BREAKING NEWS

ఈ చదువులు అవసరమా???

సినిమా.... రెండున్నర గంటల పాటు మనకు ఆనందాన్ని ఇచ్చే సాధనం. నిజ జీవితానికి దగ్గరగా ఉండే సినిమాలు కొన్ని అయితే వాస్తవ జీవితానికి సంబంధం లేకుండా ఊహా ప్రపంచంలో తేలిపోయే లా చేసే సినిమాలు మరికొన్ని. అయితే సినిమాలో కనిపించే ప్రతి లొకేషన్ , వస్తువులు అన్నీ నిజమే అనుకుంటున్నారా.?? అయితే ఈ ఆర్టికల్ చదవండి... దాంతో పాటు ప్రస్తుత విద్యా విధానంలో జరుగుతున్న , చేస్తున్న తప్పు కూడా తెలుసుకోండి.... 

              ఉన్నది లేనట్టు... లేనిది ఉన్నట్టు
చేసేది కనికట్టు... అదే ఇంద్రజాలం! అయితే లేనివి ఉన్నట్టు... ఉన్నవి మరింత అద్భుతంగా ఉన్నట్టు చేసే మహా మాయాజాలం ఒకటుంది.

ప్రస్తుత సినిమాల్లో అది అద్భుతాలు
చేస్తోంది. ఏమీ లేని ఎడారుల్లో మంచినీటిని సృష్టించగలదు, అన్నీ ఉన్నా ఏమీ లేని ఎడారిగానూ మార్చేయగలదు... అదే విజువల్ ఎఫెక్ట్స్ (వి.ఎఫ్.ఎక్స్.) ఇసుక
నేల ఉన్న చోట పచ్చిక బయళ్లు,
సెలయేళ్లు సృష్టించగల సత్తా ఉన్న విద్య.. వంద మంది కూడా లేని చోట వేలాది మంచి ప్రజా జన సంద్రాన్ని చిటికెలో క్రియేట్ చేయచ్చు...

ఇలాటివి ఒకటి రెండూ కాదు...  ఎన్నో, మరెన్నో సర్‌ప్రైజింగ్‌, షాకింగ్‌ షాట్స్‌ కళ్ల ముందు నిలిపే గ్రాఫిక్‌ మాయాజాలం... ఈ రోజుల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.. 1000 రూపాయల షార్ట్ ఫిల్మ్ అయినా, 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ సినిమా అయినా ఈ వి.ఎఫ్.ఎక్స్ కచ్చితంగా ఉండాల్సిందే అంటున్నారు ఈ ట్రెండ్.. అప్డేట్ అవుతున్న ఈ స్పీడ్ యుగంలో కొత్తగా వస్తున్న ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో ఇదీ ఒకటి ... 

         సమాజం మారుతోంది. ప్రజల ఇష్టా ఇష్టాలు మారుతున్నాయి... దానికి తగినట్లుగానే కొత్త కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి... కానీ అదేం విచిత్రమో తెలియదు గానీ 10 వ తరగతి పాస్ అయిన వెంటనే ఇంటర్ లో ఎంపిసి, తర్వాత ఏదో బ్రాంచ్ లో నాలుగేళ్లు కష్టపడి ఇంజనీరింగ్ చేసేయడం... కట్ చేస్తే ఇంజనీరింగ్ ఎందుకు చేసాము రా బాబూ అనుకుంటూ ఉండడమే...

చదువు, ఉద్యోగం అంటే కేవలం ఇంజనీరింగ్ మాత్రమేనా?? వేరే ఏమీ లేవా??? ఉన్నాయి. అయితే ఆ విషయం చాలా మందికి తెలియదు.. సారీ ఈ కార్పొరేట్ కాలేజీల మాయలో పడి తెలుసుకోలేకపోతున్నారు... ఎవరైనా ఇంటర్ లో ఏ గ్రూప్ అని అడిగితే "ఎంపిసి" అని చెప్పేవాళ్లు తప్ప "కంప్యూటర్ సైన్స్"

అని చెప్పేవాళ్లు తక్కువ... ఇంటర్ లో కంప్యూటర్స్ ఏంటి అనుకుంటున్నారా... మీకే కాదు చాలా మందికి అంటే ఈ ట్రెండ్ వాళ్ళకి వచ్చే డౌట్ ఇదే... వీటినే వొకేషనల్ కోర్సులు అంటారు. కేవలం కంప్యూటర్స్ ఒక్కటే కాదు. ఫ్యాషన్ డిజైనింగ్, మెడికల్, ఆటోమొబైల్ ఇలా డజన్ల కొద్దీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.. కానీ ఇవేమీ మాకొద్దు. ఎంపీసి మాత్రమే కావాలంటున్నారు.. 

                       ఇంజనీరింగ్ చేస్తేనే మంచి ఉద్యోగాలు వస్తాయి అనుకునే వారు ఉన్నారు చాలా మంది. కానీ అది పూర్తిగా తప్పు... సరిగ్గా చదవాలి గానీ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా లక్షల్లో సంపాదించే అవకాశం ఉంది. కంపెనీ సెక్రటరీ ఉద్యోగం ఒకటి ఉందని ఎంత మందికి తెలుసు? డిమాండ్ ఉండి సరైన అభ్యర్ధులు లేక చాలా వరకు పోస్ట్ లు ఖాళీగానే మిగిలిపోతున్నాయి...

సి.ఏ., లా, ఫ్యాషన్ డిజైనింగ్ , మల్టీ మీడియా, ఆడియో/వీడియో ఎడిటింగ్ , గేమింగ్ , ఇలా ఎన్నో జాబ్ లు మరెన్నో కోర్సులు ఉన్నాయి. ఒకరు ఏది చేస్తే మేము కూడా అదే పని గుడ్డిగా ఫాలో అయిపోతాం అని కాకుండా కాసేపు ఆలోచించండి... ముందు పిల్లలకి ఏ విషయంలో ఆసక్తి ఉందో తెలుసుకోండి. చదువు అంటే కేవలం ఇంజనీరింగ్ మాత్రమే కాదు అని గుర్తించండి... గుర్తుంచుకోండి.... 
 
 

Photo Gallery