కారణంగా భారతీయులని రాకుండా చేశారు అనేది ఇప్పుడు చూద్దాం...!
 
ఇండియా నుండి ఇప్పుడు ఈ దేశాలకి వెళ్లడానికి అనుమతి లేదు:
 
కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వివిధ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మరి వాటికి సంబంధించి పూర్తి వివరాలని ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తిగా చూసేయండి. దీనితో మీకు అనేక విషయాలు తెలుస్తాయి. 
 
న్యూజిలాండ్:
 
కరోనా తీవ్రత ఎక్కువ అవడం తో భారత దేశం నుండి న్యూజిలాండ్ కి ప్రయాణీకులకి అనుమతి లేదు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ ప్రధాని జసిందా అర్డర్న్ తెలియ జేశారు ఏప్రిల్ 28 వరకు ప్రయాణికులకు ఎటువంటి అనుమతి లేనట్టు తెలిపారు. న్యూజిలాండ్ లో తాజాగా 23 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి.. అయితే వేళల్లో 17 మంది భారతీయులు ఉండడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా:
 
భారత దేశం లో కరోనా తీవ్రంగా ఉండడం తో అమెరికాకి కూడా వెళ్ళడానికి అనుమతి లేదు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అమెరికా నుండి ఇండియా కి రావడానికి ప్రయాణికులకు అనుమతి ఇవ్వడం లేదు అని వెల్లడించింది.
 
ఒకవేళ వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకున్న కూడా అనుమతి లేనట్లు చెప్పడం జరిగింది. కాగా అమెరికా లో అన్ని దేశాల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
 
యునైటెడ్ కింగ్డమ్:

 
యూకే లో కూడా ఇండియా నుంచి ప్రయాణీకులు వెళ్ళడానికి అనుమతి లేకుండా చేశారు అయితే రూల్ ప్రకారం యూకే కి ఇండియా నుంచి ఎవరు వెళ్ళకూడదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కరోనా తగ్గుముఖం పెట్టె వరకు భారతీయులు యుకె కి వెళ్ళడానికి ఎవ్వడు గమనించండి.
 
 సింగపూర్:

 
సింగపూర్ కూడా తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే సింగపూర్ కి భారత దేశం నుంచి ఎవరు వెళ్లినా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని.... ఆ తర్వాత వారం రోజుల పాటు ఇంట్లోనే  అంటే హోమ్ క్వారంటైన్ లో ఉండాలని చెప్పింది. భారత దేశం లో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
హాంగ్ కాంగ్ :
 
హాంకాంగ్ ప్రభుత్వం ఇండియా నుండి వెళ్లే పాసింజర్స్ ని బ్యాన్ చేసింది. ఏప్రిల్ 20 నుంచి కూడా ఇక్కడికి భారతీయులని రానివ్వడం లేదు. కేవలం భారత దేశం నుండి  మాత్రమే కాదు ఫిలిపెన్స్ మరియు పాకిస్తాన్ నుండి కూడా ఏ ప్రయాణీకులకి కూడా అనుమతి ఇవ్వడం లేదు.