BREAKING NEWS

ప్రమోషన్ కాల్స్ తో పెద్ద తల నొప్పి

              ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ సెల్ ఫోన్ తప్పనిసరిగా వాడడం తెలిసిందే. జేబులో ఉండాల్సిన పర్సైనా మరచిపోతామేమో కానీ ఈ ఫోన్ మాత్రం అసలు మరచిపోము. మరచిపోలేము. అంతలా మన జీవితంలో ఒక భాగమైంది.

చాలా మంది స్మార్ట్ ఫోన్ లు వాడుతూ ఉంటే ఆ బాధలు పడలేని చాలా తక్కువ మంది మాత్రం ఏదో సమాచార నిమిత్తం బేసిక్ మోడల్ ఫోన్ లు ఇంకా వాడుతూ ఉన్నారు. అదే కాకుండా పెద్ద పెద్ద స్క్రీన్ లు గట్రా ఉన్న ఫోన్లు ఛార్జింగ్ తొందర తొందరగా అయిపోవడంతో అవి వాడుతున్న కుర్రకారు కూడా ఓ బేసిక్ మోడల్ ఫోన్లో ఓ సిమ్ కార్డు పడేసుకుంటున్నారు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా , ఫోన్లు వాటి పని అవి చేసుకుపోతాయి. ఈ సమయం ఆ సమయం అని లేకుండా సర్వకాల సర్వావస్తల యందు ఫోన్ ఉండాలసిందే..

రెండు ఫోన్లులో మొత్తం 4 సిమ్ లు వాడుతారు. ఇక వీటికి వాయిస్ కాల్స్ , వాట్సాప్ కాల్స్ , టెక్స్ట్ మెసేజ్ లు, వాట్సాప్ మెసేజ్ లు , ప్రభుత్వ సమాచారాలు , ప్రవైట్ సమాచారాలు , బహుమతుల వివరాలు , లాటరీ విశేషాలు , బ్రేకింగ్ న్యూస్ లు , సర్వేలు ఇలా ఒకటేమిటి అన్ని క్షణం క్షణం ఫోన్ మ్రోగుతూనే ఉంటుంది. ఇవే గాక రాంగ్ కాల్స్. 

         మంచి బిజీగా ఉన్న సమయంలో ఏదో కాల్ వస్తుంది. ఆతృతగా లిఫ్ట్ చేస్తే అది రాంగ్ కాల్. అలా అని వచ్చిన కాల్ ని నిర్లక్ష్యం చెయ్యలేము కదా... ఇవన్నీ ఒక ఎత్తు అయితే ... అర్జెంట్ మీటింగ్ లో ఉన్నప్పుడు వచ్చిన కాల్ ని ఎటెండ్ అయితే ,,మీకు చవగ్గా విమానాశ్రయం ప్రక్కన స్థలం కావాలా ?? అతి తక్కువ ఫీజ్ కే MBBS లో సీట్ కావాలా ?మలేషియా,సింగపూర్ ట్రిప్పులు కేవలం వెయ్యి రూపాయలకే ఎంజాయ్ చెయ్యండి ... 50 వేల విలువ చేసే వస్తువు ఈ రోజు మీరు  కేవలం 100 రూపాయలకే పొందండి... లాంటివి ఎన్నో ఎన్నెన్నో ..

అసలు వారికి మన నెంబర్ ఎలా తెలుస్తుంది ? మన ఫోన్ కి ఫోన్ చేసి కోటి రూపాయలు గెలుచుకున్నారు.. మీ ఫోన్ నెంబర్ చెప్పండి , మీ పేరు , అడ్రెస్ చెప్పండి అంటారు. మన నెంబర్ కే చేసి మళ్ళీ మనల్ని నెంబర్ అడగడం ఏంటో ..??
మరోసారి బ్యాంక్ మేనేజర్ పేరుతో ఫోన్ వస్తుంది. మీ ATM కార్డు ఎక్స్పైర్ అయిపోయింది , మీ కార్డు నెంబర్ , పిన్ నెంబర్ చెప్పండి అంటారు. ఎంత చదువుకున్నవారైనా , పెద్ద ఉద్యోగస్తులైనా , ఎంత తెలివైనవారయినా ఒక్కోసారి వారు అడిగిన రహస్య వివరాలు చెప్పేయడం , మోసపోవడం జరుగుతోంది...

            అసలు మన నెంబర్స్ ఆ మోసగాళ్ల చేతుల్లోకి ఎలా వెళ్తున్నాయి ?? వారికి ఎవరు ఇస్తున్నారు ? దీనికి ట్రాయ్ బాధ్యత వహించదా?? మనం ఏదైనా ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు లక్కీ డ్రా ఉందంటూ మన వివరాలు రాసి బాక్స్ లో వేయాలని ఓ కూపన్ ఇస్తారు. అలా ఎప్పుడో అప్పుడు ఫిల్ చేసే ఉంటాం...

ఏదైనా యాప్ లో మన నెంబర్ ఎంటర్ చేసి ఉంటాం... లేదా రీఛార్జ్ కోసం సెల్ షాప్ లో చెప్తున్నాం... ఇలా ఎక్కడ నుంచైనా ఆయా కంపెనీలు డబ్బులిచ్చి కొనుక్కుంటున్నాయి. నిజానికి ఇలా మన వ్యక్తిగత డేటా అమ్మడం నేరం. కానీ అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.. లేకపోతే మన పేరు గాని, ఊరు గాని తెలియకుండా అసలు ఇక ఫోన్ చేస్తారు. సో ... బీ కేర్ ఫుల్.  ఎలాంటి సందర్భంలో కూడా మన ఫోన్ నెంబర్లను ఎక్కడా రాయద్దు....

                  కనీసం ఎవరికి ఫోన్ చేస్తున్నాం అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు..  జిల్లా కలెక్టర్ లాంటి అత్యున్నత స్థాయి ఉన్నతాధికారులు కూడా భాదితులుగా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.... ఇలాంటి సంస్థలకు ప్రజల ఫోన్ నెంబర్ లు ఎవరు ఇస్తున్నారు అనేది ట్రాయ్ కనిపెట్టాలి. అనవసరమైన ప్రమోషన్ కాల్స్ , ఫేక్ కాల్స్ , సర్వే కాల్స్ లాంటిని నియంత్రంచి ప్రజల ఆస్తులను , ఆరోగ్యాలను , విలువైన సమయాన్ని కాపాడాల్సిన బాధ్యత ట్రాయ్ పై ఉన్నది...
 

Photo Gallery