BREAKING NEWS

గెలుపోటములు సహజం... అవి దైవాధీనం. - 2

          రకరకాల సర్వేలపేరుతో అభ్యర్థుల ఎంపిక చేద్దాం అనుకుని , మళ్ళీ ఎందుకనో ఆ నిర్ణయం మార్చుకుని , ఓడిపోతారు అని తెలిసి కూడా వారికే టికెట్లు ఇచ్చారు. గతంలో కావచ్చు... కావచ్చు... దేశంలో అయినా ,,, రాష్ట్రంలో అయినా.. నియోజకవర్గంలో  అయినా ,, మున్సిపాలిటీ వార్డులో అయినా ,,, అంతెందుకు  చివరాఖరికి  పంచాయితీ  వార్డుల్లో కూడా..వ్యాపారస్తులు ,వర్తకులు , పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలు , ఆయా ప్రాంతాల్లో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న వారు ఇలా అనేక మందికి అధికారపార్టీ వారితో సత్సంబంధాలు కలిగి ఉండడం అత్యవసరం.

అదే సమయంలో వారందరి ఆర్ధిక , హార్ధిక సహాయ సహకారాలు అధికారపార్టీకి  అత్యంత కీలకం. కాబట్టి ఉభయులు ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం పాటిస్తూ ,, ఒకరికి ఒకరు అండగా ఉంటారు.

    ఇదంతా బహిరంగమే అయినా కొంచెం గోప్యత  అవసరం. అందుకే పూర్వం ఇలాంటి వారు తెరముందుకు రాకుండా , తెరవెనుకే ఉంటూ తమ అవసరాలు ప్రభుత్వం ద్వారా తీర్చుకుంటూ ,, తమ అవసరం ప్రభుత్వాలకు వచ్చినప్పుడు సహాయపడేవారు. ఫలితంగా వ్యాపారస్తులపై ప్రజలకు సహజంగా ఉండే వ్యతిరేఖతకు గురి అయ్యే అవకాశం ఉండేది కాదు. 

  .          కానీ గత కొన్నాళ్లుగా ఈ వ్యక్తులలో మార్పు వచ్చింది. అధికారదర్పం రుచి చూడాలని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి  విపరీతంగా , విచ్చలవిడిగా  డబ్బు ఖర్చు పెట్టే సంస్కృతిని ప్రవేశపెట్టారు. ఈ  (కు) సంస్కృతి ఎంతగా వెర్రి తలలేసిందంటే రాజకీయాలలోకి రావాలంటే తప్పనిసరిగా వ్యాపారవేత్త  అయిఉండాలి అనే  కనీస నిబంధన ఉందేమో అనేంతగా ప్రజలు భావిస్తున్నారు. పార్టీ అధినేత మీద అంతగా వ్యతిరేఖత లేకపోయినప్పటికిని ఆయా వ్యాపారవేత్తల మీద ప్రజలకు ఉన్న వ్యతిరేఖతను  ఆవిధంగా చూపించారు.

       అయితే ఇక్కడ మరో ముఖ్యవిషయం గమనించాలి .. ఈ పార్టీని కాదని మరో పార్టీని గెలిపించారు కదా !! మరి వారు మంచివారా ?? ఏ తప్పులు చేయలేదా ???" పెనం మీద నుండి పొయ్యిలోకి పడినట్టు " పరిస్థితి అయితే ఏం చేస్తారు ??? అని కొంతమంది అభిప్రాయం ..

                       కానీ . మనం ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడ ప్రమాదం జరుగుతుంది అని తెలిసిన వెంటనే ప్రక్కకి పోతామే తప్ప అక్కడ కూడా ప్రమాదం జరుగుతుందేమో అనే ఆలోచన ఉండదు. ఇది మానవ సహజం... అందుకే ... ఈ పార్టీని కాదనుకున్నారే  కానీ ఆ పార్టీ ఏం చేస్తుందో అని ఆలోచించనేలేదు. ఇక మరో విషయం కూడా గమనిస్తే ..
      EVM లపై  సందేహాలు.  అదేం విచిత్రమో కానీ ఓడినపార్టీయే అనుమానాలు వ్యక్తం చేస్తాయి.

      గెలిచిన పార్టీ కిమ్మనదు. ఇప్పుడు EVM లతో గెలిచి , ఆ గెలుపును పూర్తిగా ఎంజాయ్ చేసి , తర్వాతి ఎన్నికలలో కనుక పొరబాటున ఓడిపోతే వారు కూడా EVM లపై సందేహించడం అప్పుడు మొదలు పెడతారు. 

      ఏది ఏమైనా ఈఎన్నికలలో  అధికారపార్టీ సాధించిన ఘనవిజయం సామాన్యమైనది కాదు..

      కానీ .. ఇదే శాశ్వితం అనుకుని గత అధికారపార్టీ చేసిన తప్పులనే  చేస్తే ప్రజలు వీరికి కూడా తగు గుణపాఠం చెబుతారనడంలో ఎటువంటి సందేహం లేదు..
      తస్మాత్ ... జాగ్రత్త ...!!!

Photo Gallery