BREAKING NEWS

కరోనా మహమ్మారిని తరిమికొట్టే కృష్ణపట్నం ఆనందయ్య మందు..!

కరోనా మహమ్మారి అందర్నీ పట్టిపీడిస్తోంది. నిజంగా దీని నుండి బయట పడడం ప్రతి ఒక్కరికి ఎంతో కష్టంగా మారింది. ఇటువంటి కష్ట సమయంలో జనానికి ఊరటనిచ్చింది ఆనందయ్య ఆయుర్వేదం మందు. జనమంతా కూడా నెల్లూరు వెళ్లి మందు కోసం క్యూలో నిల్చున్నారు. నిజంగా ఒక ఆయుర్వేదం మందు అంత లాగ పని చేస్తోంది అంటే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
 
ఎవరి నోట విన్నా ఇప్పుడు అనంతయ్య పేరే మారుమోగుతోంది. ఆ ఆయుర్వేదం మందు కోసం జనాలు కృష్ణపట్నం వెళ్తున్నారు. కొందరయితే ఆ మందు తగ్గుతుందని అక్కడికి వెళుతుంటే మరికొందరైతే ఆయుర్వేదం మందు పని చేయదని వాదనలు తీస్తున్నారు. ఒక కెమిస్ట్రీ లెక్చరర్ ఈ విషయం పై స్పందించి సైన్స్ పేరిట ఆయుర్వేదాన్ని దుష్ప్రచారం చేయవద్దు అని అన్నారు.
 
ఏది ఏమైనా ఇప్పటి వరకు అనంతయ్య మందు పాజిటివ్ గానే ఉంది. ఈ మందులో అల్లం, తాటి బెల్లం, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, వేప, నేరేడు, మామిడి, నేల ఉసిరి, కొండపల్లేరు, తెల్ల జిల్లేడు పువ్వు, కుప్పింటాకు వంటివి దీనిలో వాడుతున్నారని వీటి వల్ల మంచి ప్రయోజనం ఉందని ఆక్సిజన్ లెవెల్స్ కూడా వెంటనే పైకి వస్తున్నాయి అని తెలుస్తోంది.
 
ఆనందయ్య ఆయుర్వేదం మందు పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనలు:
 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ దృష్టికి ఈ మందు వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఐసీఎమ్ఆర్ బృందం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కి వెళ్ళింది. కరోనా  ఆయుర్వేదం మందుని ఆనందయ్య తయారు చేసే వివిధ చెట్ల ఆకులు పదార్థాలు కూడా పరిశీలించారు.
 
 ఏమేమి వస్తువులుని ఆటను ఆయుర్వేదం మందులో కలుపుతున్నారు ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాన్ని వైద్యులు పరిశీలించారు. ఆ తర్వాత వీటి పై ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది, జిల్లా జాయింట్ కలెక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి తదితరులు కూడా ఐసీఎమ్ఆర్ బృందం తో ఉన్నారు.
 
 నిజంగా ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు కూడా ఇప్పటి వరకు అందలేదు. కృష్ణపట్నం లో ఆయుర్వేదం మందు ఇస్తున్న ఆనందయ్య ఇంటి ముందు జనం ఎగబడుతున్నారు. 
 
ఊపిరి అందడం లేదని ఒక వ్యక్తి అక్కడకి వెళ్ళాడు కొనఊపిరితో ఉన్న అతనికి ఆనందయ్య ఆయుర్వేద మందు ఇవ్వగానే 10 నుండి 15 నిమిషాల్లో కోలుకున్నాడు. ఈ మందు చాలా అద్భుతంగా పని చేస్తుందని అతను తెలియజేశాడు.
 
ఇది ఇలా ఉంటే అతను ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. చాలామంది అతనిపై ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు. నెల్లూరులో కార్పొరేట్ దోపిడి సగానికి పడిపోయింది. ఈ ఆయుర్వేదం మందులు చివరికి నిన్నటి తో ప్రభుత్వము గ్రీన్ మార్క్ వేసింది కానీ ఇంకా చిన్నచిన్న అనుమానాలు అలాగే ఉండి పోయాయి.
 
రోజు మొదలయ్యే సరికి ఆ ఊళ్ళో గుంపులు కడుతున్నారు జనాలు. వందల్లో వాహనాలు వేలల్లో బాధితులు అక్కడ ఉన్నారు. ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయినట్టు మనం విన్నాం. కానీ చిన్న పల్లెలో ఆయన ఇచ్చే ఆయుర్వేదం మందు ఏకంగా ఈ మహమ్మారిని తగ్గిస్తుంది అంటే విచిత్రంగా ఉంది.
 
ఆనందయ్య ఆయుర్వేద మందు గురించి కొన్ని విషయాలు:
 

వేప వాడడం వల్ల రోగ నిరోధక చర్యను వేగవంతం చేస్తుంది. అదేవిధంగా బ్యాక్టీరియా వైరస్ వంటి వాటి నుండి రక్షిస్తుంది. అదేవిధంగా తోక మిరియాలను కనుక వాడితే స్వరపేటిక దోషాలను తగ్గిస్తుంది. జలుబు, దగ్గు, కండరాల నొప్పి వంటివి కూడా పోతాయి. ఈ మందులో లవంగాలను కూడా ఉపయోగించారు. లవంగాలు లో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు దగ్గును నివారిస్తుంది.
 
అంతే కాకుండా దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. తలనొప్పి వంటివి కూడా పూర్తిగా తగ్గిపోతాయి. తాటి బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తాటి బెల్లం తో చాలామంది మందులు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ తాటి బెల్లం ని ఉపయోగించడం వల్ల తినడానికి తియ్యగా ఉంటుంది. పైగా ఇది ముందుకి ఏ  నష్టం చేయదు కూడా. ఇక తేనె గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తేన వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కఫాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.
 
కడుపులో పురుగులు తొలగించడానికి మామిడి బాగా ఉపయోగపడుతుంది. కాలేయ సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. నల్ల జీలకర్ర లో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి కడుపు నొప్పి. విరోచనాలు, గ్యాస్ట్రిక్ సమస్యలకు కూడా ఇది మంచి పరిష్కారం చూపిస్తుంది.
 
కొండపల్లేరు ఆయాసం ఉబ్బసం వంటివి తగ్గిస్తుంది.  క్షయ వ్యాధితో వచ్చే దగ్గుని కూడా ఇది నివారిస్తుంది. మూత్ర సంబంధిత రోగాలను కూడా ఇది చిటికెలో పరిష్కారం చూపుతుంది. ఇలా ఇక్కడ ఉండే పదార్థాలు అన్నీ కూడా కరోనా లక్షణాలకి సంబందించినవి. మంచి మంచి ఆయుర్వేద గుణాలు ఉండే ఈ మూలికలను ఉపయోగించి మందు తయారు చేయడం వల్ల రోగులకు చక్కటి పరిష్కారం కనబడుతోంది.