ఆమె పాప్ చేసి
పాడితే,
ఆ పాటకు
అప్పట్లో తెగ క్రేజ్..
పాత పాటలకు
రాప్ జోడిస్తే,
ఇంకేముంది
హిట్ ఆల్బమ్ లే…
ఆమె ఒక
గాయని,
డాన్సర్,
వ్యాపారవేత్త..
అంతేనా..
అలై ఫౌండేషన్ నుంచి మొదలై,
కొవిడ్ హెల్ప్ లైన్ దాకా ఆమె సేవాప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆమె మరెవరో కాదు గాయని 'స్మిత'.
గతేడాది వచ్చిన కొవిడ్ మహమ్మారికి చాలామంది కూలీలు, నిరుపేదలు ఉపాధి లేక ఆకలితో అలమటించారు. అప్పుడు వాళ్ల ఆకలి తీర్చడానికి మేము మొదట 2వేల ఆహార ప్యాకెట్లతో మొదలుపెట్టి 3వేలు, 4వేలు అలా ఆహారం ప్యాకెట్లను తయారు చేయించి రోజురోజుకూ పెంచుకుంటూ అందరికి పంచాం. మొదటిసారి వచ్చిన కొవిడ్ సమస్య ఆకలైతే, ఈ సెకండ్‌వేవ్‌లో వచ్చిన ముప్పు ఆకలి కాదు.. ఆక్సిజన్.
రెండునెలలుగా కోరలు చాచిన కొవిడ్ కు ఆక్సిజన్ సకాలంలో అందక రోజుకు కొన్ని వేలమంది చనిపోవడం చూశాం. ఎలాగైనా సరే వీలైనంతమేర ఆక్సిజన్ అందించాలని నిర్ణయించుకున్నాను.ఆక్సిజన్ ఎలా తయారవుతుంది, ఎక్కడ్నుంచి తీసుకురావాలనే అంశాలేవి తెలియవు.'మంచి చేయాలని సంకల్పిస్తే, ఆ పనికి మార్గాలు అవే దొరుకుతాయనిపించింది'.
ఈ ఆలోచన వచ్చి రాగానే నాకు తెలిసిన స్నేహితులతో మాట్లాడా. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను కొనొచ్చని వాళ్లు సలహా ఇచ్చారు. డాక్టర్లతో మాట్లాడి ఎటువంటి కాన్సంట్రేట్లయితే బాగా పనికొస్తాయి, వాటిని అవసరమున్నచోట్లకు తీసుకెళ్లడానికి ఎన్నిరోజుల సమయం పడుతుందనే విషయాలు తెలుసుకోవడానికి దాదాపు 17రోజుల సమయం పట్టింది.
ఎంత ఖర్చైనా సరే వీటిని ఏర్పాటు చేయాలనుకున్నాను. ముందుగా 300ల మందికి ఆక్సిజన్ బెడ్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
నేను కొన్నేళ్లుగా ‘ఈయో ఆంధ్రప్రదేశ్’ చాప్టర్ కు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నా. అందువల్ల ఈ విషయాన్ని తోటి సభ్యులతోనూ చర్చించా. అందరం కలిస్తే ఆక్సిజన్ బెడ్ల కొరత కొంత తీర్చవచ్చని అనుకున్నాం. అలై ఫౌండేషన్, ఈయో ఆంధ్రప్రదేశ్‌లతో కలిసి విజయవాడ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, అనంతపురం, హైదరాబాద్ అన్ని కలిపి 6 ప్రాంతాలను ఎంపిక చేసుకున్నాం.
ముందుగా ఈ చాప్టర్ కు చెందిన 26 సభ్యులతో చర్చించా. నావరకు 200 నుంచి 300ల వరకు ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయాలని భావించా. కానీ వాళ్ళతో నా ఆలోచనను పంచుకున్న తర్వాత మొత్తం 600ల బెడ్లను ఏర్పాటు చేయాలని ఒక టార్గెట్ గా పెట్టుకున్నాం.అన్నిచోట్లా కాన్సంట్రేట్లు, సిలిండర్లు, ఫ్లో మీటర్ ధరలు పెరిగిపోయాయి. అయినా సరే కొని, అందించాలనుకున్నాం.
నేను హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నా. ఏదో పెట్టాం, చేశాం అని కాకుండా పూర్తిస్థాయిలో మా సాయాన్ని అవసరమున్నవారికి అందించాలన్నదే మా లక్ష్యం.
హెల్ప్‌లైన్:- సైబరాబాద్ పోలీసులతో కలిసి ఆక్సిజన్ బ్యాంక్, ఆక్సిజన్ రికవరీ కేంద్రాన్ని ప్రారంభించాం. ఇవేకాక 'హ్యాష్ టాగ్ స్మితాకేర్' పేరుతో కొవిడ్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశా. కాల్ చేస్తే వైద్యుల నుంచి సలహాలు అందుతాయి, రోగి పరిస్థితి మరికఠినంగా ఉంటే వాళ్లే కొవిడ్ బాధితుల వద్దకు వెళ్లేలా ఏర్పాట్లు చేశాం.
అందుకే అందరికి తేలికగా గుర్తుండేలా హ్యాష్ టాగ్ స్మితాకేర్ పేరుతో ఒక ట్వీటర్ ఖాతాను తెరిచాం. ఇందులో అవసరమున్న విషయాన్ని పొందుపరిస్తే చాలు మా బృందసభ్యులు ప్రతిస్పందించి, సమస్యను పరిష్కరిస్తారు.ఆక్సిజన్ పడకలు ఇలా:-
విజయవాడలో వెన్యూ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రభుత్వం కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చింది. అందులో 100 ఆక్సిజన్ పడకలు సిద్ధం చేశారు. ఇంకా కావాల్సి ఉండటంతో బెంగళూర్ నుంచి కార్డ్ బోర్డ్ తో ఆక్సిజన్ బెడ్లను తయారు చేయించాం. ఇవి 300లకిలోల బరువును ఆపుతాయి. వాటర్ ప్రూఫ్ కూడా. వీటిని తిరిగి రీసైకిల్ చేయెచ్చు. నలుగురు కలిసి రెండు గంటల్లో ఆ 100బెడ్లని తయారుచేసి పెట్టారు.
వీటిని ముందుగా విజయవాడలో ఉపయోగించాలనుకున్నాం. 24 గంటల్లో 15మంది వైద్యులను, అత్యవసర మెడికల్ కిట్లను ఏర్పాటు చేశాం. ఈ 6 కేంద్రాల్లో హెల్ప్ లైన్ ను ప్రారంభించాం. చాలామంది సినీప్రముఖులు ఇందులో చేరారు. మా ఫౌండేషన్ ద్వారా త్వరలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించాలనుకుంటున్నాం.
ప్రస్తుతం...I was so happy when I received a request from the Army for their hospital taking care of the families of our Jawans. At least we got an opportunity to do this for them after all they do for us 🙏🏼 #smitacare #Alai https://t.co/TrulrrJnk3
— Smita (@smitapop) May 27, 2021
నాకిష్టమైన సంగీతాన్ని ప్రాక్టీస్ చేస్తూనే, మరోపక్క వీలైనంత ఎక్కువమందికి సాయం చేయాలనుకుంటున్నా. ఈ సేవల్ని మా బృందసభ్యలుతో కలిపి నిరంతరాయంగా కొనసాగించాలనుకుంటున్నా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.