BREAKING NEWS

గెలుపోటములు సహజం ... అవి దైవాదీనం ....!!!

ఎన్నికలలో  ఓడిపోయిన ప్రతి వ్యక్తి ,  ప్రతి పార్టీ  , ప్రతిసారి చెప్పే అతి సాధారణమైన డైలాగ్ ఇది  ....
కానీ  , అలా అని ఎన్నికల ముందు ఎదో సాదాసీదాగా
ప్రచారం చేసేసి ఊరుకోరు కదా !!!
ఓటమి చెందితే ఇక జీవితమే లేనట్లుగా , అధికారం దక్కకపోతే ఆత్మే పోయినట్లుగా , ఎలాగైనా గెలిచి తీరాలి అన్న తాపత్రయంతో  ప్రత్యర్థులను  ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారు.రకరకాల అభియోగాలను మోపుతున్నారు.

వారు చెప్పే మాటలు ప్రజలు నమ్ముతున్నారా ?? లేదా ?? అని కూడా ఆలోచించడంలేదు .  పూర్వం అయితే ఎన్నికల వేళ మాత్రమే ప్రచారాలు ఉండేవి . అది కూడా ప్రతిపక్షపార్టీ పేరు  గానీ , ఆ పార్టీ వ్యక్తుల పేరు గానీ ప్రస్తావించకుండా  కేవలం ఆ పార్టీ చేసిన తప్పులను మాత్రమే  ప్రస్తావిస్తూ  ,,, 
 అంతకంటే   ఎక్కువగా ,,  తమ పార్టీ ఇంతవరకూ ప్రజలకోసం ఏం చేసింది ??   అధికారంలోకి  వస్తే ,,  ప్రజలకు ఇంకా ఏం చేస్తారు ??
లాంటి విషయాలు మాత్రమే చెప్పి ఓట్లు అడిగేవారు.
కానీ ... ఇదంతా  గతం ...

ఇప్పుడు   అన్ని పార్టీల ప్రచారశైలి  పూర్తిగా మారిపోయింది.  తాము ఇప్పటివరకూ ప్రజలకోసం చేసింది  ఏమిటి ??  తమని గెలిపిస్తే ఏంచేస్తారు ??
లాంటివి మచ్చుకైనా చెప్పకుండా ,,,,
కేవలం ప్రతిపక్షపార్టీలను , నాయకులను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు.నాయకుల వ్యక్తిగత జీవితాలను సైతం బహిర్గతం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా నాయకుల తల్లితండ్రులను సమీప బంధువులను  కూడా వదలడం లేదు.

కాళ్లకు కత్తులు కట్టిన పందెం కోడి పుంజుల మాదిరిగా ఒకరిని తుదముట్టించాలని ఒకరు చూస్తున్నారు. వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని ఎవరూ వదులుకోడానికి సిద్ధంగా లేరు.
అధికారపార్టీది అధికారదుర్వినియోగమైతే ...
ప్రతిపక్షానిది అరాచక రాజకీయం ... 
కానీ ఓటర్లు అన్నీ గమనిస్తున్నారు ...
వాల్లెప్పుడూ తెలివైనవారే !!!
ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా వాత పెట్టాలో  అలా పెట్టేస్తారు.. 
ఇక ,,,
మొన్న  జరిగిన ఎన్నికల విషయానికి వస్తే ..
గెలుపు కోసం ప్రాణాలు ఓడ్డేసారు ..
అనూహ్యంగా ప్రతిపక్షపార్టీ  అఖండవిజయం సొంతం చేసుకుంది . అధికారపార్టీ  ఘోర పరాజయాన్ని  చవి చూసింది.
ఇక్కడే .. అసలు చర్చ మొదలయ్యింది.

ఓడిపోతే పోయాము కానీ ఇంత వ్యతిరేఖత మాపై ఉందా ?? అన్నది ఓడిన పార్టీ  అంతర్మధనం.
యస్ ... ఖచ్చితంగా  ఈ ఘోర పరాజయం పై నిర్మొహమాటంగా ,, నిక్కచ్చిగా  పోస్టుమార్టం చేసుకుని తీరాలి ..  అప్పుడే  ..
 రానున్న ఎన్నికలకలలో కనీసం  పోటీ ఇవ్వగలుస్తుంది.
 లేదంటే ,,, 
 పోటీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుందంటే  అతిశయోక్తి  కాదు..
  ఏ పార్టీకైనా బలమైన కేడర్ అవసరం. వారి బాగోగులు చూసుకుంటూ ఎప్పటికప్పుడు  వారికి దిశానిర్దేశం చేస్తూ వారితో మమేకం  కావాలి. పార్టీని అంతర్గతంగా పటిిష్టపరుస్తూ  , గ్రూపులు లేకుండా , ఇగో సమస్యలు రాకుండా అందరినీ కలుపుకుపోయే ముఖ్యనాయకుడు పార్టీకి అత్యవసరం. అదే సమయంలో ఆ నాయకుడికి ఆ పార్టీ అధ్యక్షుడి దగ్గర  తగిన గుర్తింపు , పలుకుబడి ఉండితీరాలి. ఆ నాయకుడు చెప్పిన దానిని  ఆ పార్టీ అధ్యక్షుడు తు.చ. తప్పకుండా ఆచరించాలి.

అప్పుడే ఆ నాయకుడి మీద కేడర్ కు  పూర్తి విశ్వాసం ఏర్పడి , అతని కనుసన్నలలో 
  పనిచేసి , ఆ పార్టీ విజయానికి అంకితభావంతో పని చేస్తారు.. అలాగే ఒక పార్టీకి టెక్నాలిజి  వినియోగం కూడా ఈ రోజుల్లో  అత్యవసరం అయిపోయింది.
  ఇలాంటి  కీలకమైన అంశాలు చూసుకునే సదరు నాయకుడికి ఆ పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడితో సమానంగా గౌరవ మర్యాదలు దక్కుతాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు..

  అలాంటి గురుతుర పాత్ర పోషిస్తున్న  టాలెంట్ ఉన్న వ్యక్తిని , తనకంతగా అవగాహన లేని ప్రత్యక్ష రాజకీయాలలోకి దింపి మంత్రి పదవులు అప్పజెప్పి ,  అందరి చేతా విమర్శించుకునే స్థాయికి పడగొట్టారు. 
   సమర్ధవంతంగా పని  చెయ్యగలిగి , పార్టీని బలోపేతం చేస్తూ , కార్యకర్తల పాలిట దైవంలా ఉండి,
   ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తే గల  సత్తా ఉన్న నాయకుడిని ఇంకేదో ఆశించి లేదా ఆశ చూపి , ఆ స్థానం నుండి తప్పించడం చారిత్రాత్మకతప్పిదం.

Photo Gallery