BREAKING NEWS

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం: ఈ ప్రమాదకరమైన సమస్యలు రాకుండా ఉండాలంటే

ఎంత మంచి జీవన విధానాన్ని పాటిస్తే అంత ఆరోగ్యంగా ఉండడానికి వీలు అవుతుంది. పోషకాహారం తీసుకోవడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకుంటూ ఉండాలి. కొన్ని కొన్ని సార్లు చెడు అలవాట్లు ఆరోగ్యానికి ఎన్నో సమస్యలు తీసుకు వస్తాయి. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ మాటలు మనం చాలా సార్లు వినే ఉంటాం.
 
అయితే చాలా మంది పొగాకు కి బానిసలై పోతున్నారు. ఎంతో మంది మానేద్దాం అనుకున్న కూడ మానలేక దానికి తీవ్రంగా అలవాటు పడి పోతున్నారు. ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దీని కోసం పూర్తిగా చూడండి.
 
 2021 పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘కమిట్‌ టూ క్విట్‌' నిర్ధారించారు. సాధారణంగా పొగాకు వల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందరో మందికి తీవ్రమైన సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఇటువంటి అలవాటు నుండి దూరంగా ఉండటం మంచిది .లేదు అంటే జీవితాన్నే కోల్పోవాల్సి వస్తుంది.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ప్రకారం 2018 లో పొగాకు బారిన పడి ఎనిమిది మిలియన్ల మరణించారు. 
 
పొగాకు వల్ల కలిగే ఇబ్బందులు:
 
దాన్ని మానేయడానికి అవగాహన కార్యక్రమాలు కూడా జరుపుకుంటారు. పొగాకు వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది ఇప్పుడు చూస్తే... ఊపిరి తిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, క్షయ వంటి సమస్యలు వస్తాయి.
 
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం భారత దేశం లో క్యాన్సర్ బారిన పడ్డ వారిలో 30 శాతం మంది పొగాకు కారణంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీని బట్టి పొగాకు ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు.
 
ఇటువంటి చెడు అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. లేదు అంటే ఎన్నో సమస్యలకు ఇది కారణం అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988లో పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించింది. ఈ మేరకు మే 31 వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకున్నారు.
 
ప్రతి సంవత్సరం మే 31వ తేదీన పొగాకు వలన కలిగే ఇబ్బందులు, దాని వల్ల ఏర్పడే సమస్యలు, పొగాకు నుండి దూరంగా ఉంటే ఏమవుతుంది..?, ఎలా మానేయాలి వంటి అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి తీవ్రంగా ఉండడం కారణంగా ప్రజలు ఒక చోట కలిసే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇంటర్నెట్ ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
 
కరోనా మహమ్మారి ఎంతో తీవ్రంగా ఉంది. ఇటీవల చాలా మంది మరణించడం కూడా జరిగింది ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి వీలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే బయటికి వెళ్ళడం, ఒక వేళ బయటకు వెళ్ళిన మాస్కులు ధరించడం వచ్చిన వెంటనే అప్లై చేసుకోవడానికి లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
 
కరోనా బారిన పడి చనిపోయిన వారిలో చాలా మంది పొగాకు తాగే వారు ఉన్నారు. అయితే ఆ అలవాటు ఉన్న వాళ్ళకి కరోనా ప్రాణాంతకంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ తెలిపారు. పొగాకు సేవించిన వారికి కరోనా సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉందని తెలిపారు. పొగతాగే వారి లో గుండె సంబంధిత సమస్యలు వంటి సమస్యలు కూడా వస్తాయని అన్నారు. 
 
పొగ తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు:
 
పొగ తాగడం వల్ల ప్రతి సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ లో 4,80,000 మంది మరణిస్తున్నారు అంటే ప్రతి ఐదుగురి లో ఒకరు పొగాకు కారణంగా యునైటెడ్ స్టేట్స్ లో మరణిస్తున్నారు. సంవత్సరం సంవత్సరానికి మరణాలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. పొగాకు కారణంగా కార్డియో వాస్క్యులర్ సమస్యలు కూడా వస్తున్నాయి. స్మోకింగ్ చేసిన వాళ్లలో హార్ట్ బీట్ ఫాస్ట్ గా ఉండడం బిపి ఎక్కువ అవడం నాటి సమస్యలు కూడా ఉంటాయి.
 
పొగాకు తీసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం వుంది. నోటికి సంబంధించిన అన్ని క్యాన్సర్లు కూడా వస్తాయి. చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం, పళ్ళు రంగు మారడం, పళ్ళు ఊడిపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. సిగరెట్ స్మోకింగ్ కంటే పొగాకు లో ఎక్కువ నికోటిన్ ఉంటుంది. 
 
దీని వలన అది శరీరం లోకి వెళుతుంది. దీనితో ఓరల్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. పొగాకు నమిలే అలవాటు మానుకోవడం మంచిది. సిగరెట్ స్మోకింగ్ లాగ ఆల్కహాల్ సేవించడం లాగ పొగాకు నమలడం కూడా ఒక వ్యసనం.