BREAKING NEWS

పిల్లల్లో కరోనాని ఇలా గుర్తించండి..!

కరోనా మహమ్మారి అందర్నీ పట్టి పీడిస్తోంది. నిజంగా దాని నుంచి బయట పడటం కష్టమైన పని అని చెప్పాలి. ఇటువంటి సమయం లో పెద్దలు, పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత వీలైతే అంత ఇంట్లోనే ఉండటం మంచిది. 
 
అవసరం అయితేనే బయటికి వెళ్లడం... బయట  వెళ్లినప్పుడు మాస్కు ధరించి తిరిగి వచ్చిన తర్వాత శానిటైజర్ ని ఉపయోగించడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
 
లేదు అంటే కరోనా బారిన పడి పోయే అవకాశాలు ఉన్నాయి. కరోనాతోనే మనం ఇబందులని పడుతుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కూడా అనేక మందిని బలి తీసుకుంటోంది. కరోనా కేవలం పెద్దలకు మాత్రమే కాదు పిల్లల్లో కూడా వ్యాపిస్తోంది. 
 
తల్లిదండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి లేదంటే పిల్లలు కూడా కరోనా బారిన పడిపోయే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఇటువంటి సమయం లో వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటం తల్లిదండ్రుల బాధ్యత ఒక వేళ కనుక పిల్లల్లో ఏమైనా అనారోగ్య లక్షణాలు కనబడితే వెంటనే స్పందించి మెరుగైన చికిత్స ఇప్పించడం చాలా ముఖ్యం.
 
కోవిడ్ వచ్చిన చిన్నారులు లో ఎలాంటి లక్షణాలు కనబడుతున్నాయి...?
 
వాళ్ళలో ఎటువంటి మార్పులు కనబడుతున్నాయి ఇలా అనేక విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చూద్దాం. కరోనా వైరస్ పెద్దలు పిల్లలు అనే భేదం లేకుండా అందరినీ ఇబ్బంది లోకి తోస్తోంది. కొందరిలో ఈ లక్షణాలు కనిపించ వచ్చు..
 
 మరి కొందరి లో ఈ లక్షణాలు కనిపించక పోవచ్చు అయితే లక్షణాలు లేని వారు ఇంట్లో 14 రోజుల పాటు చికిత్స తీసుకుంటే సరి పోతుంది అని నిపుణులు అంటున్నారు కాబట్టి ఏ మాత్రం భయం పెట్టుకోకండి. 
 
ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటూ చికిత్స తీసుకోండి. అదే విధంగా స్వల్ప, మధ్యస్థ లక్షణాలు కనుక ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. చిన్నారుల్లో కనుక కోవిడ్ వస్తే ఈ లక్షణాలు తప్పక ఉంటాయి చిన్నారులు కరోనా బారిన పడ్డారు అంటే వాళ్లలో జ్వరం, దగ్గు, శ్వాస ఆడక పోవడం లేదా శ్వాస తీసుకునేటప్పుడు సమస్యలు వంటివి ఎదురవుతాయి.
 
అదే విధంగా చిన్నారుల్లో అలసట గొంతు సమస్యలు గొంతు నొప్పి, కండరాల నొప్పులు, ముక్కు నుంచి నీరు కారడం తో పాటుగా ఒళ్ళు నొప్పులు, విరేచనాలు, వాసన రుచి తెలియక పోవడం వంటి లక్షణాలు కనపడతాయి అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ లక్షణాలు కనుక  మీ చిన్నారుల లో కనుక కనిపించాయి అంటే తప్పకుండా మీరు జాగ్రత్త పడాలి.
 
 వాళ్ళకి సరైన చికిత్స చేయించాలి నిర్లక్ష్యం చేశారు అంటే వాళ్లకి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల గమనిస్తూ ఉండాలి పరిస్థితి తీవ్రం అవ్వకుండా ముందు గానే జాగ్రత్త పడాలి. దీనితో ఏ ప్రమాదం ఉండదు అని వైద్యులు అంటున్నారు. 
 
ఇక గుండె జబ్బులు, ఊపిరి తిత్తుల సమస్యలు మరియు ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా ఆ చిన్నారులు లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా సూచించడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు ఒక మనిషి దీనికి తగ్గట్టు నడుచుకోవడం మంచిది.
 
కరోనా మహమ్మారి కారణంగా రోజు కి లక్షల కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు కూడా ఎంతో మంది మరణిస్తున్నారు. చిన్న పాటి నిర్లక్ష్యం చేసినా మంచిది కాదు అదే విధంగా ఆక్సిజన్ కొరత కూడా మనం చూస్తున్నాము. దానితో పాటుగా బెడ్స్ కొరత వంటివి కూడా ఆసుపత్రి లో కనపడుతున్నాయి. కాబట్టి అన్నిటి కంటే ముఖ్యమైనది జాగ్రత్తగా ఉండడం. కరోనా బారిన పడకుండా ఉండటానికి వీలైనంత జాగ్రత్తగా ఉండడం లేదు కష్టం.  
 
ఇదిలా ఉంటే భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కి గాను రెండు నుంచి 12 ఏళ్ల చిన్నారుల పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు అనుమతి రావడం తో త్వరలోనే చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తుందని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 
 
తెలంగాణ లో కరోనా మహమ్మారి విస్తృత ఇంకా క్రమంగానే కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా బారిన  ఎక్కువ మంది పడుతున్నారు ఈ సెకండ్ లెవెల్ నుంచి సురక్షితంగా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనితో పాటుగా వ్యాయామం ప్రాణాయామం పై కూడా కాస్త సమయాన్ని వెచ్చించడం మంచిది.
 
మంచి ఆహారం తీసుకోవడం రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. రోగనిరోధక శక్తి ఎంత బాగుంటే అంత ప్రమాదకరం ఉండదు. 
 
కనుక ఈ మహమ్మారి సమయం లో మంచి పోషకాహారం, రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకుంటూ ఉండండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి కూడా మీకు బాగా ఉపయోగపడతాయి.