BREAKING NEWS

ఫార్ములా కోసం వేధిస్తున్నారని హైకోర్టులో ఆనందయ్య పిటిషన్..!

కరోనా మహమ్మారి అందరిని ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఇటువంటి సమయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఏమాత్రం మీరు అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు. వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండడం బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం.. తిరిగి వచ్చిన వెంటనే శానిటైజర్ ని వాడడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
 
కరోనా తో పాటుగా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్. ఎల్లో ఫంగస్ వంటి సమస్యలు కూడా మనం చూస్తున్నాం. అదే విధంగా కరోనా కారణంగా చాలా మందిలో శ్వాస సంబంధిత సమస్యలు వంటివి కూడా ఎక్కువై పోయాయి. తగిన జాగ్రత్తలు తీసుకోక పోతే ప్రాణానికే ప్రమాదమని ప్రజలు గ్రహించాలి. 
 
ఈ మహమ్మారి వల్ల ఇబ్బంది రాకుండా ఉండాలంటే ప్రతి రోజూ మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవడం ... రోజు కి అరగంట పాటు వ్యాయామం పద్ధతుల్ని పాటించడం..
 
శ్వాస సంబంధిత వ్యాయామాలని అనుసరించడం చాలా ముఖ్యం. అదే విధంగా ఏమైనా ఇబ్బందులు వస్తే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. అంతే కానీ సొంతంగా వైద్యం తీసుకో వద్దు. ఇలా ఈ పద్ధతి లో మీరు అనుసరించడం వల్ల మీకు మంచి కలుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు కూడా మీకు రాకుండా ఉండచ్చు.
 
అయితే ఇటువంటి కష్ట సమయం లో జనానికి కాస్త ఊరటనిచ్చింది ఆనందయ్య ఆయుర్వేద మందు. దీని కోసం చాలా మంది నెల్లూరు వద్ద వున్న కృష్ణ పట్నం కూడా వెళ్లడం మనం విన్నాం. అయితే ఆనందయ్య ఆయుర్వేద మందుని వేప మొదలైన ఔషధ మూలికల్ని ఉపయోగించి తయారు చేస్తున్నట్లు కూడా మనకి తెలుసు.
 
ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆనందయ్య ఈ ఆయుర్వేద మందుని ప్రజలకి అందిస్తున్నాడు. ఈ మందు వాడిన పేషంట్స్ కి చాల రిలీఫ్ గా కూడా ఉన్నట్టు చెప్పడం జరిగింది. ఊపిరి అందడం లేదని ఒక వ్యక్తి ఆనందయ్య మందు కోసం అక్కడికి వెళ్లగా కొన ఊపిరి తో ఉన్న అతనికి ఆనందయ్య ఆయుర్వేద మందు ఇవ్వ గానే పది నుండి పదిహేను నిమిషాల్లో అతను కోలుకోవడం జరిగింది.
 
దీంతో ఈ మందు అద్భుతంగా పని చేస్తుందని అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పలు సూచనలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా గతం లో ఆనందయ్య ఆయుర్వేద మందు పై కొన్ని సూచనలు ఇచ్చారు ఇవన్నీ మనకు తెలిసినవే.
 
ఇదిలా ఉంటే తాజాగా మరో విషయం జరిగింది. అదేమిటంటే ఆనందయ్య కరోనా కి నివారణ గా తయారు చేస్తున్న ఆయుర్వేద మందు ఫార్ములా ని చెప్పాలని కొందరు అధికారులు వేధిస్తున్నారని అందే హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
 
ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్లి పోతే...గురువారం నాడు హైకోర్టు లో ఆనందయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఆనందయ్య తరఫున అడ్వకేట్ అశ్విని కుమార్ ఈ పిటిషన్ వేశారు. అయితే అధికారులు చర్యలు చట్ట విరుద్ధమైనగా ప్రకటించాలని... ఔషధ పంపిణీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు.
 
అయితే ప్రజా సంక్షేమం దృష్ట్యా తాను ఉచితంగా ఆయుర్వేద మందు పంపిణీ చేసేందుకు తగిన రక్షణ కల్పించేలా ఆదేశించాలని తన పిటిషన్ లో ఆనందయ్య చెప్పడం జరిగింది. ఫార్ములా కోసం అధికారులు తనని టార్చర్ చేస్తున్నారు అని అంటున్నారు ఆనందయ్య. అయితే ఫార్ములా బయటికి చెప్తే వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకుంటారు అని ఆందోళన చెందుతున్నారు.
 
ఆనందయ్య లోకాయుక్త ఆదేశాల మేరకు మందు విషయం లో వాస్తవాలు తేల్చేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయుష్ కమిషనర్ తో కలిసి నమూనాలు సేకరించింది.
 
ఇక ఈ మందు ఎలా పని చేస్తుంది...?, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అనేది చూస్తే... ఇప్పటి వరకు ఔషధం పై ప్రజలు ఎవరూ కూడా నెగిటివ్ గా వ్యాఖ్యానాలు చేయ లేదని నివేదిక లో స్పష్టంగా తెలుస్తోంది.
 
అయితే ఈ ఆయుర్వేద ఔషధ తయారీ కి వాడే సూత్రాన్ని వెల్లడించాలని నెల్లూరు డీపీఓ, డీఎంహెచ్‌ఓ, ఎస్పీ, ఆయుష్‌ కమిషనర్‌ వేధిస్తున్నారు అని  ఆనందయ్య అంటున్నారు. దీని కోసం ఆయన మాట్లాడుతూ ఈ ఫార్ములా బయటకు చెబితే కొందరు వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ... నేను దీనిని ఉచితంగా పంపిణీ చేస్తున్నానని ఒక వేళ కనుక ఈ ఫార్ములా బయటకు చెప్తే ఇతర వ్యాపార కంపెనీలు ఎక్కువ ధరకి అమ్మి బిజినెస్ చేస్తారని నాకు ఆందోళన కలుగుతోందని పిటిషన్ లో ఆనందయ్య చెప్పడం జరిగింది.