BREAKING NEWS

వెజ్జీ డిజైన్స్

వేసుకునే బట్టలు, ఉండే ఇల్లు, నడిపే బైక్ ఇవన్నీ మనకు నచ్చిన ట్రెండీ డిజైన్ లో ఉండాలి అనుకుంటాం... ఆ లిస్ట్ లో ఇప్పుడు మనం తినే ఫుడ్ కూడా చేరిపోయింది... అవును మీరు చదివింది నిజమే... ఫుడ్ కి డిజైన్ ఏమిటి, టేస్ట్ ఉంటుంది గానీ అని తెగ ఆలోచించకండి... సింపుల్ గా ఆ ఆర్టికల్ చదివేయండి... మీకే అర్థం అయిపోతుంది... 

"వెజిటబుల్స్‌పై శిల్పాలు చెక్కినారు... మనవాళ్లు టేబుల్‌కే అందాలు తెచ్చినారు...” అని పాడుకోవాలేమో ఈ డిజైన్స్ చూస్తూ ఉంటే.. అన్నీ రకరకాల పళ్ళు , కాయగూరలతో అందంగా మలచిన ఆకృతులు మనల్ని ఇట్టే అట్రాక్ట్ చేసేస్తాయి... ఎర్రగా ఉండే టమాట  అందమైన రోజా పూవుగా మారిపోతుంది. పుచ్చకాయను ప్లవర్‌వేజ్‌ గా ఉపయోగిస్తారు. వంకాయ, ఆనపకాయ, బెండకాయ,, కాకరకాయ ఇలా అన్ని రకాల కాయగూరలు ఏదో ఒక ఆకృతిలో వచ్చేస్తాయి... ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. రోజూ తినే ఫుడ్ కోసం రెస్టారెంట్స్, హోటల్స్ కొత్త విధానం ఫాలో అవుతున్నారు.. అదే ఈ ఫుడ్ కార్వింగ్... కస్టమర్స్ కి అట్రాక్ట్ చేయడంలో ఇదే హిట్ ఫార్ములా.... .

రోడ్డు మీద ఏదైనా ఓ పాము చూస్తే భయపడిపోతాం... అదే పాము మీరు వెళ్ళిన రెస్టారంట్ టేబుల్ మీద ఉంటే??? అమ్మో.. ఇంకేమన్నా ఉందా... అనుకుంటూ పరుగులు తీస్తారు.. కానీ ఈ సారి కాస్త జాగ్రత్తగా చూడండి... అది నిజమైన పాము కాదు.. ఆ ఆకారంలో ఉన్న వంకాయ లేదా కాకరకాయ లాంటి కూరగాయలు అయ్యి ఉండవచ్చు... రోజా భలే ఉందే అని పట్టుకుంటే గట్టిగా తగులుతుంది. అదేమిటి? బీట్రూటో, క్యారెట్లో ఆ రూపంలోకి మారిందని తెలుసుకుని షాక్ అవుతాం... ఇదంతా వెజిటెబుల్‌ కార్వింగ్‌ మహిమ. అత్యంత సహజంగా కూరగాయలను సజీవ శిల్పాల్లా తీర్చిదిద్దుతారు వెజిటబుల్‌ కార్వింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌. ఆ మృదు శిల్పాల ముచ్చట్లు తెలుసుకుందామా...

కార్వింగ్‌ అంటే శిల్పం అని అర్ధం.సాధారణంగా చెక్కతో కానీ రాతితో గానీ శిల్పాలు తయారు చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే... అయితే ఇప్పుడు కూరగాయలతో కూడా శిల్పాలు కాదు కానీ అందమైన ఆకృతులను తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏ రెస్టారెంట్‌కు
వెళ్లినా అక్కడ మనం ఆర్డర్‌చేసిన ఫుడ్‌తో పాటుగా క్యారెట్‌తో కానీ బీట్రూట్‌తో కానీ అందమైన పువ్వులా చెక్కి మన ముందు పెడుతున్నారు. అయితే ఇది కేవలం గార్నిష్‌ కోసమే ఉపయోగిస్తారు. చూడగానే కస్టమర్స్ వాహ్ అనాలి... అందుకే ఎంతో శ్రమ పడి మరీ అందమైన ఆకృతులను తయారుచేస్తున్నారు.  కూరగాయలను అందంగా చెక్కాలి అంటే ఇమాజినేషన్‌ ముఖ్యం అంటు న్నారు కార్వింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌.

అసలు ఇంతకీ ఇది ఎప్పుడు ప్రారంభమయిందనే దానిపై సందేహాలు ఉన్నాయి.. కొంతమంది ఇది పురాతన జపాన్‌ సంప్రదాయంలో ఉంది అని , మరి కొంతమంది 100 సంవత్సరాల క్రితం థాయలాండ్‌లో మొదలైందని , ఇవేమీ కాదు క్రీస్తుపూర్వం నుంచి చైనాలో ఈ కళ ఉంది అని అంటున్నారు. ఎక్కడ మొదలైందో మనకు అవసరం లేదు కానీ ఎక్కడ పుట్టినా సరే ఇది ప్రపంచం మొత్తం పాకిపోయింది. ఎక్కువగా ఆసియా దేశాలలో ఇది పాపులర్‌ అయింది. ఈ సారి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు చూడండి.... ఈ ఫుడ్ కార్వింగ్ ఎంతో ఉపయోగ ఉంటుంది...

Photo Gallery