BREAKING NEWS

సాహసం చేయరా డింభకా 2

సాహసమే ఊపిరిగా... అడ్వెంచర్స్ చేయాలి అనుకునేవారికి ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది మన సిటీ ఆఫ్ డెస్టినీ... ఒక పక్క సాహసోపేతంగా అనిపిస్తుంది. మరో వైపు హ్యాపీగా ఎంజాయ్ కూడా చేయచ్చు.  అదే మన స్మార్ట్ సిటీ ప్రత్యేకత... రారమ్మంటూ ఆహ్లాదాన్ని పంచుతాయి ఇక్కడి పర్యాటక ప్రదేశాలు. అరకులో కటిక వాటర్ ఫాల్స్ తర్వాత అదే ఫీల్ కంటిన్యూ చేయాలనుకుంటే విశాఖ జిల్లాలోని మరో అద్భుత వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి...

                        చింతపల్లి.... నర్సీపట్నం కు దగ్గరలో ఉన్న ఈ ప్రాంతంలోనే మరో సుందరమైన వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తాయి. అయితే ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉన్నట్లు చాలా మందికి తెలియదు. కటిక వాటర్ ఫాల్స్ కి లభించిన ఆదరణ దీనికి దొరకలేదు. నర్సీపట్నం నుంచి చింతపల్లి అదేనండి సిలేరు ఘాట్ రోడ్డు లో అమ్మవారి గుడి దగ్గర ఆగాలి. అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రయాణం సాగించాలి... గుడికి చేరువలోనే ఒక చిన్న దారి లోయ లోపలకి వెళ్తూ కనిపిస్తుంది... ఆ దారిలో సుమారు 300 అడుగుల లోతు లోయలోకి నడవాలి... చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు వినిపిస్తూ సందడిగా ఉంటుంది వాతావరణం...

వాటర్ ఫాల్స్ కు దగ్గరవుతున్న కొద్ది  ఏదో తెలియని ఉత్సాహం... ఆనందం  ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి..  అన్ని వందల అడుగుల లోతులో దిగి వచ్చిన కష్టం , అలసట మొత్తం ఇట్టే మాయం అయిపోతాయి... ఇక్కడ మరో ప్లస్ పాయింట్ కూడా ఉంది. కటిక వాటర్ ఫాల్స్ లాగా ఎంజాయ్ చేయకుండా లేదు. హాపీగా కావలసినంత సేపు ఎంజాయ్ చేయచ్చు. ఇక్కడ కూడా చీకటి పడే లోగా తిరిగి వచ్చేయాలి... ఈ దారి కూడా కాస్త అడ్వెంచర్ గా అనిపించినా కటిక వాటర్ ఫాల్స్ లాంటి రిస్కీ ప్రాంతం అయితే కాదు. కానీ ఆ ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళని... మిమ్మల్ని గైడ్ చేయడానికి మీతో పాటు తీసుకెళ్లడం మరచిపోవద్దు...

                  సాహసం.. చేయడం కరెక్ట్... పర్వాలేదు. కానీ దానికి తగినట్లుగా రక్షణ చర్యలు కూడా ముందుగానే తీసుకోవాలి.. మెడికల్ కిట్, మంచి నీళ్ళు, స్నాక్స్ లాంటివి అన్నీ ముందుగానే చెక్ చేసుకోవాలి... ఎందుకంటే మీరు వెళ్ళే ప్రాంతాల్లో ఏమీ దొరికే పరిస్థితి ఉండదు... కాబట్టి బయలుదేరే ముందు ఒకటికి పది సార్లు చెక్ చేసుకోండి.. 

Photo Gallery