BREAKING NEWS

ఏపీలో ఎక్కువవుతున్న కరోనా కేసులు... తగ్గని కష్టాలు....!

కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నిజంగా ఇది ఎందరో మందిని ఇబ్బందుల లోకి పెట్టేస్తోంది. ఇటువంటి సమయం లో బయటికి వెళ్లకుండా ఉండటమే మంచిది అదే విధంగా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ మహమ్మారిని తరిమికొట్టడం కష్టమై పోతోంది.
 
ఎందరో మందిని ఇప్పటికే ఈ మహమ్మారి బలి తీసుకుంది. ఇంకా దీని యొక్క ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ 10 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో నమోదవుతున్నాయి. దీంతో మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇది ఇలా ఉంటే మరణాలు కూడా రికార్డు స్థాయి లో నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి ఎప్పుడు ఎవరిని బలి తీసుకుంటుందో తెలియని పరిస్థితి అయిపొయింది. 
 
గడిచిన 24 గంటల వ్యవధి లో ఏపీలో కొత్తగా 18,972 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే ఆంధ్ర రాష్ట్రం లో మరో 71 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకు  ఏపీలో 11,63,994 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఏపీ ప్రభుత్వం 1,15,275 కరోనా పరీక్షలు చేసింది. 
 
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయలో 1,51,852 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం లో కరోనా తో మరణించిన వారి లో చూస్తే..... 
 
విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లో 9 మంది ఉండగా  అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాల్లో ఏడుగురు చొప్పున చనిపోయారు. దీనిని అస్సలు నిర్లక్ష్యం చెయ్యకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకుని వ్యవహరించడం చాల ముఖ్యం. ఇంటి పట్టునే ఉండడం, అత్యవసరం అయితే మాత్రమే బయటికి వెళ్లడం చేయాలి.
 
ఒక వేళ బయటకు వెళ్ళిన సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మాస్కు ధరించాలి. ఒకవేళ వీలైతే మీరు డబల్ మాస్కులు ధరించండి, దీని వల్ల కాస్త వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి సహాయ పడుతుంది. బయట నుంచి వచ్చిన తర్వాత శానిటైజర్ వాడడం పదే పదే చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం లాంటివి చేయాలి. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.
 
ఆంధ్ర ప్రదేశ్ లో చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల ఆక్సిజన్ ఇబ్బందులు కూడా వస్తున్నట్లు మనం వింటున్నాం. ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతో మంది ప్రాణాలు విడిచి పెడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే.... ఆంధ్ర ప్రదేశ్ లో రెండు జిల్లాల్లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
వాటి వివరాల లోకి వెళితే..  అనంతపూర్ మరియు కర్నూల్ లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండడం తో ప్రజలు ప్రాణాలు వదిలేస్తున్నారు. 11 మంది అనంత పూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో శనివారం నాడు మరణించారు. ఇది ఇలా ఉండగా కర్నూల్ ప్రైవేట్ ఆస్పత్రి లో శనివారం నాడు ఐదుగురు మరణించడం జరిగింది.
 
అనంతపూర్ జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ కోవిడ్ 19 కారణంగా అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించారు. కానీ దీనికి గల కారణాలు ఏమిటో చెప్పలేదు పేషెంట్లు తాలూక బంధువులు ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయినట్లు చెప్పడం జరిగింది.
 
అనంతపూర్ ప్రభుత్వ ఆస్పత్రి లో చని పోయిన 14 మందిలో ఆరుగురు ఆర్థోపెడిక్ వార్డు లో  ఉన్నట్లు.... నలుగురు చెస్ట్ వార్డ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన నలుగురు 180 పేషెంట్లు తో పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నారు.
 
దేశమంతా కూడా ఆక్సిజన్ కొరత తో ఉంది నిజంగా రానున్న రోజుల్లో ఇది మరి కొంచం ఎక్కువ అయి పోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనా ఆక్సిజన్ కొరత తో మృత్యు వాత పాడడం ఘోరమే. 
 
దేశ  వ్యాప్తంగా చూస్తే.... మంగళవారం 357,229 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 20 మిలియన్ల మందికి ఇప్పటి వరకూ కరోనా రావడం జరిగింది. ఇది ఇలా ఉండగా మరణాల సంఖ్య 222,408 కు చేరడం కూడా జరిగింది. 
 
అయితే ఈ పరిస్థితి ఇంకా సమాప్తం అవ్వలేదు ఇంకా కొన్ని రోజుల పాటు ఈ దుస్థితి వుండబోతున్నట్టు తెలుస్తోంది. రాబోయే నాలుగు నుంచి ఆరు వారాలు భారత దేశానికి అత్యంత గడ్డు కాలంగా ఉండచ్చు అని బ్రౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ ఆశిష్ చెప్పడం జరిగింది. 
 
ఆరు లేదా ఎనిమిది వారాల వరకు కూడా ఈ పరిస్థితి ఉండొచ్చు అని తెలియజేసారు. ఇది ఇలా ఉంటే రోజు వారీ కొత్త కేసుల సంఖ్య అధికంగా రికార్డు అయ్యే అవకాశం ఉన్నట్టు మంత్రిత్వ శాఖ అంది. ఢిల్లీ, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్రలతో సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. స్ట్రిక్ట్ గా కనుక లాక్ డౌన్ ని నిర్వహిస్తే వీటికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు.