BREAKING NEWS

అద్భుతమైన ఆలయం శ్రీ పానకాల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం...!

మన భారత దేశం లో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే పురాతన ఆలయాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆలయాల్లో ఒకటి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. ఈరోజు పానకాల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయానికి సంబంధించి ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూడండి.
 
మంగళగిరి చాలా ప్రసిద్ధి చెందిన పట్టణం. మంగళగిరి లోని మూల విరాట్టును లక్ష్మీ నరసింహ స్వామి అని పిలుస్తారు. ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారికి మరోపేరు పానకాల లక్ష్మీ నరసింహ స్వామి. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని దర్శించడానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. యుగాంతాన్నీ గ్రహించే శక్తి ఈగలకు చీమలకు ఇక్కడ సంబంధం ఉందని అంటుంటారు. యుగాంతం ఎప్పటికీ ఉత్సుకతని కలిగించే విషయం అనే చెప్పాలి. అయితే ఈ యుగాంతాన్ని చీమలు ఈగలు ముందుగా సూచిస్తాయి అని అంటారు.
 
 మంగళగిరి క్షేత్రం ఎక్కడ ఉంది...?
 
ఇది గుంటూరు జిల్లాలో ఉంది. గుంటూరు విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కిలో మీటర్ల దూరం లో పురాతనమైన లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది.
 
ఎత్తైన గాలి గోపురం:
 
ఇక్కడ ఉండే గాలి గోపురం ఎత్తైన గాలి గోపురాలలో ఒకటి అని చెప్పవచ్చు. ఈ గాలి గోపురం ఈ 1807లో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు. అయితే ఈ గాలి గోపురాన్ని నిర్మించాడనికి రెండు ఏళ్ళు పట్టడం విశేషం. ఈ గాలి గోపురం మొత్తం 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తు ఉంది. కేవలం 49 అడుగుల వెడల్పు ఉన్న పీఠంపై నిలబడడం మరొక విశేషం అనే చెప్పాలి.
 
పానకాల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ స్థల పురాణం:
 
ఈ మంగళగిరి లో మూడు నరసింహ స్వామి వాటి ఆలయాలు ఉన్నాయి. వాటిలో పానకాల నరసింహ స్వామి ఆలయం కూడా ఉంది. హిరణ్యకశిపుని వధ అనంతరం శ్రీ నరసింహ స్వామి చాలా భయంకర రూపం తో రౌద్రంగా అందర్నీ భయ పెట్టే విధంగా ఉన్నారు. అయితే దేవతలంతా ఆ దేవ దేవుని శాంతించమని ప్రార్థించారు. కానీ ఏమాత్రం ఫలితం లేదు. స్వామి వారు శాంతించ లేదు.
 
దీనితో శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతము సమర్పించినది. దానిని గ్రహించి స్వామి శాంతి స్వరూపులు అయినారు. ఈయనకి భక్తులు కృత యుగం లో అమృతాన్ని, త్రేతాయుగం లో ఆవు నెయ్యిని, ద్వాపర యుగం లో ఆవు పాలను సమర్పించారు.
 
లోహం తో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటి తో దర్శనమిస్తుంది. ఇక్కడ భక్తులు తెచ్చిన పానకాన్ని పూజారి గారు స్వామి నోట్లో పోస్తారు. అయితే పానకం సగం అయి పోయిన తర్వాత గుటక వేసిన శబ్దం కూడా వస్తుందట. ఆ తర్వాత ఇక పానకం పోయకుండా మిగిలినది ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. అయితే ఇక్కడ ఇంత పానకం వున్నా సరే ఒక్క చీమ కూడా కనిపించకపోవడం విశేషం.
 
 పానకాల స్వామి మహత్యం:

 
స్వామి పానకం తాగడం ఎంత మటుకు నిజమా అని  పరీక్షించడానికి అక్కడ జమీందారు వెంకటాద్రి నాయుడు తన బావమరిది శక్తి ఉపాసకులు యార్లగడ్డ అంకినీడు తో కలిసి కొండ పై వున్నా స్వామి వారి దగ్గరకి వెళ్లి... తెరుచుకున్న నోట్లో కి తన కుడి చేతిని పెట్టారట. చెయ్యి కొంత దూరం వెళ్ళిన తర్వాత నములుతున్నట్టు అతనికి విపరీతమైన బాధ కలిగిందట.
 
అతని చేతి మీద తేళ్ళు పాములు కరిచిన అంత బాధగా అనిపించింది. దీనితో వెంటనే ఆటను  చెయ్యి బయటకు తీసేయగా... చేతి మీద రక్తమాంసాలు లేక శల్యావశిష్టంగా  ఉండడం చూసి షాక్ అయ్యారు. అప్పుడు స్వామి వారి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం  ఆహారం అయిందని తన జన్మ సార్థకం అయిందని ఆలయం లో గోపురాన్ని కట్టారట.
 
 ఆలయ ఉత్సవాలు:

 
ప్రతి ఏటా ఫాల్గుణ మాసం లో 11 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత పాల్గుణ చతుర్దశి నాడు శాంత నరసింహ స్వామికి శ్రీ దేవి భూదేవి సమేతంగా కళ్యాణం జరుగుతుంది. అలానే పౌర్ణమి రోజు ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడడానికి అనేక మంది భక్తులు వస్తారు. అలానే శ్రీ రామ నవమి, హనుమజ్జయంతి, నృసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి, మహా శివరాత్రి ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి.
 
ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి...?

 
విజయవాడ గుంటూరు రహదారి లో విజయవాడకు 16 కిలో మీటర్ల దూరం లో ఉన్న మంగళగిరి చేరుకోవడానికి రైలు మార్గం లో కానీ రోడ్డు మార్గంలో కానీ వెళ్లొచ్చు. విజయవాడ గుంటూరు ఇక్కడ దగ్గర పట్టణాలు. సౌకర్యాలన్నీ సరిగ్గానే ఉంటాయి కాబట్టి ఇబ్బందులు ఏమీ రావు. సులువుగా మీరు చేరుకోవచ్చు.