BREAKING NEWS

బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వలన క్యాన్సర్, కిడ్నీ, డయాబెటిస్ సమస్యలు ఉంటే మరిన్ని ఇబ్బందులు వస్తాయి..!

కరోనా కారణంగా ఎంతో మంది సతమతమవుతున్నారు. రోజు రోజుకీ కరోనా కేసులు కూడా తీవ్రంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇప్పుడే సర్దుకుంటూ ఉన్నాము కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ మహమ్మారి కారణంగా లక్షల మంది వైరస్ తో బాధ పడుతున్నారు అదే విధంగా ఎందరో మంది ప్రాణాలు కూడా విడిచారు.
 
ఇంకా జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. కేసులు తగ్గుతున్నాయి కదా అని జాగ్రత్తగా ఉండడం మానేయ వద్దు. కరోనా మాట పక్కన పెడితే బ్లాక్ ఫంగస్ గురించి ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. దీని కోసం చెప్పుకొని తీరాలి. బ్లాక్ ఫంగస్ లేదా మ్యుకర్ మైకుసెస్ వల్ల కేవలం లక్షల్లో ఒకరు మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది చాలా అరుదుగా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. దీని బారిన పడితే కాస్త ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు.
 
పైగా దీని యొక్క మోర్టాలిటీ రేట్ వచ్చి 50 శాతం ఉంది. ఇటువంటి కష్ట సమయం లో మళ్లీ నిజంగా జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధ పడే వాళ్లు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు. మ్యుకర్ మైకుసెస్ అనేది సైనస్, బ్రెయిన్ లేదా ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేస్తుంది.
 
 ఓరల్ కేవిటీ లేదా బ్రెయిన్ కూడా దీని కారణంగా ఎఫెక్ట్ అవుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్టర్ మరియు స్కిన్ కూడా అనేక సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
 
 బ్లాక్ ఫంగస్ తాలూక లక్షణాలు:
 
 బ్లాక్ ఫంగస్ లక్షణాలు గురించి చూస్తే... చెస్ట్ పైన, రెస్పిరేటరీ సమస్యలు, థ్రోమ్బోసిస్, కళ్ళు సరిగ్గా కనిపించక పోవడం, పళ్ళు ఊడిపోవడం, ముఖం లో ఒక పక్క అంతా పూర్తిగా నొప్పి కలగడం, నాజర్ కంజెషన్  లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ లక్షణాలు కలిగి ఉంటే తప్పకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.
 
అదే విధంగా మరి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. అయితే బ్లాక్ ఫంగస్ ఎలా వ్యాపిస్తుంది...?, ఎవరికి ప్రమాదకరమైనవి...? అనేవి కూడా మనం తెలుసుకుందాం. సాధారణంగా తక్కువ మంది లోనే బ్లాక్ ఫంగస్ వస్తుంది. అది కూడా కరోనా సోకిన తర్వాత రికవరీ అయిపోయిన తర్వాత. ఇలా అప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ అనేది వస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కాబట్టి డయాబెటిస్ పేషంట్స్ కి కరోనా తగ్గిన తర్వాత షుగర్ లెవెల్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి.
 
 వాళ్ళు షుగర్ లెవెల్స్ ని క్రమంగా చెక్ చేయించుకుంటూ ఉండాలి. షుగర్ లెవెల్స్ కనుక మీరు గమనించక పోతే అనేక ఇబ్బందులకు దారి తీస్తుంది అని డాక్టర్లు చెప్పడం జరిగింది. అలానే ఎవరైతే స్టెరాయిడ్స్ ని ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళలో కూడా ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
 
 బ్లాక్ ఫంగస్ రావడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అదే విధంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ లో కూడా మార్పులు కనపడతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా కనబడుతూ ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ ప్రాణాంతకమైన వ్యాధి నుంచి బయట పడాలంటే మంచి ట్రీట్మెంట్ అవసరం.
 
ఒకవేళ కనుక సరైన సమయానికి మంచి ట్రీట్మెంట్ అందక పోయినా కిడ్నీస్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలి. కరోనా వైరస్ వచ్చిన సమయం లో చికిత్స చేసినప్పుడు స్టెరాయిడ్స్ ని  ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సరైన డోస్ వాళ్లకి ఇవ్వాలి ఒక వేళ కనుక ఎక్కువ డోస్ తీసుకున్నట్లయితే డయాబెటిస్, క్యాన్సర్, కిడ్నీ మరియు లివర్ సమస్యలు వుండే వాళ్లకి ఇది మరిన్ని ఇబ్బందులని తీసుకొస్తుంది.
 
దీని కారణంగా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరు ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ఉండటానికి ప్రయత్నాలు చేయాలి. అలానే నేటి కాలం లో గమనించినట్లయితే శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. శ్వాస తీసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉంటే మంచి వెంటిలేషన్ వచ్చేలాగా, గాలి తగిలేలాగ ఉండండి.
 
 అదే విధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్స్  చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితం కనిపిస్తుంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్స్ చేయడం, ప్రోనింగ్ వంటివి చేయడం కనుక చేసినట్లయితే అప్పుడు తప్పకుండా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి మరిచి పోకుండా ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ ఉండండి.
 
 తద్వారా వ్యాధి రాకుండా ఉండటానికి మీకు సహాయపడుతుంది. ఇదిలా ఉంటే కొందరు చిన్న పిల్లల్లో కూడా కరోనా వస్తోంది. వాళ్లకి కూడా మంచి పోషక ఆహారం ఇవ్వడం, శ్వాస కి సంబందించిన వ్యాయామాలు చేయడం  లాంటివి చేస్తూ ఉండటం చేయాలి లేదు అంటే వాళ్లకి కూడా ఇబ్బంది కలుగుతుంది.