BREAKING NEWS

మరోసారి అండగా నిలిచిన సోనూసూద్...!

కరోనా వైరస్ మొదటి వేవ్ వచ్చినప్పుడు సోనుసూద్ ఎన్నో మంచి పనులు చేశారు. ఈ విషయం అందరికీ తెలిసినదే. సోను సూద్ ఎందరో వలస కూలీలకి సహాయం అందించారు. అదే విధంగా కార్మికులు, నిరుపేదలు ఇలా ఒకరిద్దరికి కాదు ఎంతో మందికి అండగా నిలబడ్డారు ప్రముఖ సినీ నటుడు సోనూసూద్. ఇటీవలే మరో సారి సహాయం చేసి తన మంచి మనసుని  చాటుకున్నారు.
 
సోనూసూద్ చేసే మంచి పనుల గురించి తను చేసిన సేవ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏదో ఒకసారి రెండు సార్లు సహాయం ఎవరైనా చేస్తారు. కానీ ఏ రాష్ట్రం లో, ఏ దేశం లో. ఏ గ్రామం లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సోనూసూద్ లేదు అనుకున్న సహాయం చేస్తున్నారు. ఎంత ఖర్చయినా సరే తానె భరిస్తున్నారు. ఇటువంటి గొప్ప మనిషి గురించి ఎంత చెప్పినా చాలా ఉంటుంది.
 
అయితే మరో సారి తాను సహాయం చేసి తన మంచి మనసు చాటుకున్నారు. ఒక గర్బీని  నెలలు నిండకముందే కేవలం 900 గ్రాముల బరువు తోనే శిశివుకి జన్మనిచ్చింది. ఆ తర్వాత స్టమక్ ఇన్ఫెక్షన్ తో పుట్టిన చిన్నారి ట్రీట్మెంట్ కు ఏడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అయితే బాబు కోసం ఎంత ఎంత ఖర్చు అయినా సరే పరవాలేదు నేను భరిస్తాను అని సోను సూద్ భరోసా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మరి ఇంకా  ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూడండి.
 
ఈ సంఘటన మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం వెంకట్రావుపేట లో జరిగింది. ఈ గ్రామానికి చెందిన పోతు మహేష్, లక్ష్మీ ప్రియ దంపతులు రెండు నెలల క్రిందట ఒక మగ శిశువు కి జన్మనిచ్చారు. అయితే ఇంకా నెలలు నిండక ముందే జన్మించడం తో పరిస్థితి కాస్త సీరియస్ గా ఉంది. దీనితో వాళ్ళు కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రి లో అడ్మిట్ చేసిన తర్వాత ఆమెకి సిజేరియన్ చేశారు. 900 గ్రాముల బరువుతో ఆ బాబు జన్మించాడు.
 
అయితే ఇంకా అవయవాలు ఎదగ లేదని అలానే స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల బిడ్డ బ్రతకడం కష్టమని డాక్టర్లు అన్నారు. ఇదిలా ఉంటే పదిహేను రోజుల తర్వాత బాబు ని హైదరాబాద్ రెయిన్ బో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే అక్కడ అడ్మిట్ చేసిన నాలుగు వారాలకి ఆ మగ శిశువు కాస్త కోలుకోవడం జరిగింది ఈ చికిత్స కోసం చాలా డబ్బులు అవసరం అయ్యాయి. రోజు రోజుకి బిల్లు పెరుగుతూ ఉండడం తో..... బిల్లు కాస్త 7 లక్షలకు చేరింది. అయితే పోతు మహేష్ చేతి లో డబ్బులు లేక పోయే సరికి తనకు తెలిసిన వారిని అడగడం మొదలు పెట్టాడు
 
ఎవరినైనా సాయం చేయమని మహేష్ ఎంతో బలంగా డబ్బులు కోసం ప్రయత్నం చేశాడు. అయితే కరీంనగర్ కి చెందిన ఒక వ్యక్తి ఈ పరిస్థితిని చూసి సోనుసూద్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. నిజంగా మహాత్ముడే సోనుసూద్. వెంటనే స్పందించాడు. ఆసుపత్రి బిల్లు కట్టారు. అయితే ఇది కాకుండా ఎంత కష్టమైనా సరే నేను భరిస్తాను మంచి వైద్యం బాబుకి ఇవ్వాలని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో బాబు కి ట్రీట్మెంట్ జరుగుతోంది.
 
 ఇలా మెరుగైన ట్రీట్మెంట్ అందడం తో బాబు 300 గ్రాములు బరువు పెరిగాడు. అదే విధంగా ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతోంది అని తెలుస్తోంది. ప్రస్తుతం డాక్టర్లు తల్లి పాలు కూడా ఇవ్వొచ్చు అని  చెప్పారు. అయితే ఈ చికిత్స లో ఇప్పటికే 13 లక్షలు ఖర్చు అయింది.
 
ఎంతో మంచి మనసు తో సోను సూద్ సహాయం చేశారు. నిజంగా ఇంత మంచి మనసు ఎవరికి ఉంటుంది...? ఇంత ఉదారత్వం తో మంచి పనికి సోనుసూద్ అండగా నిలబడ్డారు. కరీంనగర్ లో ఆస్పత్రి లో ఉన్న బాబు పరిస్థితి ఎలా ఉంది అని మహేష్ ఫ్రెండ్ ఫోన్ కి రెండు సార్లు కూడా సోను సూద్  ఫోన్ చేసి పరిస్థితి కోసం కనుక్కుక్కోవడం జరిగింది.
 
గతం లో కూడా సోనూ సూద్ ఎన్నో మంచి పనులు చేశారు. రీల్  లైఫ్ లో విలన్ గా చేసిన సోనూ సూద్ ని రియల్ లైఫ్ లో హీరో గారు మనం చూడొచ్చు. ఎంతో గొప్ప పని కి సోను సూద్ అండగా నిలబడ్డాడు. మంచి పనులు చేయడం సోను సూద్ కి  కొత్తేమి కాదు. 
 
చక్కటి మంచి మనసు తో ఏ క్షణాన ఏ ఇబ్బంది ఎవ్వరికి ఉన్నా తాను ఉన్నానని సహాయం అందిస్తాడు. ఇటువంటి వాళ్లని నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి. చాలా మంది ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. సోనూసూద్ ఇలాంటి మంచి మనుషులు నూటికో కోటికో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు.