BREAKING NEWS

ఈవెంట్స్ - నో టెన్షన్...

               బిజీ బిజీ రోజులు... సరిగ్గా భోజనం చేయడానికి కూడా సమయం లేని స్పీడ్ యుగంలో బ్రతికేస్తున్నాం... అలా అని పెళ్లి, పుట్టిన రోజు లాంటి ముఖ్యమైన ఫంక్షన్లు మానేయలేం కదా. ఫంక్షన్ ఏదైనా దాని ముందు కొన్ని రోజుల నుంచి ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ ఈ బిజీ లైఫ్ లో అన్ని రోజుల సమయం ఎక్కడ దొరుకుతుంది... సరిగ్గా ఆ ఫంక్షన్ రోజు ఇంకా బిజీ అయితే ఒక గంట పర్మిషన్ మాత్రమే దొరుకుతుంది.. మరి ఏర్పాట్ల సంగతి ఏంటి??? 
                   అరవై ఏళ్ళ క్రితం... ఓ ఊర్లో రాఘవయ్య గారింట్లో పెళ్లి.

బంధువులు సంఖ్య కూడా ఎక్కువే... ఒక్క పిలుపు చాలు... పెళ్లికి ఒక రెండు మూడు రోజుల ముందు నుంచే బంధువులు అందరూ ఇంటికి వచ్చేశారు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.... ఎలా అంటూ అనుకునే లోపే బంధువులందరూ తలో చెయ్యి వేశారు. రెండు రోజుల్లో పూర్తవ్వాల్సిన పని ఒక్క రోజులోనే పూర్తయ్యింది.. అందరూ దగ్గరుండి మరీ కార్యక్రమం కానిచ్చేశారు... అంతా శుభం. ఇది గతం... ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పుకున్నాం .. ఇంకో ఉదాహరణ చూద్దాం.

                      చరణ్ పెళ్లి... బంధుమిత్రులు 
ఓకే. కానీ ఎవరెవరు... ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తెలియదు... సరిగ్గా పెళ్లి రోజు, ముహూర్త సమయానికి దిగుతారు. నాలుగు అక్షింతలు వేసేసి, భోజనం చేసి వెళ్ళిపోతారు. ఇక ఫ్రెండ్స్ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. బంధువులూ అందుబాటులో లేక ఫ్రెండ్స్ కూడా రాకపోతే పెళ్లికి ఏర్పాట్లు ఎలా... చరణ్ లో ఒకటే టెన్షన్.. ఏం చేయాలి? కష్టమే.

                 అయినా డోన్ట్‌ వర్రీ అంటున్నారు ఈవెంట్‌ మేనేజర్లు. పెళ్లయినా, బర్డ్‌డే ఫంక్షనైనా... చివరికి బారసాలయినా... కార్యక్రమం ఏదైనా, ఏ లెవెల్ లో అయినా "మేమున్నాం" అంటున్నారు ఈవెంట్ మేనేజర్లు.. ఏ కార్యక్రమం చేయాలో ఆలోచిస్తే చాలు... దాన్ని కార్యరూపంలోకి మార్చడం అంతా తమ భుజాల మీద వేసుకుంటారు.... 

అంతే కాదు... ఆ శుభకార్యానికి అవనరమైన అన్ని ఏర్పాట్లనూ వాళ్లే చేసుకుని సమన్వయంతో సక్సెస్‌ చేస్తున్నారు. జస్ట్‌, ఆ రోజు అనుకున్న వేళకు మీరు కార్యక్రమానికి వెళ్లి ఫొటోలకు ఫోజులు ఇస్తే చాలు...  ఈ స్పీడ్ యుగంలో బిజీగా లేనిదెవరు? కానీ ఎవరెంత బిజీగా ఉన్నా జీవితంలో కొన్ని నంఘటనలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే కదా, పెళ్లిళ్లు, పుట్టిన రోజుల వంటి గుర్తుండిపోయే ఘట్టాలను తీసీపడేయలేం
కదా. కానీ సంబరంగా కార్యక్రమాలు జరుపుకోవాలి అంటేనే ఎన్నో ఇబ్బందులు..  ఇలాంటి నందర్భాల్లోనే రంగప్రవేశం చేస్తారు ఈవెంట్‌ మేనేజర్లు. ఇళ్లల్లో ఫంక్షన్లు మాత్రమే కాదు... కాలేజ్/స్కూల్ ఈవెంట్‌ ల దగ్గర నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈవెంట్స్‌ వరకు....కార్పొరేట్‌ కాన్ఫరెన్స్‌ నుంచి నుంచి ప్రోడక్ట్‌ మార్కెటింగ్‌ వరకు దేనికైనా రెడీ అంటున్నారు.  

                  ఈ రోజుల్లో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ బాగా పాపులర్‌ అయిన ప్రొఫెషన్‌. రకరకాల రంగాలకు చెందిన వారిని ఒకే దగ్గరికి తీసుకొచ్చి కార్యక్రమాన్ని ఆశించిన స్థాయిలో అందంగా నిర్వహించడానికి దాదాపుగా అన్ని నగరాలలో వివిధ సంస్థలు పేరుపడ్డాయి. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఎంబీఏలో ఓ సబ్జెక్ట్‌ అంటే అది ఎంత ప్రాచుర్యం ఉన్న అంశమో చెప్పొచ్చు.

Photo Gallery