BREAKING NEWS

సినిమాలు - రివ్యూలు

రివ్యూ... ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్న పదం... మనం ఆన్లైన్ లో ఏ వస్తువు కొనాలి అన్నా రేటింగ్ లు , రివ్యూలు చూసి గానీ కొనము... రివ్యూలు బాగుంటే కొంటాం... లేదా మానేస్తాం. ఇప్పుడు ఈ రివ్యూలు సినిమాలపై ఎక్కువగా పడుతోంది. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయితే చాలు... వెంటనే రెడీ అయిపోతారు రివ్యూ రాయడానికి. అసలు ఈ రివ్యూలు గోల ఏంటి? సినిమాకు ప్లస్? మైనస్?? అవుతుందా... ఓసారి చూద్దాం..

ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ కు రివ్యూ లు రాయడం తేలికైన విషయం... కొన్ని రోజులు ఆ వస్తువు వాడి దాని గురించి చెప్తాం... ఆ కొన్ని రోజుల్లో అది పనిచేసిన తీరుని బట్టి రివ్యూ ఇస్తాం. కానీ 2½ గంటల సినిమాకు నిమిషాల్లో రివ్యూ ఎలా ఇస్తారు. రివ్యూ రాసేవారు ఏం ఆశించి రాస్తున్నారు. ప్రొడక్ట్ గురించి అయినా, సినిమా అయినా రాసే రివ్యూ కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. అదే రివ్యులను మొత్తం అందరికీ ఆపాదించడం సరికాదు.. కానీ ఇప్పుడు ఆన్లైన్ లో వస్తున్న చాలా సినిమాల రివ్యూలు ఏక పక్షంగా రాస్తూ మొత్తం ప్రేక్షకుల అభిప్రాయం ఇదే అన్న రేంజ్ లో రాసేస్తున్నారు.

ఉదాహరణకు తాజాగా రిలీజ్ అయిన మహర్షి రివ్యూ.. ఓ వెబ్సైట్ లో చాలా దారుణంగా రివ్యూ రాశారు. " ఓయ్ మహేషూ .. బాబు మహేష్ .. ఈ కాన్సెప్ట్ రాసినందుకు డైరెక్టర్ కు మొక్కాలి" అంటూ వ్యంగ్యంగా రాశారు. రివ్యూ రాసేముందు సినిమా ఏంటి? హీరో ఎవరు అనే విషయాలు తెలుసుకుని రాయండి. అలాగే రివ్యూ రాసే భాష తెలుసుకోండి ముందు. ఆ తర్వాత రివ్యూ రాయచ్చు.

రివ్యూలు ఎవరు ఎన్ని రాసినా తుది నిర్ణయం మాత్రం ప్రేక్షకుడిదే....
ఆ సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు ఆ ప్రేక్షకుడికి ఉంటుంది. కానీ ఇలాంటి రివ్యూలు వలన సినిమా కలెక్షన్లు కాస్త దెబ్బ తినే అవకాశం ఉంది. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి , ఎంతో కాలం కష్టపడి తీసిన సినిమాని సింపుల్ గా ఓ నాలుగు ముక్కలు రివ్యూ రాసి పడేస్తారు. కథ గురించి మాత్రమే కాదు. డైరెక్షన్, పాటలు, మ్యూజిక్ ఇలా 24 క్రాఫ్ట్స్ గురించి వివరంగా రాసేస్తారు. మరికొంత మంది సినిమా లో వుండగానే రివ్యూ రాస్తారు. అసలు సినిమాలు చూస్తారో లేదా రివ్యూలు మాత్రమే రాస్తారో అర్థం కాదు...

ఎవరు ఎన్ని మన్న... కానీ సినిమా తీయడం మాత్రం అస్సలు చేతకాదు. ఒక్కటి గుర్తుంచుకోండి.. రివ్యూలు రాయడం మానేయండి. సినిమాని చూసి ఎంజాయ్ చేద్దాం.   మీరు ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు ఏదైనా బాలేదు అంటే ఎంత బాధగా ఉంటుంది. అలాగే రివ్యూ రైటర్స్  కూడా అలోచించి రివ్యూ రాయండి... .
 
 

Photo Gallery