BREAKING NEWS

సరైన జీవన విధానం లేకపోతే కరోనా వల్ల మరణించే రిస్క్ ఎక్కువగా ఉంది...!

కరోనా వైరస్ మొదటి వేవ్ వెళ్లి  పోయింది కదా అనుకుంటే ఇప్పుడు రెండవ వేవ్ అందరిని ఇబ్బందులకు గురి చేస్తోంది. కరోనా మహమ్మారి అయ్యి అందర్నీ పట్టి పీడిస్తోంది. నిజంగా అనేక మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. పైగా క్రమంగా కేసులు కూడా పెరిగిపోతున్నాయి. రోజు రోజు కి లక్షలు కేసులు నమోదు అవుతున్నాయి అంటే మామూలు విషయమా..? ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
 
ఏది ఏమైనా ఈ వైరస్ బారిన పడకుండా ఉండటానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే బయటకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండటం మంచిది రోజు రోజుకీ కరోనా తీవ్రత విజృంభిస్తోంది. దీనితో దీని నుంచి బయట పడడానికి దారి లేదు కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవకుండా ఉండడానికి కొన్ని టిప్స్ పాటిస్తే కాస్తో కూస్తో దీని నుండి  బయట పడడానికి వీలు అవుతుంది. లేదు అంటే ఈ వైరస్ బారిన పడి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. 
 
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలి అంటే ఈ తప్పులు చేయొద్దు...!
 
కరోనా మీకు  సోకకుండా ఉండాలంటే ఈ ప్రదేశాలకు వెళ్ళద్దు. సూపర్ మార్కెట్ కి వెళ్లి కూరగాయలు, కిరాణా సామాన్లు తెచ్చుకోవడం మానేయండి. ఇంటి పట్టునే ఉండి ఆన్లైన్లో గ్రోసరీ షాపింగ్ చేయడం మంచి పద్ధతి.
 
అలానే మార్కెట్ కి వెళ్లడం, మాల్ కి వెళ్లడం లాంటివి చేయొద్దు. ఎందుకు అంటే అక్కడ వందల్లో జనం వస్తుంటారు. దీని కారణంగా కరోనా తీవ్రంగా వ్యాపించే ప్రమాదం ఉంది.
 
అదే విధంగా ఇప్పుడు వేసవి కాలం వచ్చింది. వేసవిలో చాలామంది హిల్ స్టేషన్ కి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా అటువంటి ప్లాన్స్ ఏమైనా చేసుకున్నారు అంటే వాటిని మానేయడం మంచిది.
 
అలానే సాయంత్రం పూట సరదాగా పార్టీ కి వెళ్లడం లేదా పిల్లలతో కలిపి ప్లే గ్రౌండ్ కి వెళ్లడం లాంటివి కూడా మానేయండి. కొద్ది రోజుల పాటు జిమ్ కి వెళ్లడం, పార్టీలకు వెళ్లడం కూడా మానేయడం మంచిది ఇలా చేయడం వల్ల మీరు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి వీలవుతుంది.
 
ఫిజికల్ యాక్టివిటీ:
 
ఇప్పటి వరకు చాలా అధ్యయనాలు చేశారు. అయితే వాటిలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ముఖ్యం అని తేలింది, వ్యాయామం చేయక పోతే లక్షణాలు మరింత ఎక్కువ అవుతాయని దీని వల్ల మరణించే రిస్కు కూడా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
 
 వ్యాయామం చేయడం చాలా ముఖ్యం:
 
అయితే రీసర్చ్ ప్రకారం నిపుణులు ఫిజికల్ యాక్టివిటీ చేయడం చాలా ముఖ్యమని వెల్లడించారు వ్యాయామం చేయకపోవడం వల్ల రిస్కు మరింత ఎక్కువ అవుతుంది అని అన్నారు. వ్యాయామం చేయక పోతే హైపర్ టెన్షన్ మరియు ఒబేసిటీ కూడా వస్తుందని చెప్పారు. నిజంగా జీవన విధానం కారణంగా కరోనా వలన రిస్క్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సరైన లైఫ్ స్టైల్  మెయింటెన్ చేయడం ముఖ్యం.
 
సరైన లైఫ్ స్టైల్ మీరు పాటించకపోతే దీని వల్ల కలిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని రోజుకి 35 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. దీని వల్ల మీకు ప్రమాదం తగ్గుతుంది.
 
రోగనిరోధక శక్తి ఎలా పెంపొందించుకోవాలి...?
 
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలి అన్నా... ఒకవేళ కరోనా బారిన పడి బయటపడాలి అన్నా రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అంటే..?
 
 సరైన డైట్ తీసుకోవాలి:
 
సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీ డైట్లో బ్రోకలీ, పాలకూర, పుట్టగొడుగులు, టమాటా వంటివి తీసుకోవాలి. అదే విధంగా ఎక్కువ ప్రోటీన్స్ ను తీసుకోవడం మంచిది. కార్బోహైడ్రేట్స్ మీ డైట్ లో తక్కువగా ఉండేటట్లు చూసుకోండి. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ మరియు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా మేలు చేస్తాయి.
 
 మీరు తినే ఆహార పదార్థాల లో ఉసిరి, పసుపు, అల్లం, వెల్లుల్లి, తులసి ఆకులు, నల్ల జీలకర్ర ఎక్కువగా ఉపయోగించండి. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది మరియు మీ ఇమ్మ్యూనిటి కూడా పెరుగుతుంది.
 
వ్యాయామం:
 
నిజంగా వ్యాయామం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. రోజుకి కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఉత్తమం. వ్యాయామం చేయడం వల్ల మెటబాలిజంను పెంపొందించుకోవడానికి వీలవుతుంది. అంతే కాదండి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది వ్యాయామం ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. బ్రీతింగ్ కి సంబందించిన వ్యాయామాలు,  సూర్యనమస్కారాలు, ప్రాణాయామం, శవాసనం ఇటువంటి యోగా ఆసనాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. కనుక వీటిని అనుసరించి కరోనా రిస్క్ నుండి బయట పడండి.