BREAKING NEWS

సినిమా - కెమెరాలు

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం...మనల్ని ఊహా ప్రపంచంలో అలా విహరింప జేసే అద్భుత వినోద సాధనం. అందుకే సిటీలో యూత్‌ పెద్ద తెరపై కలలు పండించుకోవడానికి ముందు చిన్న చిన్న అడుగులు వేస్తున్నారు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు..

మెయిన్‌ స్ట్రీమ్ సినిమాలకు షార్ట్‌కట్‌ ఈ షార్ట్‌ ఫలింస్‌. గతంలో కన్నా ఇప్పుడు డిజిటల్‌ కెమెరాలు వచ్చాక వీరి పని చాలా సులువైంది. టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో టాలెంట్ ఉన్న యువత కి మంచి మంచి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నాలజీ అందిపుచ్చుకుని దూసుకుపోతున్నారు.   ఇది వరకు సినిమాలను ఫిల్మ్‌ ఉపయోగించి తీసేవారు. దాని వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఫిలిం రీల్‌ కెమెరా గురించి , డిజిటల్‌ కెమెరా గురించి, షార్ట్‌ ఫిలిం మేకర్స్‌ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓ సారి చూద్దాం.... 

                   ఇప్పుడున్న డిజిటల్‌ కెమెరాల సామర్థ్యం 4K వరకు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సామర్ధ్యం 8k  వరకు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే నాణ్యత విషయంలో మాత్రం కొంత తేడా కచ్చితంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు..  ఫిలింతో తీసే సినిమా కన్నా డిజిటల్ ఫార్మాట్ లో తీసే సినిమాలు నాణ్యత కొంత తక్కువగానే ఉంటుంది. ఫిలింతో తీస్తే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది... నాణ్యత ఎక్కువ ఉన్నా ఫిలిం వలన నష్టాలు కూడా ఉన్నాయి. ఫిలిం ఫార్మెట్‌ కెమెరాలో మనం ప్రివ్యూను డైరెక్ట్‌గా చూడలేం.

అన్‌లాగ్‌ ఫార్మాట్‌లో ఉంటుంది. దాన్ని ల్యాబ్‌కు తీసుకెల్లి డెవలప్‌ చేస్తే నెగిటివ్‌ వస్తుంది. దాన్ని మళ్లీ ప్రింట్‌ చేయాలి. అప్పుడు మాత్రమే చూడగలం. అప్పటి వరకు ఆ షాట్ సరిగ్గా వచ్చిందో లేదో కూడా తెలియదు. పైగా ఈ ఫిలిం రీయూజ్‌బుల్‌ కూడా కాదు. ఒకసారి ఎక్స్‌పోజ్‌ చేయగానే అది రెండోసారి వాడడానికి పనికి రాదు. డిజిటల్‌లో అయితే ఇవన్నీ కూడా ఇన్‌స్టంట్‌గా ఉంటాయి. అలాగే డిజిటల్‌తో పోలిస్తే ఫిలింకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి.

కాస్త ఓపిగ్గా చేయాలి గానీ ఫిలింలో వచ్చిన క్వాలిటీ  డిజిటల్‌లో రాదు. ఇప్పుడున్న డిజిటల్‌ కెమెరాలతో తీసినా ఫిలిం క్వాలిటీ కి దగ్గరగా వెళ్తున్నాం కానీ ఫిలింతో
సమానంగా మాత్రం కావడం లేదు. కానీ ఇప్పుడు ఫిలింలు ఎవరూ ఉపయోగించడం లేదు.... అంతా డిజిటల్‌...డిజిటల్‌...

                 ప్రస్తుతం రాష్ట్రంలో చాలా మంది షార్ట్‌ఫిలింస్‌ తీస్తున్నారు. దాదాపుగా అందరూ కాలేజీ స్టూడెంట్స్‌...  కాబట్టి రెడ్‌ కెమెరాలు లాంటి ప్రొఫెషనల్‌ కెమెరాలు వాడడం కష్టమే. అందుకే అలాంటి వారి కోసమే వివిధ కంపెనీలు హెచ్‌డీ కెమెరాలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. బిగ్‌ స్ర్కీన్‌ రెజల్యూషన్‌కు కనీసం 2K ఉండాలి. అయితే హెచ్‌డీ కెమెరాలు క్వాలిటీ 2K కన్నా తక్కువగానే ఉంటాయి. కానీ షార్ట్‌ ఫిల్మ్స్ కు చాలా బాగుంటాయి. ఇక ప్రముఖ కంపెనీ కెనాన్‌లో 5డి , 7డి లాంటి డి.ఎస్.ఎల్.ఆర్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. సోనీలో కొన్ని హెచ్‌డీ కెమెరాలు షార్ట్‌ ఫిలింస్‌కు బాగుంటాయి,..

ఇప్పుడొస్తున్న కొన్ని మొబైల్స్‌లో కూడా హెచ్‌ డి కెమెరాలు వస్తున్నాయి. కొంత మంది యువకులు మొబైల్ తో షార్ట్ ఫిల్మ్స్ తీసి మంచి పేరు తెచ్చుకున్నారు కూడా...   అలాగే వైడ్‌ యాంగిల్‌ను ఒకేసారి షూట్‌ చేయడానికి గో ప్రో కెమెరా చాలా ఉపయోగపడుతుంది. ఇది వాటర్‌ ప్రూఫ్‌ కూడా...     షార్ట్‌ఫిలిం అయినా, మెయిన్‌ స్ట్రీమ్
సినిమా అయినా... ఏ కెమెరాతో షూట్‌ చేసినా ఎడిటింగ్‌ ముఖ్యం. మనం సినిమా ఎలా తీసినా ఎడిటింగ్‌లో బాగా కనిపించేలా
చేయచ్చు.

ఉదాహరణకు మార్కెట్‌లో చూస్తే కూరగాయలు మూటలు గందరగోళంగా పడేసి ఉంటాయి. అదే ఒక షాప్‌లోకి వచ్చేసరికి అందంగా, ఆకర్షనీయంగా సర్దుతారు. అదే విధంగా ఎడిటింగ్‌లో కూడా షూట్‌ చేసిన రా సీన్స్‌ను
అందంగా సీన్‌ బై సీన్‌ అరేంజ్‌ చేసుకోవాలి. అందులో కంటిన్యుటీ మిస్‌ అవ్వకూడదు. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. డిసాల్వ్‌, వైప్స్‌, ఫ్రీజింగ్‌ ఎఫెక్ట్స్‌ ఇవన్నీ '.

కూడా సినిమాకు అదనపు ఆకర్షణ తీసుకొస్తాయి. 
       పాత తరంలో ఒక ఫొటో తీయాలి అంటే చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఒక్క సెకండ్ లో ఫోటో క్లిక్ చేసేయొచ్చు... కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది... సింగిల్ క్లిక్ తో అద్భుతమైన ఫోటోలు తీసేయచ్చు. ఫ్యూచర్ లో మరింత టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కి మరింత ఈజీ అయిపోతుంది వారి టాలెంట్ చూపించడానికి...

Photo Gallery