BREAKING NEWS

మహర్షి... ఓ "రిషి" కథ కాదు

"తినేవాళ్ళు పెరిగిపోతున్నారు... పండించే వాళ్ళు తగ్గిపోతున్నారు..."

మహర్షి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్... ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు.  ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న వాస్తవం కూడా అదే. వేల ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ మాయలో పడి ఎత్తైన భావనలు కట్టేస్తున్నారు. ఇక పండించేందుకు అవకాశం ఎక్కడ??? మహర్షి లాంటి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మరెన్నో రావాలి...

సినిమా... కేవలం సినిమాగా మాత్రమే చూసే వడిలేయరు ప్రేక్షకులు... సినిమా చూసిన వారిలో కనీసం 10 శాతం మంది అయినా సినిమా వలన ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో యువత ఎలా చెడిపోవాలో రెచ్చగొట్టే సినిమాలే తప్ప సమాజానికి ఉపయోగపడే సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. చాలా మంది దగ్గర ఒక మాట వింటాం... సినిమాల వలన ఎవరూ చెడిపోరు, బాగుపడరు అని... మంచి జరుగుతుందో లేదో తెలియదు గానీ సినిమాల ప్రభావంతో కచ్ఛితంగా చెడు దారిలో పయనించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య వస్తున్న సినిమాల్లో చాలా వరకు భాగం నెగిటివ్ నీ హీరోయిజం గా చూపిస్తున్నారు..

ఎక్కడో సినిమా చివర్లో అలా చేయడం సరికాదు అంటూ ఓ చిన్న మెసేజ్ ఇస్తున్నారు. సినిమాల్లో హీరోలను, నటులను అనుకరించడం ఎప్పటి నుంచో వస్తున్న అలవాటు. అదే విధంగా యూత్ చిత్రాల పేరుతో వస్తున్న సినిమాలను కూడా అదే విధంగా ఫాలో అయిపోతున్నారు. అదే హీరోయిజం అనుకునే భ్రమలో ఉన్నారు... సో సినిమాలు తీసేవాళ్ళు కాస్త అలోచించి తీయండి. మంచి సినిమాతో సమాజాన్ని మార్చేయాల్సిన అవసరం లేదు. కనీసం చెడగొట్టకుండ ఉండచ్చు...

ఇక తాజా సినిమా మహర్షి... ముఖ్యమైన అంశంగా రైతు సమస్యను తీసుకున్నారు. రైతు పడుతున్న ఇబ్బందులను నిజంగా చూపించారు. ఆ సమస్యకు పరిష్కారం కూడా చూపించారు. "వీకెండ్ వ్యవసాయం"... నిజంగా ఈ కాన్సెప్ట్ అద్భుతం అనే చెప్పాలి... సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కేవలం 5 రోజుల మాత్రమే వర్క్ ఉంటుంది. వీకెండ్స్ లో ఖాళీ గానే ఉంటారు. ఆ సమయంలో సరదాగా దగ్గర్లోని పల్లెటూర్లో వ్యవసాయం చేస్తే...

ఎంతో బాగుంటుంది కదా... రైతులకు సహాయంగా ఉంటుంది. వ్యవసాయం కష్టం ఎంతో కూడా ఇప్పటి తరంకు తెలుస్తాయి కూడా... గెలవడం అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు. అందరితో కలిసి ఉంటూ బంధాలు పెంచుకోవడం అని చాలా చక్కని మెసేజ్ ఇచ్చారు.. నమ్మిన స్నేహితుడితో ఎలా ఉండాలి... ఇలా ఒకటీ రెండూ కాదు ఎన్నో విషయాలు ఈ జనరేషన్ యువత తెలుసుకోవచ్చు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి... చూసి ఎంజాయ్ చేసి వదిలేయడం కాదు. సినిమాలో చూపించిన వాటిని పాటించడానికి కాస్త ప్రయత్నించండి...

అవసరం లేని సినిమాలు, తప్పుడు పనులనే హీరోయిజం అనుకుంటూ పాటించడం కాదు. ఇలాంటి మంచి సినిమాని కూడా చూసి పాటించండి... రియల్ హీరోస్ అనిపించుకోండి...

Photo Gallery