BREAKING NEWS

సమ్మర్... తాగునీటి సమస్య

సమ్మర్... ఎంతో సంతోషాన్ని, మరెన్నో సరదాలని, జ్ఞాపకాలను అందించే కాలం. అయితే వీటితో పాటు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ కాలంలో... ఎర్రటి ఎండలో బయట తిరగలేక ,ఇంట్లో వుండలేక నానా ఇబ్బందులు కూడా పడతారు.

మరో వైపు ఎండాకాలంలో ముఖ్యమైనది తాగు నీరు... రోజూ తాగడానికి కూడా నీళ్ళు దొరక్క నానా యాతన పడుతుంటారు... మారుమూల ప్రాంతాల వాళ్ళు మాత్రమే కాదు... నగరంలో నివసిస్తున్న వారు కూడా ఇదే బాధ ఎదుర్కొంటున్నారు... అయితే దీనికి కారణం ఏంటి?? తాగునీటి సమస్య ఎందుకు వస్తోంది??,

భూమి లో నుంచి తాగు నీరు రావాలి అంటే ముందు భూమిలోకి నీరు ఇంకాలి కదా.. అంటే వర్షం కురిసే సమయంలో ఆ నీటిని ఇంకేలా చేస్తే భవిష్యత్తులో మనకు ఉపయోగపడతాయి. అలా జరగాలి అంటే మట్టి నేల ఎక్కువ ఉండాలి. ఇంకుడు గుంతలు తవ్వాలి... కానీ ప్రస్తుత సమాజంలో అవన్నీ ఎక్కడ ఉన్నాయి.

ఏ చిన్న నిర్మాణం చేసినా ఎక్కడా మట్టి కనిపించకుండా నీట్ గా సిమెంట్ తో ప్లాస్టరింగ్ చేసేస్తున్నారు. ఆఖరికి చెట్లు నాటి వాటి చుట్టూ కూడా సిమెంట్ కాంక్రీట్ తో కప్పేస్తున్నారు. ఇక వర్షపు నీరు భూమి లోపలకి వెళ్లేందుకు అవకాశం ఏది??? రోడ్డు మీద పడిన వర్షపు నీటిని అలా రోడ్డు మీదే వదిలేస్తున్నాం... రోజు రోజుకీ భూ గర్భ నీటి వనరుల నిలువ పడిపోతూ వస్తోంది. వర్షపు నీరు వృధాగా వదిలేయడం ఒక కారణం అయితే పెరిగిపోతున్న  పొల్యూషన్ మరో కారణం...

ఎప్పుడో వాడి పడేసిన ప్లాస్టిక్ వస్తువులు భూగర్భ జల వనరులు కలుషితం అయిపోయేలా చేస్తున్నాయి... దీంతో చాలా ప్రాంతాల్లో మంచి నీరు కాకపోయినా , కలుషితం అయిపోయినా వేరే మార్గం లేక ఇలాంటి నీళ్ళే తాగుతుంటారు కూడా... ఎన్నో రోగాల బారిన పడుతున్నారు...

ఇకనైనా ఆలోచిద్దాం.... మన భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిద్దాం... మనం ఇలా చేయాలి తలచుకుంటే చాలా సింపుల్ పని.....

Photo Gallery